కాకినాడ క్రైం : కాకినాడ రూరల్ మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులకు చెందిన వాహనం ఢీ కొట్టడంతో అతడు మృతి చెందడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు... కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడుకు చెందిన కాండ్రేగుల రాజు (46) మోటారు సైకిల్‌పై వెళ్తున్నాడు. ఏపీఎస్పీకి చెందిన స్కూల్ బస్సు అత డిని భవానీ కాస్టింగ్ వద్ద ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు, అతడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులకు చెం దిన వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ మృతు డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహంతో జాతీయ రహదారి 216పై రాస్తారోకో చే శారు. పోలీసు బలగాలు మోహరించాయి. నాలుగు గంటలపాటు మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసు అధికారులు వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు బారులు తీరడం తో రాయుడుపాలెం మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిం చారు. సర్పవరం పోలీస్ స్టేషన్‌లో మృతుడి బంధువులతో మరోమారు పోలీసులు చర్చిం చారు. వారు వినలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం రాత్రి పది గంటల వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Sat, Sep 26 2015 1:49 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement