కెనడాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మృతుడు పిల్లి ఫణి కుమార్(36) వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. దీంతో ఫణి కుమార్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి
కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SAIT)లో సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్ చదివేందుకు 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు ఫణి కుమార్. అయితే డిసెంబర్ 14న ఫణి కుమార్ రూమ్‌మేట్, ట్రక్ డ్రైవర్ తన కమారుడి మరణం గురించి సమాచారం అందించాడని తండ్రి, నాగ ప్రసాద్ తెలిపారు.
గుండెపోటుతో చనిపోయినట్టు భావిస్తున్నప్పటికీ అయితే, ఈ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాల్గరీ పోలీసులు ఫణి కుమార్ వస్తువులను అతని ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకునేందుకు సహకరించాల్సిందిగా నాగప్రసాద్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment