బోనమెత్తిన హిజ్రాలు
శ్రావణమాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకుని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన హిజ్రాలు ఆదివారం పోచమ్మ బోనాలు చేశారు. ఈ సందర్భంగా వారు నెత్తిన బోనాలు పెట్టుకుని సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆలయానికి తరలివెళ్లారు. తమ కోర్కెలు నెరవేర్చి చల్లంగా చూడాలని పోచమ్మను భక్తి శ్రద్ధలతో పూజించారు. కార్యక్రమంలో హిజ్రాల సంఘం నాయకురాలు లైలా, హిజ్రాలు సుధ, అశ్విని, స్నేహ, కల్పన, సారిక, రాణి పాల్గొన్నారు. – కరీమాబాద్