భూ వివాదంలో లాయర్లు, రియల్టర్ అరెస్టు | lowyers, realter arrested in land issue | Sakshi
Sakshi News home page

భూ వివాదంలో లాయర్లు, రియల్టర్ అరెస్టు

Published Tue, Feb 3 2015 8:06 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

lowyers, realter arrested in land issue

గుంటూరు క్రైం: భూమి వ్యవహారంలో గుంటూరు జిల్లా పోలీసులు ఇద్దరు లాయర్లు సహా ఒక రియల్టర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు...నగరంలోని శ్యామలానగర్‌లోని భూమి విషయమై 2007 సంవత్సరం నుంచి కోర్టులో వివాదం నడుస్తోంది. భూమికి సంబంధించిన పత్రాలను దొంగతనం చేసి, వాటిని మార్చి తమను మోసగించారంటూ వి.వెంకట నరసమ్మ, జె.మల్లేశ్వరి అనే ఇద్దరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు అర్బన్ ఏఎస్పీ జె.భాస్కర్‌రావు విచారణ చేపట్టారు. విచారణలో వెల్లడైన ఆధారాల ఆధారంగా ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళలను 15 రోజుల క్రితం అరెస్టు చేశారు. తాజాగా ఈ వ్యవహారంతో సంబంధమున్న న్యాయవాదులు లక్ష్మణ్‌కుమార్, డి.శ్రీనివాసరావుతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement