వైఎస్‌ఆర్ సీపీలో చేరిన విజయభాస్కర్ రెడ్డి
హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. ప్రజల వెంట నడుస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పలువురు నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ స్వభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.
ఇక, మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ కూడా వైఎస్సార్‌సీపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు.