సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానంద కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఈ రోజు జాబితాలో లేని పిటిషన్లపై విచారణ చేపట్టలేమని తెలిపింది. దీంతో పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టాలని అవినాష్‌రెడ్డి తరపు లాయర్ కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. గురువారం మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.
మరో ఇద్దరికి సీబీఐ నోటీసులు
వైఎస్ వివేకా కేసులో సీబీఐ తాజాగా మరో ఇద్దరిని విచారణకు పిలిచింది. వైఎస్ వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనయ తుల్లా, ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నిస్తోంది. ఇద్దరి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తోంది. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి స్టేట్ మెంట్‌ను సీబీఐ మంగళవారం రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
(బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదు: కురసాల కన్నబాబు)
కాగా, అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై మంగళవారమే హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి ఇంకా అందకపోవడంతో హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల సారాంశం మేరకే తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్న హైకోర్టు తాజాగా గురువారానికి విచారణ వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారంతో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పు రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
(అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం)
Comments
Please login to add a commentAdd a comment