
బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): పామును పట్టుకుని ఆటలాడిన ఓ వ్యక్తి.. అదే పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పట్టణంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. బైరెడ్డిపల్లె మెయిన్‌రోడ్డులో ఉన్న ఓ జ్యువెలరీ షాపులోకి సోమవారం మధ్యాహ్నం ఓ నాగుపాము చొరబడింది. షాపు యజమాని ఏమీ చేయలేని పరిస్థితిలో నిమ్మకుండిపోయాడు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న అసాదుల్లా (52) దుకాణంలో ఉన్న నాగుపామును చూసి చేతిలోకి తీసుకుని దాంతో కొంతసేపు ఆటలాడాడు. పామును తల వద్ద పట్టుకుని ఏమరపాటుగా ఉన్న సమయంలో అది అతని చేతిపై కాటు వేసింది. దీంతో పామును చితకబాది చంపేశాడు. అయితే, అదే రోజు సాయంత్రం అసాదుల్లా పరిస్థితి విషమించడంతో గుట్టూరు జేఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరుకు తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment