న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.తాజాగా ఆదివారం(అక్టోబర్28) రాత్రి న్యూయార్క్‌లో జరిగిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీ వేదికపై భార్య మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్సులు వేశారు.
ర్యాలీలో అనూహ్యంగా ప్రత్యక్షమైన మెలానియా వేదికపైకి ట్రంప్ రాక ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ వేదికపైకి రాగానే ఆయనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని సందడి చేశారు. సభలో డ్యాన్సులేయడంతో పాటు ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ అని ట్రంప్ నినాదాలు చేశారు.
కాగా, నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ క్రేజ్ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నెల రోజుల కిందట డెమొక్రాట్ అభ్యర్థి కమల హారిస్ కంటే వెనుకబడిన ట్రంప్ ఎన్నికల లేదీ దగ్గరవుతున్న కీలక సమయంలో పుంజుకోవడం రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపుతోంది.
Okay just finished MSG Rally. Absolutely adored Melanias smile when she saw her husband doing the YMCA dance--it was awesome!! pic.twitter.com/QdoJvt5wki
— Oblivion (@RedKryptonited) October 28, 2024
ఇదీ చదవండి: ట్రంప్ గెలుపు మహిళలకు ముప్పు
Comments
Please login to add a commentAdd a comment