ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
Published Mon, Sep 9 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై గన్నారం వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని సైకిల్‌పై వెలుతున్న పెద్ద కుర్మ గంగమల్లయ్య(65) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గన్నారం గ్రామానికి చెందిన గంగమల్లయ్య పొలం నుంచి సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా హైదరాబాద్ నుంచి బోధన్‌పై వెళ్తున్న డీలక్స్ బస్ ఢీకొట్టింది. సైకిల్‌పై నుంచి కిందపడిన గంగమల్లయ్య తలపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో తలపగిలి అక్కడికక్కిడే మృతిచె ందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా సమీపంలోని టోల్ ప్లాజా వరకు తీసుకువెళ్లి అక్కడి నిలిపి వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గన్నారం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంతో జాతీయర హదారిపై అందోళన చేశారు.
నవయుగ కంపెనీ వారే బాధ్యత వహించాలి..
గంగమల్లయ్య మృతికి రహదారి విస్తరణ పనులు చేపట్టిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ వారే బాధ్యత వహించాలని గన్నారం గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చే పట్టారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తిగాకముందే టోల్‌ప్లాజా ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు, రహదారికి ఇరువైపులా బస్‌షెల్లర్లు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రోడ్డు దాటేటప్పుడు వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ సమస్యను కంపెనీ వారి దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇదే స్థలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
మృతదేహంతో రహదారిపై సుమారు 3 గంటల పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. డిచ్‌పల్లి సీఐ శ్రీశైలం ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సర్వీసు రోడ్లు లేక ప్రమాదాలు జరుగుతున్న విషయం గతంలోనే మీ దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారానికి ఎలాంటి కృషి చేయలేదని ఎమ్మెల్యే గ్రామస్తులు ప్రశ్నించారు.
దీంతో ఎమ్మెల్యే అప్పటికప్పుడే నవయుగ కంపెనీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు, బస్‌షెల్టర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగర డీఎస్పీ అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తె లుసుకున్నారు. బస్‌డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
Advertisement