Gorakhpur Express
-
గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు
కర్నూలు(రాజ్‌విహార్): కర్నూలు మీదుగా నడుస్తున్న రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈనెల 24, డిసెంబర్ 1న, 8వ తేదీల్లో గోరక్‌పూర్ నుంచి యశ్వంత్ పూర్‌కు నడిచే రైలు నెంబర్ 15023, ఈనెల 25, డిసెంబర్ 2న, 9వ తేదీల్లో యశ్వంత్‌పూర్ నుంచి గోరక్‌పూర్‌కు నడిచే రైలు నెంబర్ 15024ను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు. -
మామూలు వాళ్ల కంటే హిజ్రాలే నయం!!
మామూలు వారికంటే తామే నయమని చాటుకున్నారు కొంతమంది హిజ్రాలు. పురిటినొప్పులతో తోటి మహిళ బాధపడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా మిగిలిన మహిళలు వదిలేస్తే.. హిజ్రాలు మాత్రం పెద్దరికం వహించి ఆమెను ఆదుకుని.. పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. సికింద్రాబాద్ నుంచి లక్నో వెళ్తున్న సికింద్రాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండో జనరల్ బోగీలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ బాధను భరించలేక ఆమె నరకాన్ని అనుభవించింది. తోటి ప్రయాణికులు గుడ్లప్పగించి చూశారే తప్ప.. ఏ ఒక్కరూ సహాయం అందించడానికి ముందుకు రాలేదు. అదే సమయానికి ఆ రైల్లో కొంతమంది హిజ్రాలు భిక్షాటన చేసుకుంటున్నారు. మహిళ పడుతున్న బాధను చూసి.. వెంటనే భిక్షాటన వదిలిపెట్టి అంతా ఒక్కటయ్యారు. తామే అడ్డుగా నిలబడి, ఆమెకు పురుడు పోశారు. బొడ్డు కోసి బిడ్డకు ప్రాణం పోశారు. అంతటితో ఆగలేదు... అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి పంపించారు. తమలోనూ మానవత్వం ఉందని, అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పందించగలమని చాటుకున్నారు. -
మానవత్వాన్ని చాటుకున్న హిజ్రాలు
-
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. దాంతో చైన్ లాగీ ఎక్స్‌ప్రెస్ రైలును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని భీమడోలు రైల్వేస్టేషన్లో నిలిపివేసి... రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పొగలు వ్యాపించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గోరఖ్‌పూర్ నుంచి హిందూపురం వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఇంజన్‌ను డ్రైవర్ వేరు చేశారు. -
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
వరంగల్ : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాలు గురువారం బీభత్సం సృష్టించారు. డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిపై ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక తాము అడిగిన సొమ్ము ఇవ్వని ప్రయాణికులను హిజ్రాలు రైలు నుంచి తోసివేసిన దారుణం గతంలో చోటుచేసుకుంది. కాగా ఇటీవలి రైలు ప్రయాణమంటే ప్రయాణికులు భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. ఇందుకు అసౌకర్యాలు, టికెటు రేట్లు, ప్రమాదాల భయం తదితర కారణాలేమీ కాదు.. హిజ్రాల బెడదేనంటూ ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది నిజం. ముఖ్యంగా బెజవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల జనరల్ బోగీల్లో హిజ్రాల ఆగడాలకు అంతూపొంతూ ఉండడంలేదు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బందికి ఇదేమీ పట్టడంలేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులు కొరడా ఝళిపించి, ఈ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేశాయి. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.