ఆదోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఒడిన చిన్నారిని చేర్చిన పోలీస్
విద్యార్థిని కిడ్నాప్‌నకు యత్నం
Published Sat, Oct 15 2016 12:11 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
- రైలులో తీసుకెళ్తుండగా ఆదోని స్టేషన్‌లో దిగిన చిన్నారి
- రైల్వే పోలీసుల సహకారంతో చివరకు తండ్రి చెంతకు
ఆదోని టౌన్: ట్యూషన్‌కు వెళ్తున్న ఓ విద్యార్థిని ఇద్దరు దుండగులు కిడ్నాప్‌నకు యత్నించారు. మాయ మాటలతో నమ్మించి రైలులో తరలిస్తుండగా మార్గమధ్యంలో రైల్వే పోలీసులు గుర్తించడంతో చివరకు తండ్రి చెంతకు చేరింది. విద్యార్థిని, రైల్వే పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం హనుమేష్ నగర్‌లో నివాసముంటున్న లారీ డ్రైవర్ కలందర్, షబానా దంపతుల పెద్ద కుమార్తె హస్మతాజ్ సెయింట్ పీటర్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్తుండగా మార్గ మధ్యంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి దర్గా వద్ద అమ్మానాన్నలు ఉన్నారని అక్కడికే నిన్ను తీసుకురావాలని చెప్పారని నమ్మించారు. చివరకు ఽ రైల్వే స్టేషన్ వైపు తీసుకొచ్చారు. అయితే స్టేషన్‌లో విద్యార్థిని ఏడుస్తుండగా బలవంతంగా ఆదోని వైపు వెళ్తున్న రైల్లో ఎక్కించారు. రైలు ఆదోని స్టేషన్ రాగానే 4వ నంబర్ ఫ్లాట్‌ఫారంలో దిగింది. ఎటువెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో ఏడుస్తుండగా రైల్వే పోలీసులు గమనించి చిన్నారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. సమాచారం మేరకు తండ్రి కలందర్ ఆదోని రైల్వే స్టేషన్‌కు చేరుకుని బిడ్డను ఆప్యాయంగా ఽగుండెలకు హత్తుకున్నాడు. ఉదయం నుంచి బిడ్డ కోసం గుత్తి, చుట్టూ పక్కల ప్రాంతాల్లో వెతికామని, చివరకు అల్లా దయతోనే కుమార్తె చెంతకు చేరిందని తండ్రి చెప్పాడు.
ఇరానీ ముఠా పనే:
చిన్న పిల్లల కిడ్నాప్, రైలు, ఇతరత్రా దొంగతనాలు చేయాలంటే ఎంతో చాకచక్యం ఉన్న ఇరానీ ముఠానేనని ఎస్‌ఐ సుబ్బరాయుడు తెలిపారు. ఆ ముఠా సభ్యులే విద్యార్థిని హస్మతాజ్‌ను కిడ్నాప్‌కు ప్రయత్నించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సమాచారాన్ని గుంతకల్ పోలీసులకు అందించామన్నారు.
Advertisement
Advertisement