నిమజ్జనంలో అపశ్రుతి | A man died in ganesh Immersed | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో అపశ్రుతి

Published Tue, Sep 29 2015 4:55 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

నిమజ్జనంలో అపశ్రుతి - Sakshi

నిమజ్జనంలో అపశ్రుతి

- చెరువులో పడి వ్యక్తి మృతి
వేంసూరు:
వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భరిణాపాడు నల్ల చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని భరిణాపాడులో ఏ ర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసేం దుకు నల్ల చెరువు వద్దకు తరలించారు. ఈ తరుణంలో గ్రామానికి చెందిన శూరటి శ్రీనివాసరావు(35) వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న క్రమంలో అదుపుతప్పి విగ్రహం కింద పడి మృతి చెందాడు.

వియషం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి పర్యవేక్షణలో  గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా విగ్రహం నిమజ్జనం చేసిన స్థలం దగ్గరలో శ్రీను మృత దేహం దొరి కింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని తహశీల్దార్ పరిశీలించి పంచనామా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement