రైలు నుంచి పడి ఇంటర్‌ విద్యార్థికి గాయాలు | Student injured as falls from train | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి ఇంటర్‌ విద్యార్థికి గాయాలు

Published Tue, May 2 2017 12:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student injured as falls from train

పుట్లూరు : మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన గిరిప్రసాద్‌ రైలులో నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. గిరిప్రసాద్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించడంతో తాడిపత్రికి చెందిన ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుమలకు దైవదర్శనం కోసం వెళ్లారు. దైవదర్శనం ముగించుకుని రైలులో తాడిపత్రికి తిరుగు ప్రయాణం చేస్తుండగా వైఎస్సార్‌ జిల్లా ఆర్‌ఎస్‌ కొండాపురం సమీపంలో రాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు కిండ పడిపోయాడు. ఉదయం రైల్వే సిబ్బంది గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి సెల్‌ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు.  పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement