కరీంనగర్: మానవహక్కుల సంఘం మాజీ చైర్మన్ ఎరబాటి భాస్కర్‌రావు సోదరుడు స్వాతంత్య్ర సమరయోధుడు సీనియర్ సిటిజన్ హరిహర ఆలయం నిర్మాణకర్త రాజేశ్వర్‌రావును కాల్వశ్రీరాంపూర్‌లోని ఆయన నివాసంలో బుధవారం నాగుపాము కాటువేసింది. ఉగాది పండుగ సందర్భంగా పంచాగం చూస్తుండగా పెరట్లో నుంచి పామువచ్చి కాలుపై కాటువేసి అక్కడినుంచి వెళ్లిపోయింది.
గమనించిన రాజేశ్వర్‌రావు అప్రమత్తమై ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఫోన్‌చేయగా హూటాముటిన కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యానికి 108లో కరీంనగర్‌కు తరలించారు. రాజేశ్వర్‌రావు కుమారుడు హైకోర్టు న్యాయవాది హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యస్థితిపై స్థానికులు ఆందోళన చెందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఆడెపు శ్రీదేవిరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రఘుపతిరావు, తదితరులు ఉన్నారు.
పంచాంగం చూస్తుండగా కాటేసిన నాగుపాము
Published Thu, Mar 23 2023 12:26 PM | Last Updated on Thu, Mar 23 2023 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment