రైలు కింద పడి ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం | the train collided engineering student killed | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

Published Mon, Oct 24 2016 12:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

the train collided engineering student killed

దూపాడు వద్ద రైలు ఎక్కుతుండగా ఘటన
కల్లూరు (రూరల్‌):
కదులుతున్న రైలును ఎక్కబోతూ కాలుజారి కిందపడి ఇంజినీరింగ్‌విద్యార్థి దుర్మరణం చెందాడు. దూపాడు రైల్వేస్టేషన్‌వద్ద ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పుట్టగుండ్లపల్లికి చెందిన టి. సుబ్బరాయప్ప, లక్ష్మీదేవమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు టి. తులసిరామ్‌ (25)  బ్యాంకు పీఓ పరీక్ష రాసేందుకు కర్నూలుకు వచ్చాడు.ఆదివారం ఉదయం కర్నూలు కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో  పరీక్ష రాసిన తర్వాత తిరిగి ఊరికి వెళ్లేందుకు దూపాడు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. మధ్యాహ్నం 12.30గంటల సమయంలో  వెళ్తున్న కాచిగూడ– గుంటూరు ప్యాసింజరు రైలును ఎక్కే ప్రయత్నం చేశాడు. కాలుజారడంతో పట్టాలపై పడ్డాడు. శరీరం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే ఎస్‌ఐ వై. జగన్‌ మృతదేహాన్ని పరిశీలించారు. ఎడమకాలు చిన్నదిగా ఉండడంతో వికలాంగుడై ఉండవచ్చునని అనుమానం. మ​ృతుడి వద్ద లభించిన  బ్యాగు, సెల్‌ఫోన్, పర్సు, ఆధార్‌కార్డు ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement