రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాల య్యాడు. ఈ ఘటన మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. నాంపల్లి సీఐ ఈ.వెంకట్‌రెడి
యరగండ్లపల్లి (మర్రిగూడ): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాల య్యాడు. ఈ ఘటన మండలంలోని యరగండ్లపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. నాంపల్లి సీఐ ఈ.వెంకట్‌రెడి,్డ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యరగండ్లపల్లి గ్రామానికి చెందిన చందా సుధాకర్ (55) మర్రిగూడ నుంచి స్వగ్రామానికి తన స్కూటర్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో మిర్యాలగూడ డిపొకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి మాల్ మీదుగా మిర్యాలగూడకు వెళుతూ యరగండ్లపల్లి శివారులో ఉన్న ముత్యాలమ్మ ఆలయం ములమలుపు వద్ద సుధాకర్ స్కూటర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమరులు ఉన్నారు. సమాచారం తెలుసుకుని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరళించారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనే లోగానే సుధాకర్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం గ్రామస్తులను కలచివేసింది. మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.