Ganesh Nimajjana celebrations
-
ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్తున్న గణనాథులు
-
నాగిని డాన్స్ చేస్తూ చనిపోయాడు
-
గణేష్ నిమజ్జనం: భద్రత కట్టుదిట్టం
-
డల్లాస్లో ఘనంగా వినాయక నిమజ్జనం
లాస్ కొలినాస్ : డల్లాస్లో వినాయక నిమజ్జనం వేడుక ఘనంగా జరిగింది. ఐదు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జగణపతిని వందలాది మంది భక్తుల కోలాహాలాల మధ్య గంగమ్మ ఒడికి చేర్చారు. కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ బ్రిడ్జస్ ఆధ్యర్యంలోఈ కార్యక్రమం జరిగింది. మొదటగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో గణపతిని ఊరేగిస్తూ లాస్ కొలినాస్ వద్ద నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శశి చావలి, శ్రీరామ్ వేదుల, కరణ్ పోరెడ్డి, నరేందర్ బాబు, అపర్ణ కొల్లూరి, ఉమా పెరిచర్లలతో పాటు పెద్ద ఎత్తున అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
నిమజ్జనంలో అపశ్రుతి
- చెరువులో పడి వ్యక్తి మృతి వేంసూరు: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. భరిణాపాడు నల్ల చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని భరిణాపాడులో ఏ ర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసేం దుకు నల్ల చెరువు వద్దకు తరలించారు. ఈ తరుణంలో గ్రామానికి చెందిన శూరటి శ్రీనివాసరావు(35) వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న క్రమంలో అదుపుతప్పి విగ్రహం కింద పడి మృతి చెందాడు. వియషం తెలుసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సోమవారం ఉదయం సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి పర్యవేక్షణలో గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా విగ్రహం నిమజ్జనం చేసిన స్థలం దగ్గరలో శ్రీను మృత దేహం దొరి కింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని తహశీల్దార్ పరిశీలించి పంచనామా నిర్వహించారు.