ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సీఎం నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలను మాత్రమే అభివృద్ధి చేశాడని, దానిని ఆ పార్టీ గ్లోబెల్స్ ప్రచారం చేసుకుని లబ్ధి పొందుతోందని తెహల్కా, ఔట్‌లుక్ మాజీ ఎడిటర్, హార్డ్ న్యూస్ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అమిత్‌సేన్ గుప్త తెలిపారు. మానవ హక్కుల సంఘం దివంగత నేత కే.బాలగోపాల్ రాసిన ‘ముస్లిం ఐడెంటిటీ - హిందుత్వ రాజకీయాలు’ అనే పుస్తకాన్ని స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆదివారం ఆవిష్కరించారు.
మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, ఇలాగే దేశాన్ని అభివృద్ధి చేస్తారని బీజేపీ ప్రచారం చే యడం సరైంది కాదని చెప్పారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ ముస్లిం ఐడెంటిటీ-హిందుత్వ రాజకీయాలు అనే పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. ప్రముఖ కవి ఖాదర్‌మొహిద్దీన్, మానవహక్కుల వేది క జిల్లా కన్వీనర్ జయశ్రీ, తెలుగు అధ్యాపకుడు ఎన్నెస్ ఖలందర్ పాల్గొన్నారు.
కడప కల్చరల్: ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కడప కోటవీధిలోని షహమీరియా షాదీఖానాలో మతోన్మాద వ్యతిరేక సదస్సు నిర్వహించారు. దేశంలో విధ్వంసాలు జరిగినపుడు ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని, మీడియా పదేపదే ఈ ఘటనలను చూపడంతో సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని అమిత్‌సేన్‌గుప్త అన్నారు. పౌరహక్కుల వేదిక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ, షహమీరియా పీఠాధిపతి సయ్యద్‌షా అహ్మద్‌పీర్ షహమీరి మాట్లాడారు. ఆవాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.మగ్బూల్‌బాషా, జిల్లా అధ్యక్షుడు ఎస్.మస్తాన్‌వలీ, జిల్లా కమిటీ ప్రతినిధులు, పౌరహక్కుల వేదిక జిల్లా ప్రతినిధులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.
మోడీ అభివృద్ధిపై గ్లోబెల్ ప్రచారం
Published Mon, Dec 9 2013 4:14 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM
Advertisement
Advertisement