కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్ బూటా సింగ్ గిల్ హత్యకు గురయ్యాడు. సోమవారం (ఏప్రిల్ 8) దుండగులు అతడిని కాల్చి చంపారు. ఎడ్మంటన్ లోని గురునానక్ సిక్కు ప్రార్థనామందిరం అధ్యక్షుడు ఉన్నారు.సివిల్ ఇంజనీర్ సరబ్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్తితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అల్బెర్టా ప్రావిన్స్‌లోని మిల్‌వుడ్ రెక్ సెంటర్ సమీపంలో గిల్ వ్యాపారానికి సంబంధించిన నిర్మాణ స్థలంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గిల్ హత్య స్థానిక వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు సభ్యుడు టిమ్ ఉప్పల్, మేయర్ అమర్జీత్ సింగ్ సోహి, రేడియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మణిందర్ గిల్, గురుశరణ్ సింగ్ బటర్ లాంటి ప్రముఖులు బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని , సంఘీభావాన్ని ప్రకటించారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రదేశంలో ముగ్గురువ్యక్తులమధ్య వాగ్వాదం జరిగిందని ఇదే కాల్పులకు దారి తీసి ఉంటుందనేది పోలీసుల అనుమానం. అంతేకాదు తనకుబెదిరింపుకాల్స్ వస్తున్నట్టు గతంలో గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుగుతోంది.కాగా ఎడ్మంటన్‌లోని ఇతర బిల్డర్‌లకు కూడా ప్రాణహాని ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. త కొన్ని రోజులుగా, కొత్తగా నిర్మించిన ఇళ్లకు నిప్పు పెట్టిన సంఘటనలు జరిగినట్టు సమాచారం. అంతేకాదు భారతదేశంలోని క్రిమినల్ ముఠాతో లింకున్నముఠా వాట్సాప్ కాల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని స్థానిక పోలిసు అధికారి డేవ్ పాటన్ వెల్లడించారు. ఆరుగురు యువకులను అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment