colliding
-
కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్
లండన్: బ్రిటన్‌లో రోలర్ స్కేటింగ్ చేస్తున్న వ్యక్తి కింగ్ చార్లెస్ కారుని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్ర భయాందోళలనకు గురయ్యాడు. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ సమీపంలో రాయల్ అశ్వికదళం వైపు రోలర్ స్కేట్లపై వేగంగా వెళ్తున్న వ్యక్తిని సుమారు ఎనిమిది మంది పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి అతనికి ఎలాంటి దుర్దేశాలు లేవని అధికారుల నిర్థారించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ పోలీసులు మాట్లాడుతూ...రాత్రి 7 గంటల సమయంలో పోలీసు వాహనాలు పార్లమెంట్ స్క్వేర్లోకి ప్రవేశిస్తుండగా ఒక పాదచారి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు చార్లెస్ కార్ని దాదాపు ఢీ కొట్టాడని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని తప్పించుకోనివ్వకుండా...నేలపై పడుకోబెట్టి సంకెళ్లు వేశారు. ఆ తర్వాత విచారణలో పోలీసులు ఆ వ్యక్తి ఎలాంటి దురుద్దేశంతో ఈ ఘటనకు పాల్పడలేదని, అనుకోకుండా జరిగిందేనని ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rollerblader evaded security and seemingly tried to collide into #KingCharles motorcade travelling to the vigil, shortly after 1930 on parliament square. Police intervened just in time. #QueenElizabeth #queueforthequeue @BBCNews @itvnews @SkyNews @Channel4News pic.twitter.com/P0rw2qqlRz — Tom (@pt1408) September 16, 2022 (చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
ఘోర ప్రమాదం: 12 మంది సజీవ దహనం
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయివేటు బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో 12 మంది సజీవ దహనమై పోయారు. బార్మర్-జోధ్‌పూర్ హైవేపై బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు పది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మిగిలిన ప్రయాణీకుల ఆచూకీపై ఆందోళనవ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
బస్సు, ఆటో ఢీకొని నలుగురికి గాయాలు
పూండి, న్యూస్‌లైన్: పూండి-మంచినీళ్లపేట రహదారిలో రెయ్యిపాడుకు సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ... మంచినీళ్లపేట నుంచి వస్తున్న బస్సు, పూండి నుంచి స్తున్న ఆటో పరస్పరం ఢీకొన్నాయి. మలుపు వద్దకు వచ్చేసరికి రెండు వాహనాలు కొంతమేర నెమ్మదిగా వస్తుండడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. రెండు వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు బస్సులో సుమారు 70 మంది వరకు ప్రయాణిస్తుండగా, ఆటోలో ఏడుగురు ఉన్నారు. మలుపు వద్దకు రెండు వాహనాలు వచ్చే సరికి అదుపు చేసుకోలేక ఢీకొన్నట్లు ఆటోలో ఉన్న ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంలో ఆటోలో ఉన్న బావనపాడుకు చెందిన కొమర కాములమ్మ, కొమర ఎర్రయ్య, పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన బి.ప్రవీణ్, లక్ష్మమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాద సంఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేస్తున్నామని వజ్రపొకొత్తూరు పోలీసులు చెప్పారు. బైక్ అదుపు తప్పి ఇద్దరికి... పలాస రూరల్: పలాస మండలం కంబిరిగాం జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్లాఖిమిడికి చెందిన పూర్ణచంద్ర పాణిగ్రాహి, దుర్గాప్రసాద్ పాణిగ్రాహి గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు బరంపురం నుంచి పర్లాఖిమిడి వైపు వస్తుండగా కంబిరిగాం జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో గాయాలపాలయ్యారు. వెంటనే పలాస 108 వాహనంలో క్షతగాత్రులను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి
తణుకు క్రైం, న్యూస్‌లైన్ : రాష్ర్టపతి రోడ్డులోని ఆర్వోబీ దిగువన రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. పైడిపర్రులో నివాసముంటున్న సంగుల సత్యవతి (65) అలియాస్ వంటల సత్యవతిని మంగళవారం కొవ్వూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె తల, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రమాదాన్ని చూసి బాధితురాలిని ఆటోలో ఆసుపత్రికి పంపించే ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవతి వంటలు చేసి జీవిస్తోందని, మంగళవారం మధ్యాహ్నం జాతీయ రహదారి పక్కన ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో వంట చేసి వస్తుండగా ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న సంచిలో స్థానిక ప్రైవేటు ఆర్థోపెడిక్ ఆసుపత్రి అపాయింట్మెంట్ కార్డు, చెవి మిషన్ ఉన్నాయి. -
కారు ఢీకొని విద్యార్థికి తీవ్రగాయూలు
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : కారు ఢీకొట్టడం తో ఇంటర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని డోంగర్‌గావ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. డోంగర్‌గావ్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి ఎనగందుల సుదర్శన్ (18) బుధవారం సాయంత్రం ఇచ్చోడ వెళ్లడానికి గ్రామ బస్టాప్ ఎదుట నిల్చున్నాడు. అదే సమయంలో గుడిహత్నూర్ నుంచి ఇచ్చోడ వెళ్తున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో సుదర్శన్ తల, వెన్ను, కాలు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే నేషనల్ హైవే అంబులెన్సులో సుదర్శన్‌ను రిమ్స్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన రిమ్స్ వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిఫారసు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న సుదర్శన్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. సుదర్శన్‌కు తల్లిదండ్రులు, అన్న, చెల్లి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎల్వీ.రమణ తెలిపారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ : చుట్టుపుచూపుగా అత్తవారింటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోరుకొండ మండలంలోని బూరుగుపూడి గేట్-దోసకాయలపల్లి రోడ్డులో సోమవారం ఊక లారీ ఢీకొన్న సంఘటనలో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన రాపా శ్రీను (30) చనిపోయాడు. కోరుకొండ ఎస్సై బి.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. శ్రీను తన భార్యాబిడ్డలతో ఆదివారం దోసకాయలపల్లిలోని అత్తవారింటికి వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం ఓ శుభకార్యంలో పాల్గొని, భార్యాబిడ్డలతో సొంత ఊరికి వెళ్లాల్సి ఉంది. ఇలాఉండగా సోమవారం ఉదయం ఓ యువకుడితో కలిసి మోటార్ బైక్‌పై శ్రీను కోరుకొండ వచ్చాడు. తిరిగి దోసకాయలపల్లికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై ఉన్న యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, శ్రీను పైనుంచి లారీ వెనుక చక్రాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కూలీ పని చేసే శ్రీను చుట్టుపుచూపుగా వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో దోసకాయలపల్లిలోని అత్తవారిల్లు విషాదంలో మునిగిపోయింది. కోరుకొండ ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ ఢీకొని వీఆర్ఏ దుర్మరణం
మంగపేట, న్యూస్‌లైన్ : ద్విచక్రవాహనం ఢీకొని ఓ వీఆర్ఏ మృతి చెందిన సంఘటన మండలంలోని రాజుపేటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కర్రి చిన్ని(42) గ్రామంలో కబ్జాకు గురైన చింతకుంట చెరువు శిఖం భూమిని సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు రావడంతో వారికి సహకరించేందు కు వెళ్లాడు. భోజనం చేసేందుకు ముగ్గురు అధికారులు రాజుపేటలోని ఓ హోటల్‌కు వెళ్లారు. తాను ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని అధికారులతో చెప్పిన చిన్ని సైకిల్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలో చుంచుపల్లి నుంచి ఎదురుగా ఓ వ్యక్తి బైక్‌పై వస్తూ అదుపుతప్పి చిన్ని సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడు కింద పడిపోవడంతో తలకు బలమైన దెబ్బతగిలి ముక్కు, చెవి నుంచి రక్తంకారి స్పృహ తప్పాడు. అక్కడే ఉన్న స్థానికులు 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. చిన్ని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తాడ్వాయి సమీపంలో మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఐదుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబానికి రెవెన్యూ అధికారుల పరామర్శ కర్రి చిన్ని కుటుంబాన్ని తహసీల్దార్ మాదాసి కనకరాజు, డిప్యూటి తహసీల్దార్ పుల్యాల రాజయ్య, ఎమ్మారై చందా నరేష్, ఏఆర్ఐ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు బోడ జనార్దన్, జంగం శేఖర్, మురుకుంట్ల నర్సింహారావు తదితరులు పరామర్శించారు. దహన సం స్కారాల నిమిత్తం రూ.10 వేల నగదును భార్య ముత్తమ్మకు అందచేశారు. -
రైలు ఢీకొని ఇద్దరి మృతి
మధిర, న్యూస్‌లైన్ :రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన మధిరలో విషాదం నింపింది. గుర్తుతెలియని ఓ వృద్ధుడు మధిర రైల్వేగేటువద్ద పట్టాలు దాటుతున్న సమయంలో చెన్నై నుంచి నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా వస్తోంది. గమనించని వృద్ధుడు అలానే వెళ్తుండడంతో మాటూరుపేట గ్రామానికి చెందిన ముదిగొండ అప్పారావు (37) అనే ఉపాధ్యాయుడు అతడిని రక్షించబోయాడు. అయితే అప్పటికే రైలు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరినీ ఢీకొట్టగా, అక్కడికక్కడేమృతి చెందారు. అప్పారావు మాటూరు హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మధిరలోని లడకబజారులో నివసిస్తున్నారు. మృతుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు ధర్మతేజ ఉన్నారు. కుమారుడి పుట్టినరోజు నాడే...: అప్పటివరకూ కుమారుడి పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించిన అప్పారావు.. ఆ సందర్భంగా తయారుచేసిన పిండివంటలను మాటూరుపేటలో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఇచ్చి వెంటనే తిరిగి వస్తానని భార్య, కుమారుడితో చెప్పి బయలుదేరాడు. ఇంటినుంచి స్టేషన్‌కు రాగానే రైలు ప్రమాద రూపంలో అతడిని మృత్యువు కబళించింది. ‘ నా పుట్టిన రోజు నాడే మమ్మల్ని వదిలి వెళ్లావా నాన్నా..’ అంటూ కుమారుడు ధర్మతేజ విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మానవతాదృక్పథంతో వృద్ధుడిని రక్షించబోయి తానే అనంతలోకాలకు వెళ్లాడని కుటుంబసభ్యులు, మిత్రులు విలపిస్తున్నారు. అప్పారావు మృతి సమాచారం తెలియగానే మాటూరుపేట గ్రామస్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. పాఠశాలలో అందరితో కలివిడిగా ఉండేవాడని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండేవాడని సహచర ఉపాధ్యాయులు రోదిస్తూ చెప్పారు. కష్టపడి ఉద్యోగం సాధించి...: సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అప్పారావు కష్టపడి చదివి 2000 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మొదట ఎర్రుపాలెం మండలం మొలుగుమాడు ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన ఆయన 2009 వరకు అక్కడే పనిచేశారు. ఆ తర్వాత మాటూరుపేటకు బదిలీ అయ్యారు. పలువురి సంతాపం : అప్పారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ఫోన్లో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెవాదళ్ రాష్ట్ర కమిటీ సభ్యులు దారెల్లి అశోక్ అప్పారావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్పారావు మృతదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని సందర్శించినవారిలో ఎంఈఓ అనుమోలు భాస్కర్‌రావు, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు బి.వెంకటేశ్వరరావు, ఆర్.రంగారావు, ఎల్.మోహన్‌రెడ్డి, రవికుమార్, రఫీ, యూటీఎఫ్ జిల్లా నాయకులు టి.ఆంజనేయులు, ఆర్ బ్రహ్మారెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. విజయ్ తదితరులున్నారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి కూడా బీఈడీ పూర్తి చేశారని, ఉన్నతాధికారులు మానవతా ధృక్పథంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని వారు కోరారు. మృతదేహానికి పోస్టుమార్టం ...: సంఘటనా స్థలం వద్ద మధిర రైల్వే హెడ్‌కానిస్టేబుల్ బాలస్వామి పంచనామా నిర్వహించి కేసు నమోదుచేశారు. అప్పారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మాటూరుపేట తరలించారు. కాగా, వృద్ధుడి మృతదేహాన్ని రైలు సుమారు అరకిలోమీటర్ దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో శరీరం ముక్కలు ముక్కలుగా అయి గుర్తించడానికి కూడా వీలు లేకుండా పోయింది. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
డిచ్పల్లి, న్యూస్‌లైన్: డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై గన్నారం వంతెన వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు ఢీకొని సైకిల్‌పై వెలుతున్న పెద్ద కుర్మ గంగమల్లయ్య(65) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గన్నారం గ్రామానికి చెందిన గంగమల్లయ్య పొలం నుంచి సైకిల్‌పై గ్రామానికి వస్తుండగా హైదరాబాద్ నుంచి బోధన్‌పై వెళ్తున్న డీలక్స్ బస్ ఢీకొట్టింది. సైకిల్‌పై నుంచి కిందపడిన గంగమల్లయ్య తలపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో తలపగిలి అక్కడికక్కిడే మృతిచె ందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా సమీపంలోని టోల్ ప్లాజా వరకు తీసుకువెళ్లి అక్కడి నిలిపి వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గన్నారం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంతో జాతీయర హదారిపై అందోళన చేశారు. నవయుగ కంపెనీ వారే బాధ్యత వహించాలి.. గంగమల్లయ్య మృతికి రహదారి విస్తరణ పనులు చేపట్టిన నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ వారే బాధ్యత వహించాలని గన్నారం గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో చే పట్టారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తిగాకముందే టోల్‌ప్లాజా ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు, రహదారికి ఇరువైపులా బస్‌షెల్లర్లు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రోడ్డు దాటేటప్పుడు వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఈ సమస్యను కంపెనీ వారి దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇదే స్థలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహంతో రహదారిపై సుమారు 3 గంటల పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. డిచ్పల్లి సీఐ శ్రీశైలం ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు. స్థానిక ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సర్వీసు రోడ్లు లేక ప్రమాదాలు జరుగుతున్న విషయం గతంలోనే మీ దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారానికి ఎలాంటి కృషి చేయలేదని ఎమ్మెల్యే గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అప్పటికప్పుడే నవయుగ కంపెనీ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొందరగా గ్రామం వద్ద సర్వీస్ రోడ్లు, బస్షెల్టర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగర డీఎస్పీ అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తె లుసుకున్నారు. బస్‌డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.