గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
వరంగల్ : గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్లో హిజ్రాలు గురువారం బీభత్సం సృష్టించారు. డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిపై ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక తాము అడిగిన సొమ్ము ఇవ్వని ప్రయాణికులను హిజ్రాలు రైలు నుంచి తోసివేసిన దారుణం గతంలో చోటుచేసుకుంది.
కాగా ఇటీవలి రైలు ప్రయాణమంటే ప్రయాణికులు భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. ఇందుకు అసౌకర్యాలు, టికెటు రేట్లు, ప్రమాదాల భయం తదితర కారణాలేమీ కాదు.. హిజ్రాల బెడదేనంటూ ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది నిజం. ముఖ్యంగా బెజవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల జనరల్ బోగీల్లో హిజ్రాల ఆగడాలకు అంతూపొంతూ ఉండడంలేదు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బందికి ఇదేమీ పట్టడంలేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులు కొరడా ఝళిపించి, ఈ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేశాయి. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.