Person killed
-
పాముతో చెలగాటం.. వ్యక్తి మృతి
బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): పామును పట్టుకుని ఆటలాడిన ఓ వ్యక్తి.. అదే పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లె మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ జ్యువెలరీ షాపులోకి సోమవారం మధ్యాహ్నం ఓ నాగుపాము చొరబడింది. షాపు యజమాని ఏమీ చేయలేని పరిస్థితిలో నిమ్మకుండిపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అసాదుల్లా (52) దుకాణంలో ఉన్న నాగుపామును చూసి చేతిలోకి తీసుకుని దాంతో కొంతసేపు ఆటలాడాడు. పామును తల వద్ద పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో అది అతని చేతిపై కాటు వేసింది. దీంతో పామును చితకబాది చంపేశాడు. అయితే, అదే రోజు సాయంత్రం అసాదుల్లా పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరుకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు. -
మానవ మృగాలను శిక్షించాలి
ప్రొద్దుటూరు టౌన్ : జమ్మూకశ్మీర్‌లో 8 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసి చంపిన మానవ మృగాలను చంపాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పుట్టపర్తి సర్కిల్ మీదుగా రాజీవ్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో టీఎన్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు చేతన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్, సాయినాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వినోద్, గురు సుమంత్, రెహమాన్, మల్లికార్జునరెడ్డితోపాటు టీఎన్టీయూసీ హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రసన్న, ఉషా, గరిశపాటి లక్ష్మీదేవి, సీఓలు రసూలమ్మ, విమల, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 రోజులపాటు అత్యంత దారుణంగా హింసించి చంపేసిన కిరాతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. -
ప్రాణం తీసిన ఇడ్లీ!
సాక్షి, చెన్నై: ఇడ్లీలు తినే పోటీలో విషాదం చోటుచేసుకుంది. ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడకడో వ్యక్తి మృతిచెందాడు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తమిళనాడులోని పుదుకోట్టై కీరమంగళంలోని కళ్లిచ్చియమ్మన్ ఆలయంలో మంగళవారం సాయంత్రం నుంచి ప్రత్యేక పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా రాత్రి ఇడ్లీలు తినే పోటీలు సాగాయి. ఇందులో పెద్ద సంఖ్యలో యువకులు తమ సత్తాను చాటుకునే ప్రయత్నం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన చిన్న తంబి(45) అనే వ్యక్తి అతివేగంగా ఇడ్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస ఆడక అవస్థ పడుతున్న అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. ఈ పోటీ మూలంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని చిన్నతంబి భార్య చిత్ర, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు విలపిస్తున్నారు. -
రెండు ఆటోలు ఢీ.. ఒకరి మృతి
ఎనిమిది మందికి గాయాలు సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రైలు కిందపడి వ్యక్తి మృతి
గిద్దలూరు(ప్రకాశం): స్థానిక రైల్వే స్టేషన్లో రైలుకిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి జేపీ చెరువుకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పరదేశి చంద్రశేఖర్‌గా గుర్తించారు. ఇతను స్ర్తీలోలుడని ఇప్పటికే పదుల సంఖ్యలో మహిళలతో సంబంధాలు నడిపాడని, 20 ఏళ్ల కిందటే భార్య బిడ్డలను వదిలేసి పలువురితో సహజీవనం చేసేవాడని స్థానికులు తెలిపారు. గత కొంత కాలంగా తాగుడుకు బానిసైన చంద్రశేఖర్ మద్యం మత్తులో రైలు కింద పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఆకుపాముల(మునగాల): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన 65వ నంబర్ జాతీయ రహాదారిపై మునగాల మండలం కుపాముల శివారులో గంగమ్మ గుడి ఎదురుగా మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన షేక్ షరీఫ్(53) నడిగూడెం మండల కేంద్రంలో వైన్‌షాపులో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగ మంగళవారం రాత్రి 11గంటలకు తన విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై నడిగూడెం నుంచి కోదాడకు వెళుతూ మార్గమధ్యలో ఆకుపాముల శివారులో ఆగ ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో షరీఫ్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ ఖరీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
కేసముద్రం : మనస్తాపంతో పురుగుమందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని కల్వల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామగిరి వీరయ్య(75)కు గత రెండేళ్లుగా కళ్లు కనిపించడం లేదు. అతడి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండటం లేదు. దీంతో మనస్థాపానికి గురైన వీరయ్య ఈనెల 5న సాయంత్రం ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఎంజీఎంకు S తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
తుమ్మపూడి వద్ద రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
దుగ్గిరాల మండలం తుమ్మపూడి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తోన్న ఆటో, టాటా ఏస్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక రు అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. బాధితులు చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మేడ్చల్: రోడ్డు దాటుతున్న పాదచారిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్ రాష్ట్రానికి చెందిన ప్రమోద్యాదవ్(35) మండలంలోని సుతారిగూడలో నివాసముంటూ గ్రామ సమీపంలోని ఓ కోల్డ్ స్టోరేజీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు స్టోరేజీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సూతారిగూడ చెక్‌పోస్టు రోడ్డు దాటుతుండగా రింగు రోడ్డు వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈమేరకు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బావమరుదులు, కానిస్టేబుల్ కొట్టడమే కారణం ? పోలీసులను నిలదీసిన గ్రామస్తులు జియ్యమ్మవలస : మండలంలోని అంకవరం గ్రామానికి చెందిన ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు, మృతుడి తండ్రి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చందాపు అప్పలనాయుడు (40)కి వీరఘట్టాం మండలం తూడి గ్రామానికి చెందిన అమ్మాయితో పదహారు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గొడవ జరిగిన ప్రతిసారీ అమ్మారుు తన కుటుంబ సభ్యులను తీసుకురావడం, వారు వచ్చి అప్పలనాయుడును కొట్టడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇటీవల కూడా భార్యభర్తల మధ్య గొడవ జరగ్గా అమ్మారుు తన సోదరులను రప్పించింది. వారు జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో కలిసి శుక్రవారం గ్రామానికి వచ్చి అప్పలనాయుడును చావబాదారు. అక్కడితో ఆగకుండా కొట్టుకుంటూ జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో మృతుని భార్య అమ్మాయి తన మామ సింహాద్రిని లేపి మీ అబ్బారుు చలనం లేకుండా పడిఉన్నాడని తెలిపింది. వెంటనే సింహాద్రి వచ్చి చూసే సరికి అప్పలనాయుడు ఇంట్లో విగతజీవిగా పడిఉన్నాడు. పోలీసులు, అమ్మారుు సోదరులు కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయూడని సింహాద్రి ఆరోపిస్తున్నాడు. తన కుమారుడు చనిపోరుునా ఇంతవరకు బావమరుదులు, అత్త,మామాలు ఎవ్వరూ రాకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించాడు. ఇదే విషయమై ఎస్సై సాంబశివరావును వివరణ కోరగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు అప్పలనాయుడును స్టేషన్‌కు తీసుకువచ్చి మందలించి, తర్వాత వదిలేశామన్నారు. ఆయన ఎలా చనిపోయిందీ తెలియదని చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసుల తీరు వల్లే అప్పలనాయుడు చనిపోయూడని ఆరోపిస్తూ గ్రామస్తులందరూ పోలీసులను నిలదీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండలంలోని సింగరాజుపల్లికి చెందిన పొనుగోటి శ్రీనివాసరావు(45) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున బైక్ పై వెళ్తుండగా.. బైక్ తూర్పుపల్లి శివారుకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ, రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి, గుర్తు తెలియని వాహనం, బైకర్ మృతి -
కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతి
విద్యుత్‌షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన దుబ్బాక మండలం గంబీర్‌పూరులో బుధవారం జరిగింది. గంబీర్పూరులోని కొరిపాక రవి(28) ఇంటి ముందు బట్టలు అరేస్తుండగా కరెంట్ తీగలు తగిలి విద్యుత్‌షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. -
నిమజ్జనంలో అపశ్రుతి
- చెరువులో పడి వ్యక్తి మృతి వేంసూరు: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భరిణాపాడు నల్ల చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని భరిణాపాడులో ఏ ర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసేం దుకు నల్ల చెరువు వద్దకు తరలించారు. ఈ తరుణంలో గ్రామానికి చెందిన శూరటి శ్రీనివాసరావు(35) వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న క్రమంలో అదుపుతప్పి విగ్రహం కింద పడి మృతి చెందాడు. వియషం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి పర్యవేక్షణలో గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా విగ్రహం నిమజ్జనం చేసిన స్థలం దగ్గరలో శ్రీను మృత దేహం దొరి కింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని తహశీల్దార్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులకు చెందిన వాహనం ఢీ కొట్టడంతో అతడు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు... కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడుకు చెందిన కాండ్రేగుల రాజు (46) మోటారు సైకిల్‌పై వెళ్తున్నాడు. ఏపీఎస్పీకి చెందిన స్కూల్ బస్సు అత డిని భవానీ కాస్టింగ్ వద్ద ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు, అతడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు చెం దిన వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ మృతు డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహంతో జాతీయ రహదారి 216పై రాస్తారోకో చే శారు. పోలీసు బలగాలు మోహరించాయి. నాలుగు గంటలపాటు మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసు అధికారులు వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు బారులు తీరడం తో రాయుడుపాలెం మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిం చారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో మృతుడి బంధువులతో మరోమారు పోలీసులు చర్చిం చారు. వారు వినలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం రాత్రి పది గంటల వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంది. -
గోడకూలి వ్యక్తి మృతి
వర్షం ధాటికి గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో అల్లుసానిపల్లెలో మంగళవారం నాగరాజు(65) అనే వ్యక్తి మరణించాడు. ఇంట్లో నిద్రిస్తుండగా వర్షం ధాటికి పూర్తిగా దెబ్బతిన్న గోడ కూలింది. దీంతో అక్కడే ఉన్న నాగరాజు శిధిలాల కింద కూరుకు పోయి మృతి చెందాడు. -
వాహనం ఢీ వ్యక్తి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తాండూరు మండలంలోని బోయపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలసుకున్న రక్షక్ సిబ్బంది మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
యరగండ్లపల్లి (మర్రిగూడ): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాల య్యాడు. ఈ ఘటన మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. నాంపల్లి సీఐ ఈ.వెంకట్‌రెడి,్డ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యరగండ్లపల్లి గ్రామానికి చెందిన చందా సుధాకర్ (55) మర్రిగూడ నుంచి స్వగ్రామానికి తన స్కూటర్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ డిపొకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మాల్ మీదుగా మిర్యాలగూడకు వెళుతూ యరగండ్లపల్లి శివారులో ఉన్న ముత్యాలమ్మ ఆలయం ములమలుపు వద్ద సుధాకర్ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమరులు ఉన్నారు. సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరళించారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనే లోగానే సుధాకర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం గ్రామస్తులను కలచివేసింది. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మహిళకు తీవ్రగాయాలు ఓదూరు (రామచంద్రపురం) : ఓదూరు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, మహిళ తీవ్రగాయాలపాలైంది. రామచంద్రపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బత్తుల వెంకట కృష్ణారావు (54) (సిద్ధాంతి) ఒక మహిళతో కలసి మోటారు సైకిల్‌పై కాకినాడ వైపు వెళుతున్నారు. ఓదూరు వద్దకు వచ్చేసరికి కాకినాడ నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ సంఘటనలో వెంకట కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందగా, మహిళ తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను స్థానికులు 108 వాహనంలో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వల్లంపూడి(వేపాడ): మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన పటాన మహమ్మద్ అలియాస్ చిన్న (26) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు... వల్లంపూడి గ్రామానికి చెందిన చిన్న వేపాడ గ్రామానికి చెందిన ఎస్.అప్పారావు, ఎస్.శ్రీరాము వద్ద మైక్‌సెట్ లో పనిచేస్తుంటాడు. అప్పారావు, శ్రీరామ్‌లు శనివారం సాయంత్రం చిన్నాను మైక్‌సెట్ పని ఉందని తీసుకెళ్లారని, కానీ సోమవారం ఉదయం తన భర్త శవాన్ని ఇంటికి తీసుకువచ్చారని చిన్న భార్య జిలానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్న... అప్పారావు ఇంటిపై చనిపోయాడన్న సమాచా రం వచ్చిందని, అక్కడకు చిన్న తల్లి చాందిని, అత్త సహీద్లు వెళ్లి చూడగా చిన్నా మెడకు కేబుల్ వైర్లు చుట్టుకుని ఉన్నట్లు, నోటి నుంచి రక్తం వస్తున్నట్లు వారు గుర్తించారని జిలానీ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం చేస్తామని ఎస్ఐ తెలిపారు. చిన్నకు ప్రస్తుతం ఆరేళ్ల వయసున్న కుమార్తె నురానీ ఉంది. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
చిట్యాల (గోపాలపురం), : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన భర్త అనంతరం పోలీసులకు లొంగిపోయూడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన కలిదిండి పాటియ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. పాటియ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పాటియ్య స్నేహితుడు, ఆటో డ్రై వర్ ఈడుగుబంటి శ్రీను(31) మూ డేళ్లుగా జ్యోతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అనుమానం వచ్చిన పాటియ్య భార్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. అయితే 20 రోజుల క్రితం చిట్యాలలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన పాటియ్య అక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా బయటకు వచ్చిన జ్యోతి ప్రియుడు శ్రీనుతో కలిసి ఆటోలో ఊరి బయటకు వెళ్లడాన్ని పాటియ్య గమనించాడు. ఊరి బయట భార్య, శ్రీను కలిసి ఉండటాన్ని చూసిన అతను తనతో తీసుకువచ్చిన ఇనుప రాడ్‌తో శ్రీను తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. జ్యోతి పారిపోవడంతో కొనఊపిరితో ఉన్న శ్రీనును ఆటోలో వేసుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చాడు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే శ్రీను మతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పాటియ్య పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు పాటియ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా పథకం ప్రకారం తన భర్తను హత్యచేసినట్లు మృతుని భార్య ఆరోపిస్తోంది. జ్యోతి, ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చే స్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రాఘవ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
పెనుబల్లి, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పెనుబల్లి పంచాయతీ పరిధిలోని వీఎంబంజర వద్ద చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం ముగ్గువెంకటాపురం పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్ ఎస్సీ కాలనీకి చెందిన కలేపల్లి బాబూరావు (40) కలప నరికే పనులకు వీఎంబంజర వచ్చాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఆటోలో తెచ్చిన కలపను రోడ్డు పక్కనే దింపారు. అనంతరం ఆటో రోడ్డు అవతలి వైపు ఉన్న వే బ్రిడ్జి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో బాబూరావు ఆటో వద్దకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా టేకులపల్లి నుంచి పెనుబల్లి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో బాబూరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తోటి కూలీలు పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ విషయాన్ని తోటి కూలీలు బాబూరావు కుటుంబానికి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలివచ్చారు. బాబూరావు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటనా స్థలాన్ని వీఎంబంజర ఎస్సై ఇ. చంద్రమౌళి పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
షాద్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : రోడ్డు దాటుతుండగా ఏదో వాహనం ఢీకొనడంతో ఓ గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ శి వారులో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళుతు న్న ఏదో వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి (30) అక్కడికక్కడే మృ తి చెందాడు. బుధవారం తెల్లవారుజామున జీఎంఆర్ పెట్రోల్ సిబ్బంది గ మనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏ ఎస్ఐ రమేష్‌రెడ్డి పరిశీలించి కేసు ద ర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ తెలిసినవారు ఫోన్ నం. 08548252333, 9440795741, 9440795740కు సంప్రదించాలని కోరారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై గన్నారం వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని సైకిల్‌పై వెలుతున్న పెద్ద కుర్మ గంగమల్లయ్య(65) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గన్నారం గ్రామానికి చెందిన గంగమల్లయ్య పొలం నుంచి సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా హైదరాబాద్ నుంచి బోధన్‌పై వెళ్తున్న డీలక్స్ బస్ ఢీకొట్టింది. సైకిల్‌పై నుంచి కిందపడిన గంగమల్లయ్య తలపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో తలపగిలి అక్కడికక్కిడే మృతిచె ందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా సమీపంలోని టోల్ ప్లాజా వరకు తీసుకువెళ్లి అక్కడి నిలిపి వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గన్నారం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంతో జాతీయర హదారిపై అందోళన చేశారు. నవయుగ కంపెనీ వారే బాధ్యత వహించాలి.. గంగమల్లయ్య మృతికి రహదారి విస్తరణ పనులు చేపట్టిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ వారే బాధ్యత వహించాలని గన్నారం గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చే పట్టారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తిగాకముందే టోల్‌ప్లాజా ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు, రహదారికి ఇరువైపులా బస్‌షెల్లర్లు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రోడ్డు దాటేటప్పుడు వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ సమస్యను కంపెనీ వారి దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇదే స్థలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహంతో రహదారిపై సుమారు 3 గంటల పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. డిచ్పల్లి సీఐ శ్రీశైలం ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సర్వీసు రోడ్లు లేక ప్రమాదాలు జరుగుతున్న విషయం గతంలోనే మీ దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారానికి ఎలాంటి కృషి చేయలేదని ఎమ్మెల్యే గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అప్పటికప్పుడే నవయుగ కంపెనీ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు, బస్షెల్టర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగర డీఎస్పీ అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తె లుసుకున్నారు. బస్‌డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘సిటీలైట్’ ఘటనలో మరో వ్యక్తి మృతి
హైదరాబాద్, న్యూస్‌లైన్: నగరంలో తీవ్ర విషాదం నింపిన సికింద్రాబాద్ సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో మరో వ్యక్తి కన్నుమూశాడు. సుమారు 51 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. తాడ్‌బండ్‌కు చెందిన నర్సింగ్‌రావు (45) చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. జూలై 8న జీహెచ్ఎంసీలో పనిచేసే తన స్నేహితుడు అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు బదులు విధుల్లోకి వెళ్లాడు. ఘటన జరిగిన సమయంలో ఈయన అక్కడే ఉండటంతో శిథిలాల్లో చిక్కుకపోయాడు. కొద్దిసేపటికి శిథిలాల్లో నుంచి బయటపడగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాలు తుంటి వద్ద విరగడంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అలాగే మెడపైన వెన్నుపూస దెబ్బతింది. ఎట్టకేలకు ఆరోగ్యం కుదుటపడడంతో పదిహేనురోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అప్పటినుంచి మంచంపైనే ఉన్న నర్సింగ్‌రావు గురువారం కన్నుమూయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి భార్య,ఒక కూతురు ఉన్నారు. చిన్నతోకట్టలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.