అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | suspicious circumstances person killed | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Published Tue, Feb 24 2015 3:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

suspicious circumstances  person killed

వల్లంపూడి(వేపాడ): మండలంలోని వల్లంపూడి గ్రామానికి చెందిన పటాన మహమ్మద్ అలియాస్ చిన్న (26) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలు... వల్లంపూడి గ్రామానికి చెందిన చిన్న వేపాడ గ్రామానికి చెందిన ఎస్.అప్పారావు, ఎస్.శ్రీరాము వద్ద మైక్‌సెట్ లో పనిచేస్తుంటాడు. అప్పారావు, శ్రీరామ్‌లు శనివారం సాయంత్రం చిన్నాను మైక్‌సెట్ పని ఉందని తీసుకెళ్లారని, కానీ సోమవారం ఉదయం తన భర్త శవాన్ని ఇంటికి తీసుకువచ్చారని చిన్న భార్య జిలానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్న... అప్పారావు ఇంటిపై చనిపోయాడన్న సమాచా రం వచ్చిందని, అక్కడకు చిన్న తల్లి చాందిని, అత్త సహీద్‌లు వెళ్లి చూడగా చిన్నా మెడకు కేబుల్ వైర్లు చుట్టుకుని ఉన్నట్లు, నోటి నుంచి రక్తం వస్తున్నట్లు వారు గుర్తించారని జిలానీ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. చిన్నకు ప్రస్తుతం ఆరేళ్ల వయసున్న కుమార్తె నురానీ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement