
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మేడ్చల్: రోడ్డు దాటుతున్న పాదచారిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్ రాష్ట్రానికి చెందిన ప్రమోద్‌యాదవ్(35) మండలంలోని సుతారిగూడలో నివాసముంటూ గ్రామ సమీపంలోని ఓ కోల్డ్ స్టోరేజీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు స్టోరేజీ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సూతారిగూడ చెక్‌పోస్టు రోడ్డు దాటుతుండగా రింగు రోడ్డు వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈమేరకు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.