Telangana High Court Hearing On Avinash Reddy Anticipatory Bail Petition - Sakshi
Sakshi News home page

అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

Published Thu, May 25 2023 10:40 AM | Last Updated on Thu, May 25 2023 6:48 PM

TS High Court Hearing On Avinash Reddy Anticipatory Bail Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. అవినాష్‌ తరపున సీనియర్‌ కౌన్సిల్‌ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. రేపు ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది. వాదనలను రేపు విననుంది.

వైఎస్‌ అవినాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక, అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్‌ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్‌ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఇది కూడా చదవండి: అవినాష్‌ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా! 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement