కారు ఢీకొని విద్యార్థికి తీవ్రగాయూలు | Student car colliding Injured | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని విద్యార్థికి తీవ్రగాయూలు

Published Fri, Oct 18 2013 1:56 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student car colliding Injured

గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : కారు ఢీకొట్టడం తో ఇంటర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని డోంగర్‌గావ్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. డోంగర్‌గావ్‌కు చెందిన ఇంటర్ విద్యార్థి ఎనగందుల సుదర్శన్ (18) బుధవారం సాయంత్రం ఇచ్చోడ వెళ్లడానికి గ్రామ బస్టాప్ ఎదుట నిల్చున్నాడు. అదే సమయంలో గుడిహత్నూర్ నుంచి ఇచ్చోడ వెళ్తున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో సుదర్శన్ తల, వెన్ను, కాలు భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే నేషనల్ హైవే అంబులెన్సులో సుదర్శన్‌ను రిమ్స్‌కు తరలించారు. అతడిని పరీక్షించిన రిమ్స్ వైద్యులు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిఫారసు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న సుదర్శన్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. సుదర్శన్‌కు తల్లిదండ్రులు, అన్న, చెల్లి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎల్వీ.రమణ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement