ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతు పురాణం | TDP Leader Fires On Government Teacher In Nandyala, More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతు పురాణం

Published Fri, Jul 5 2024 5:50 AM | Last Updated on Fri, Jul 5 2024 10:16 AM

TDP leader fires a on government teacher

ప్రభుత్వ టీచర్‌పై టీడీపీ నేత బూతు పురాణం

రేషన్‌ బియ్యాన్ని స్కూల్‌లో పెట్టొద్దన్నందుకు దుర్భాషలు

సాక్షి, టాస్‌్కపోర్సు:  అధికా­ర దర్పంతో టీడీపీ నాయకులు, కార్య­కర్త­లు చెలరేగి­పోతు­న్నారు. తమ ఆగడా­లను అడ్డుకు­న్న వారిపై విరుచు­కుప డుతున్నారు. తాజాగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఓ టీడీపీ నాయకుడు ఇష్టారీతిన బూతులు తిడుతూ బెదిరించాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లె గ్రామంలో జరిగింది. 

ఇటీవల రేషన్‌ డీలర్‌షిప్‌ దక్కించుకున్న టీడీపీ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి  గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రేషన్‌ బియ్యం బస్తాలు దించుతుండగా విద్యార్థులకు ఇబ్బంది అంటూ ఓ ఉపాధ్యాయుడు అడ్డు చెప్పారు. దీంతో టీడీపీ నేత బూతులతో చెలరేగిపోయాడు. ‘ఎవడు ఎంఈవో.. చెçప్పుతో కొడతా.. ఏం పీకుతావ్‌ రా ఎర్రి.. (బూతు)? లోఫర్‌ నా కొడకా.. మాకు ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా? 164 సీట్లొచ్చాయి. 

స్టోర్‌ బియ్యం బడిలో ఎలా దించుతావని మమ్మల్నే ప్రశ్నిస్తావా? ఇక్కడ ఉండలేకపోతే ... (బూతు)’ అంటూ విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఉపాధ్యా­యుడు బిత్తరపోయాడు. సహ ఉపాధ్యాయులు, విద్యార్థుల ముందే ఇలా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడంతో ఆ ఉపాధ్యాయుడు మిన్నకుండిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. టీడీపీ నాయకుడి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత జరిగినా విద్యాశాఖ అధికారులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ స్పందించక పోవడం విచారకరం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement