
లాస్ కొలినాస్ : డల్లాస్‌లో వినాయక నిమజ్జనం వేడుక ఘనంగా జరిగింది. ఐదు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న బొజ్జగణపతిని వందలాది మంది భక్తుల కోలాహాలాల మధ్య గంగమ్మ ఒడికి చేర్చారు. కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ బ్రిడ్జస్ ఆధ్యర్యంలోఈ కార్యక్రమం జరిగింది. మొదటగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో గణపతిని ఊరేగిస్తూ లాస్ కొలినాస్ వద్ద నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శశి చావలి, శ్రీరామ్ వేదుల, కరణ్ పోరెడ్డి, నరేందర్ బాబు, అపర్ణ కొల్లూరి, ఉమా పెరిచర్లలతో పాటు పెద్ద ఎత్తున అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.