eunuchs
-
ట్రైన్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు..
రోజూ బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ కూడళ్ల వద్ద అనేక మంది హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్స్్) తారసపడుతుంటారు. వారిని చూసినప్పుడు చాలా మంది అసహ్యించుకుంటూ దూరంగా వెళ్తుంటారు. చాలా వరకు హిజ్రాలు జనాలను ముఖ్యంగా అబ్బాయిలను వేధించి మరీ డబ్బులు లాక్కుంటారు. ఇవ్వకుంటే దౌర్జన్యానికి పాల్పడుతుంటారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. వారిలో మంచివారు కూడా ఉంటారు. అంతేగాక హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారూ లేకపోలేదు. అంటే హిజ్రాలు ప్రవర్తించే తీరును బట్టే వారిని చూసే కోణం మారుతుంటుంది. తాజాగా ట్రాన్స్జెండర్లు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ట్రైన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. షేక్‌పనురా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్తతో కలిసి హౌరా నుంచి లఖిసరాయ్‌కు హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తోంది. రైలు జాసిదిహ్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మహిళకు పురిటి నొప్పులు రావడం ప్రారంభించాయి. గర్భిణి నొప్పులతో అవస్థలు పడుతున్న భార్య పరిస్థితిని గమనించిన భర్త.. సాయం కోసం కోచ్‌లోని ఇతర మహిళలను ప్రదేయపడ్డాడు. అయితే ప్రవస వేదనతో బాధపడుతున్న మహిళకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సమయం గస్తున్న కొద్దీ బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడం ప్రారంభించింది. ఇంతలో అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది హిజ్రాలు గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించారు. వెంటనే గర్భిణీని రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. సదరు మహిల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కోచ్‌లోని ప్రతి ఒక్కరూ హిజ్రాలను అభినందించారు. చదవండి: విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు -
తప్పతాగి హిజ్రాల కోసం వచ్చి దారుణం..
బంజారాహిల్స్: తప్పతాగి.. హిజ్రాల కోసం వచ్చిన ఏడుగురు యువకులు బీభత్సం సృష్టించారు. స్థానిక యువకులు ఇద్దరిపై దాడి చేయడమే కాకుండా అడ్డొచ్చిన మరో వ్యక్తిని కత్తితో పొడిచారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు... జెబాబాగ్ మురాద్‌నగర్‌కు చెందిన జిమ్ ట్రైనర్ ఎండీ యాసిన్(20), టోలిచౌకీకి చెందిన సేల్స్‌మన్ ఫుర్హాన్‌బేగ్ (18), చార్మినార్‌కు చెం దిన విద్యార్థులు హేమంత్ శర్మ (20), నిఖిల్ శర్మ (21), ఆకాష్ శర్మ (23), టోలీచౌకికి చెందిన మొజం సిద్దిఖ్ (22), గోల్కొండకు చెందిన అఫాన్ (19) కలిసి మంగళవారం రాత్రి 11.30కి పాతబస్తీ నుంచి మూడు బైక్‌లపై జూబ్లీహిల్స్ రోడ్డు నెం.5లోని అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల రోడ్డు వద్ద ఉన్న కొంత మంది హిజ్రాల వద్దకు వచ్చారు. అదే సమయంలో పక్కనే ఉన్న దుర్గాభవానీనగర్‌కు చెందిన శీను, వెంకటేష్‌లు రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. తమ చేష్టలను శీను, వెంకటేష్ గమనిస్తున్నారని భావించిన ఏడుగురూ.. మీకు ఇక్కడేం పని? ఎందుకు నిలబడ్డా రు.. బస్తీలోకి పొండి అని హెచ్చరించారు. మా బస్తీలో మేము నిలబడితే అడగటానికి మీరెవరంటూ శీను, వెంకటేష్ చెప్పగా ఆగ్రహం పట్టలేక ఏడుగురూ వీరిద్దరినీ చితకబాదారు. బాధితులిద్దరూ ప్రాణభయంతో పరుగు తీస్తూ బస్తీవాసులను అప్రమత్తం చేస్తుండగా.. మళ్లీ దాడి చేసేందుకు బస్తీలోకి వెళ్లారు. బస్తీవాసి రమావత్‌సేత్యా వారిని అడ్డుకోబోగా వారిలో ఒకడు తమ వెంట తెచ్చుకున్న కత్తితో సేత్యా కడుపులో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న సేత్యాను బస్తీవాసులు అపోలోకు తరలించారు. దుండగులంతా మద్యం, డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం నిందితులు ఏడుగురినీ అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోనమెత్తిన హిజ్రాలు
శ్రావణమాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకుని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన హిజ్రాలు ఆదివారం పోచమ్మ బోనాలు చేశారు. ఈ సందర్భంగా వారు నెత్తిన బోనాలు పెట్టుకుని సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆలయానికి తరలివెళ్లారు. తమ కోర్కెలు నెరవేర్చి చల్లంగా చూడాలని పోచమ్మను భక్తి శ్రద్ధలతో పూజించారు. కార్యక్రమంలో హిజ్రాల సంఘం నాయకురాలు లైలా, హిజ్రాలు సుధ, అశ్విని, స్నేహ, కల్పన, సారిక, రాణి పాల్గొన్నారు. – కరీమాబాద్ -
రిజర్వేషన్ల కోసం హిజ్రాల పట్టు
♦ ప్రతి పార్టీ ఒక టికెట్ ఇవ్వాలని డిమాండ్ ♦ చెన్నై ఆర్కేనగర్ నుంచి హిజ్రా పోటీ చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని హిజ్రాలు కోరుతున్నారు. ఇకపై ప్రతి ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఒక టికెట్‌ను హిజ్రాకు కేటాయించాలని డిమాండ్ చేశాయి. 12 స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులు డాక్టర్ శ్యామలా నాధూరాజ్, డాక్టర్ విజయరామన్, భక్తవత్సలం, జయ సహోదరన్, భావన, హరిహరన్ చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మతం, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు అనేక అవకాశాలు ఇవ్వడంలో తమిళనాడు ఎప్పుడూ ముందున్నదని అన్నారు. అయితే హిజ్రాలపై మాత్రం వివక్షచూపుతున్నారని ఆరోపించారు. సమాజంలో మూడో రకం మనుషులుగా గుర్తింపుపొందిన తాము అన్నిరంగాల్లో అవకాశాలు, గుర్తింపు పొందుతుండగా రాజకీయపార్టీలు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తాము స్థిరపడాలంటే ఆర్థిక, రాజకీయ బలం అవసరమని అన్నారు. రాజకీయంగా ముందడుగు వేస్తే ఆర్థిక బలం తానుగా సమకూరుతుందని చెప్పారు. అందుకే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రతి పార్టీ కనీసం ఒక్క సీటైనా హిజ్రాలకు కేటాయించాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు తమ వినతిపత్రాన్ని, దరఖాస్తులను ప్రతిరాజకీయ పార్టీకి సమర్పించినట్లు వారు చెప్పారు. అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు సుధ, డీఎంకే నుంచి రగసియ, డీఎండీకే నుంచి రాధిక దరఖాస్తులు సమర్పించారని వారు తెలిపారు. చెన్నై ఆర్కేనగర్ నుంచి సేలం దేవి (హిజ్రా) నామ్‌తమిళర్ కట్చి అభ్యర్థిగాా ఖరారైనట్లు వారు తెలిపారు. నామ్ తమిళర్ కట్చి తీరులోనే ప్రతిపార్టీ ఒక స్థానంలో హిజ్రాలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలకు సేవలు చేసే విషయంలో తాము ఎవ్వరికీ తీసిపోమనివారు పేర్కొన్నారు. తమిళనాడును ప్రగతిపథంలో నడిపించడంలో తమను భాగస్వామ్యులను చేయాలని వారు అన్నారు. తమ డిమాండ్లను ఎన్నికల కమిషన్, రాజకీయపార్టీలు పరిశీలించాలని వారు కోరారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న హిజ్రాలు
-
మామూలు వాళ్ల కంటే హిజ్రాలే నయం!!
మామూలు వారికంటే తామే నయమని చాటుకున్నారు కొంతమంది హిజ్రాలు. పురిటినొప్పులతో తోటి మహిళ బాధపడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా మిగిలిన మహిళలు వదిలేస్తే.. హిజ్రాలు మాత్రం పెద్దరికం వహించి ఆమెను ఆదుకుని.. పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. సికింద్రాబాద్ నుంచి లక్నో వెళ్తున్న సికింద్రాబాద్ - గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని రెండో జనరల్ బోగీలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ బాధను భరించలేక ఆమె నరకాన్ని అనుభవించింది. తోటి ప్రయాణికులు గుడ్లప్పగించి చూశారే తప్ప.. ఏ ఒక్కరూ సహాయం అందించడానికి ముందుకు రాలేదు. అదే సమయానికి ఆ రైల్లో కొంతమంది హిజ్రాలు భిక్షాటన చేసుకుంటున్నారు. మహిళ పడుతున్న బాధను చూసి.. వెంటనే భిక్షాటన వదిలిపెట్టి అంతా ఒక్కటయ్యారు. తామే అడ్డుగా నిలబడి, ఆమెకు పురుడు పోశారు. బొడ్డు కోసి బిడ్డకు ప్రాణం పోశారు. అంతటితో ఆగలేదు... అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి పంపించారు. తమలోనూ మానవత్వం ఉందని, అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పందించగలమని చాటుకున్నారు. -
మానవత్వాన్ని చాటుకున్న హిజ్రాలు
-
చావలేక.. బతకలేక ఉన్నాం..
నంద్యాలటౌన్: ‘‘సార్..! ఈ బతుకు పగవాళ్లకు కూడా వద్దు.. చావలేక, బతకలేక ఉన్నాం.. బతుకుదెరువు కోసం, కడుపున పుట్టిన వారిని కాపాడుకోవడానికి తప్పు చేశా.. కానీ మమ్మల్ని ఆటబొమ్మల్లా చూస్తూ వేధిస్తున్నారు. మాకురక్షణ కల్పించండి..బతుకుపై భరోసా కల్పించండి..’’ అంటూ సెక్స్ వర్కర్లు, హిజ్రాలు జిల్లా ఎస్పీ రవికృష్ణకు తమ గోడు నివేదించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీఎస్ ఏసీఎస్) ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబానగర్ షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, బాధలను ఎస్పీకి హిజ్రాలు, సెక్స్‌వర్కర్లు ఆవేదనతో వివరించారు. వారి ఆవేదనపై ఎస్పీ చలించిపోయారు. రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు పిల్లల కోసం తప్పు చేశా భర్త దూరం కావడంతో అండగా ఉంటానని ఓ వ్యక్తి చెప్పడంతో నమ్మి మోసపోయా. తర్వాత ఇతరుల నుంచి వేధింపులకు గురయ్యాను. నేను నా పిల్లలను పోషించుకోవడానికీ, నా భర్త చేసిన అప్పును తీర్చడానికి అప్పులు చేశాను. కానీ ఇళ్ల వద్దకు వచ్చి పరువు తీస్తున్నారు. ఈ వేధింపులను భరించడం కష్టమైంది. - చెన్నమ్మ అడుగడుగునా వేధిస్తున్నారు ఏ జన్మలో చేసిన పాపమోగానీ హిజ్రాను అయ్యాను. జీవనోపాధి కోసం రైళ్లల్లో భిక్షాటన చేసేదానిని. కానీ నోటికొచ్చినట్లు పిలుస్తూ, డబ్బులు ఇస్తానని లైంగికంగా వేధించేవారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. మాకు రక్షణకల్పించండి. - శ్రీలత, హిజ్రా నమ్మితే మోసం చేశారు జీవితాంతం తోడుండాల్సిన భర్త దూరంకావడంతో కుటుంబ పోషణ భారం నాపై పడింది. ఏం చేయాలో దిక్కుతోచక పిల్లలను పోషించడానికి ఈ మార్గం ఎంచుకున్నాను. కానీ ఆకతాయిలు ఇళ్ల వద్దకు వచ్చి బెదిరిస్తున్నారు. కుటుంబ సభ్యులను, కన్న బిడ్డలను అల్లరి చేస్తున్నారు. దీన్ని భరించలేకున్నాం. - కుమారి -
ఖతర్నాక్..హిజ్రా
*యువతిలా లిప్ట్ అడిగి.. *సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అభాండాలు *స్థానికులు అప్రమత్తమయ్యేలోపు పరుగులు *బంజారాహిల్స్‌లో ఓ హిజ్రా వెరైటీ తెగింపు బంజారాహిల్స్ : సాధారణంగా హిజ్రాలు.. సార్/ మేడం టెన్ రూపీస్ ఉంటే ఇవ్వండి..అమ్మా దానం చేయండని అడుక్కుంటుంటారు. దుకాణాల వద్ద, కాలేజీల వద్ద, రైళ్లు, బస్టాండ్లలో జబర్దస్తీ చేసి వసూలు చేస్తారు. ఈసమయంలో పలుమార్లు ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. అయితే బంజారాహిల్స్‌లో ఓ హిజ్రా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. లిప్ట్ అడిగి బండెక్కి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ముప్పుతిప్పలు పెట్టాలనుకొని చివరకు అడ్డంగా దొరికిపోయింది. ఈ వెరైటీ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..సాప్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ మంగళవారం ఉదయం బైక్‌పై హైటెక్‌సిటీకి వెళ్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్‌నెం.12 కమాన్ వద్దకు రాగానే స్కార్ఫ్ ధరించిన ఓ యువతి లిప్ట్ అడగ్గా..ఆపడంతో వెనుక కూర్చుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వద్దకు రాగానే ఆమె బైక్‌ను ఆపమనడంతో శ్రీనివాస్ వెంటనే బైక్ నిలిపేశాడు. అంతే క్షణాల్లో బైక్ తాళం చెవులు తీసుకొని ‘తనను ఈ యువకుడు మోసం చేశాడు. లైంగిక వాంఛ తీర్చుకొని డబ్బులివ్వకుండా వెళ్తున్నాడని’ అరుపులు పెట్టింది. షాక్ తిన్న శ్రీనివాస్..‘ఇదంతా అబద్దం. బైక్‌కు అడ్డొచ్చి లిప్ట్ అడగడంతో ఎక్కించుకున్నా. ఈమెకు నాకు ఎలాంటి సంబంధం లేదని’ చెప్పాడు. శ్రీనివాస్ అమాయకత్వాన్ని గమనించిన స్థానికులు సదరు యువతి మోసానికి పాల్పడి అందినకాడికి లాక్కునేందుకు యత్నిస్తుందని గుర్తించారు. పోలీసులకు సమాచారమిస్తే తన గుట్టురట్టవుతుందని భావించిన సదరు యువతి తప్పించుకునే యత్నం చేయగా స్థానికులు పట్టుకొని ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ తొలగించారు. తీరా చూస్తే ఆమె యువతి కాదు..హిజ్రా అని తెలుసుకొని నోళ్లెళ్లబెట్టారు. పోలీసులు వచ్చేలోపే సదరు హిజ్రా తప్పించుకొని అక్కడ్నుంచి ఉడాయించింది. -
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాల బీభత్సం
వరంగల్ : గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో హిజ్రాలు గురువారం బీభత్సం సృష్టించారు. డబ్బులు ఇవ్వలేదని ప్రయాణికులపై హిజ్రాలు దాడి చేశారు. ఈ సంఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిపై ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక తాము అడిగిన సొమ్ము ఇవ్వని ప్రయాణికులను హిజ్రాలు రైలు నుంచి తోసివేసిన దారుణం గతంలో చోటుచేసుకుంది. కాగా ఇటీవలి రైలు ప్రయాణమంటే ప్రయాణికులు భయపడిపోయే పరిస్థితి తలెత్తింది. ఇందుకు అసౌకర్యాలు, టికెటు రేట్లు, ప్రమాదాల భయం తదితర కారణాలేమీ కాదు.. హిజ్రాల బెడదేనంటూ ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది నిజం. ముఖ్యంగా బెజవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల జనరల్ బోగీల్లో హిజ్రాల ఆగడాలకు అంతూపొంతూ ఉండడంలేదు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) సిబ్బందికి ఇదేమీ పట్టడంలేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులు కొరడా ఝళిపించి, ఈ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేశాయి. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పటికైనా ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది హిజ్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.