Madison Square Garden
-
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్రమ వలసలపై ఉక్కుపాదమే: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చర్రితలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులదరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ ఆదివారం న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు. హారిస్‌ను దెయ్యంగా, ‘రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్టు’గా అభివరి్ణంచారు. ‘‘ఆమెకు తెలివి లేదు. దేశ సమస్యలను పరిష్కరించలేరు’’ అంటూ విమర్శించారు. ట్రంప్ అయితే ఉపాధ్యక్షురాలిగా హారిస్ తన అసమర్థ పాలనతో అమెరికాను నాశనం చేశారని ఆరోపించారు. ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడిన కమెడియన్ టోనీ హిచ్క్లిఫ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాటిన్ అమెరికా వాసులు పిల్లల్ని కనేందుకే ఇష్టపడతారన్న వ్యాఖ్యలపై రిపబ్లికన్లే అసహనం వ్యక్తం చేశారు. పోర్టోరికోను తేలాడే చెత్తదిబ్బగా టోనీ పేర్కొనడాన్నీ రిపబ్లికన్లు ఖండించారు. -
ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.తాజాగా ఆదివారం(అక్టోబర్28) రాత్రి న్యూయార్క్‌లో జరిగిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీ వేదికపై భార్య మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్సులు వేశారు. ర్యాలీలో అనూహ్యంగా ప్రత్యక్షమైన మెలానియా వేదికపైకి ట్రంప్ రాక ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ వేదికపైకి రాగానే ఆయనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని సందడి చేశారు. సభలో డ్యాన్సులేయడంతో పాటు ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ అని ట్రంప్ నినాదాలు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ క్రేజ్ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నెల రోజుల కిందట డెమొక్రాట్ అభ్యర్థి కమల హారిస్ కంటే వెనుకబడిన ట్రంప్ ఎన్నికల లేదీ దగ్గరవుతున్న కీలక సమయంలో పుంజుకోవడం రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. Okay just finished MSG Rally. Absolutely adored Melanias smile when she saw her husband doing the YMCA dance--it was awesome!! pic.twitter.com/QdoJvt5wki— Oblivion (@RedKryptonited) October 28, 2024ఇదీ చదవండి: ట్రంప్ గెలుపు మహిళలకు ముప్పు -
‘మేడిసన్ స్క్వేర్’ అద్భుతం
న్యూయార్క్: అమెరికాలో తన పర్యటనను పురస్కరించుకుని న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన సభ అద్భుతంగా సాగిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘భారతీయ అమెరికన్లు నన్ను అద్భుతంగా ఆహ్వానించారు. వారితో ముచ్చటించడానికి అదో ప్రత్యేక అవకాశం. వారికి నా కృతజ్ఞతలు’ అని తెలిపారు. భారతీయ అమెరికన్లు తమ కృషి, విలువలతో ఎనలేని గౌరవాన్ని సంపాదించకున్నారని, వారిని చూసి గర్వపడుతున్నామని కొనియాడారు. కాగా, మేడిసన్ స్వ్కేర్‌లో మోడీ ప్రసంగం ఆ సభకు హాజరైన 40 మందికిపైగా అమెరికా కాంగ్రెస్ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. మోదీ ఆకర్షణీయ నేత అని, ఆయనను ప్రజలు ప్రధానిగా ఎందుకు ఎన్నుకున్నారో ఆయన మాటలతో అర్థమైందని హెన్రీ హాంక్ అనే కాంగ్రెస్ సభ్యుడు అన్నారు. -
ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపు
-
ప్రపంచాన్ని జయిద్దాం
-
తెలుగుతేజం నీనా దావులూరి యాంకరింగ్
మోదీ ప్రసంగానికి ముందు మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు భారత సంతతికి చెందిన తెలుగుతేజం, మిస్ అమెరికా-2014 విజేత నీనా దావులూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతోపాటు పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను సభకు పరిచయం చేశారు. ఆమెకు భారత సంతతి యాంకర్ హరి శ్రీనివాసన్ సహకారం అందించారు. -
మోదీ సభ సైడ్‌లైట్స్
► మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని 360 డిగ్రీల వర్తులాకార వేదిక పైనుంచి మోదీ 20 వేల మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ అమెరికన్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, 45 మంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు. ► వేదికపైకి చేరుకునే క్రమం నుంచి ఆయన ప్రసంగం కొనసాగించినంత సేపూ సభికులు ‘మోదీ...మోదీ, ‘వెల్కమ్ మోదీ’, ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ జిందాబాద్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ► సభకు చాలా మంది భారతీయ అమెరికన్లు మోదీ ముఖచిత్రంతో కూడిన టీషర్టులను ధరించి వచ్చారు. ‘అమెరికా లవ్స్ మోదీ’ అనే బ్యానర్లను ప్రదర్శించారు. ► ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లోని భారీ తెరలపై మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికావ్యాప్తంగా 50 చోట్ల ప్రత్యక ప్రసారాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ► మోదీ ప్రసంగానికి ముందు ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గుజరాతీ కళాకారుల నృత్యాలతో వేదిక హోరెత్తింది. వాయిలిన్ విద్వాంసుడు ఎల్. సుబ్రహ్మణ్యం, ఆయన భార్య, గాయని కవితా కృష్ణమూర్తి ‘ఐ లవ్ మై ఇండియా’ గానం సభికుల ప్రశంసలందుకుంది. ► మోదీ ప్రసంగం వినేందుకు 100 మంది బోహ్రా ముస్లింలు వచ్చారు. ► అమెరికాలోని పలు భారత సంఘాలు 15 లక్షల డాలర్లు ఖర్చు చేసి సభను ఏర్పాటు చేశాయి. ► మేడిసన్ స్క్వేర్ ఎదుట మోదీ వ్యతిరేకులు మోదీ వీసా రద్దు చేయాలని, హిందుత్వ విధానం భారత్‌ను నాశనం చేస్తోందంటూ బ్యానర్లు ప్రదర్శించినా ఆ ప్రభావం సభపై కనిపించలేదు. ► సభ ప్రారంభానికి ముందు ప్రముఖ భారత జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత రాజ్‌దీప్ సర్దేశాయ్పై సభా ప్రాంగణం వెలుపల దాడి జరిగింది. గతంలో మోదీని విమర్శించారంటూ పలువురు మోదీ మద్దతుదారులు సర్దేశాయ్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ దాడి చేశారు. ► పాప్ రారాజు మైకేల్ జాక్సన్ స్టెప్పులతో తరించింది... మడోన్నా గాత్రంతో పులకించింది... బాస్కెట్ బాల్, ఐస్ హాకీ వంటి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది మేడిసన్ స్క్వేర్ గార్డెన్. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా నిలిచిన న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోదీ ఆదివారం తన ప్రసంగంతో చుట్టూ ఆసీనులైన ప్రతీ భారతీయ అమెరికన్‌ను ఊర్రూతలూగించారు. తద్వారా ఇదే వేదికపై నుంచి ప్రసంగించిన ప్రముఖుల జాబితాలో మోదీ చేరిపోయారు. ► మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ప్రసంగించిన ఓ దేశాధినేత కూడా మెదీయే కావడం విశేషం. -
రండి.. ప్రపంచాన్ని జయిద్దాం..!
నవభారతం నిర్మిద్దాం కలసిరండి ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపు న్యూయార్క్: మది నిండా భారతీయం ఉప్పొంగిన వేళ.. మాతృభూమిని స్మరిస్తూ మువ్వన్నెల్లో మునిగిన తరుణం.. అభివృద్ధి మాంత్రికుడిపైనే ఆలోచనలన్నీ ముసిరిన క్షణాన ప్రవాసులంతా ఉర్రూతలూగిపోయారు. 125 కోట్ల భారతావని ప్రతినిధిగా అమెరికాలో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి ముగ్ధులయ్యారు. 21వ శతాబ్దం మనదేనంటూ ఆద్యంతం ఉత్తేజం నింపిన ప్రధానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన భారీ సభలో మోదీ చేసిన ప్రసంగానికి ఆహూతులంతా మురిసిపోయారు. ‘భారత్ మాతాకీ జై’ అని ప్రారంభిస్తూ సహజమైన హావభావాలతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా నడిబొడ్డున.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత శక్తియుక్తులను ఆవిష్కరిస్తూ సాగిన మోదీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. నవరాత్రి ఉపవాసాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఆయన నవయువకుడిగా మారిపోయారు. ప్రధాని పలికిన ప్రతి మాటకూ చప్పట్లు మారుమోగాయి. మోదీ నామస్మరణతో మేడిసన్ స్క్వేర్ లోపలాబయటా హోరెత్తిపోయింది. దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది పరోక్షంగా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఆద్యంతం ఉత్సాహభరిత ప్రసంగంతో ఎన్ఆర్ఐలనే కాదు.. అమెరికన్ల మదినీ దోచుకున్నారు. భారత శక్తియుక్తులను, తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూనే.. మాతృదేశాన్ని అభివృద్ధి చేయడానికి కలిసిరావాలంటూ ప్రవాసులందరికీ ప్రధాని మోదీ పదేపదే పిలుపునిచ్చారు. అట్టహాసంగా ప్రారంభం మేడిసన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎన్ఆర్ఐలు, అమెరికన్లు భారీగా తరలివచ్చారు. ప్రాంగణమంతా భారతీయత ఉట్టిపడింది. జాతీయ పతాకాలు చేతబూని, మోదీ మాస్క్‌లు, టీషర్ట్లు ధరించి అక్కడికి వచ్చిన వారంతా హంగామా చేశారు. సీట్లన్నీ నిండిపోయి మేడిసన్ స్క్వేర్ మొత్తం కిక్కిరిసిపోయింది. బయట ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ముందుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భారతీయ నృత్యాలు, పాటలతో కళాకారులు ప్రదర్శనలిచ్చారు. పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. మోదీ ప్రవేశంతోనే హాలంతా ఆయన పేరే మారుమోగిపోయింది. మిస్ అమెరికాగా ఎంపికైన తొలి భారతీయ అమెరికన్, తెలుగమ్మాయి నీనా దావులూరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మోదీ ప్రసంగానికి ముందు ప్రఖ్యాత గాయని కవితా కృష్ణమూర్తి జాతీయగీతాన్ని ఆలపించారు. ‘సోదరసోదరీమణులారా’ అని పలకరించిన మోదీ.. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తిగా స్వచ్ఛమైన హిందీలో ఆయన ప్రసంగం సాగింది. ఇప్పుడు ‘మౌస్’తో ఆడుకుంటున్నాం అమెరికాలో స్థిరపడిన భారతీయులను మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. వారి వల్లే భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. భారతీయ అమెరికన్లను చూసి దేశం గర్వపడుతోందన్నారు. పాములను ఆడించే దేశంగా ప్రపంచానికి తెలిసిన భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేశారని ప్రస్తుతించారు. ఇప్పుడు మనం ‘మౌస్’తో ఆడుకుంటున్నామని చమత్కరించారు. ‘మీలో చాలా మంది ఓటు వేసి ఉండకపోవచ్చు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మీరంతా సంబరాలు చేసుకున్నారు. మీకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఇవాళ ఇక్కడున్నాను. భారత అభివృద్ధిలో మీ పాత్ర ప్రధానమైనది’ అని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. 15 నిమిషాలు కూడా విరామం తీసుకోలేదు.. ‘మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికల్లో ఒకే పార్టీ పూర్తి మెజారిటీతో ఘనవిజయం సాధించింది. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని అంచనా వేయలేకపోయారు. ఓటర్లు వారి అభిప్రాయాన్నే మార్చేశారు. ఎన్నికల్లో గెలవడం కుర్చీ కోసమో.. అధికారం కోసమో కాదు. అది ఒక బాధ్యత. అధికారం చేపట్టినప్పటి నుంచి 15 నిమిషాలు కూడా విరామం తీసుకోలేదు. మీతో(ప్రవాస భారతీయులు) పాటు భారతీయులు కూడా దేశం గురించి ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. మా ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. వాటిని నెరవేర్చడంలో మేం కచ్చితంగా విజయం సాధిస్తాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దం మనదే.. 21వ శతాబ్దం ఆసియాదేనని ప్రపంచమంతా అంగీకరించిందని మోదీ అన్నారు. ‘మనది యువ దేశం. 65శాతం మంది ప్రజలు 35 ఏళ్లలోపు వారే. నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. యువశక్తి, నైపుణ్యాలతో భారత్ వెనక్కితిరిగి చూడాల్సిన పనిలేదు. అభివృద్ధి పథంలో వేగంగా సాగుతుంది’ అని ప్రధాని అన్నారు. ‘ఎవరికీ లేని మూడు ప్రధాన బలాలు భారత్‌కు ఉన్నాయి. ప్రజాస్వామ్యం, యువశక్తి, డిమాండ్ - ఈ మూడు శక్తులే భారత్‌కు చోదకాలు. అందుకే ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోంది. భారత్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న విశ్వాసం నాకుంది’ అని మోదీ తెలిపారు. నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది ‘అహ్మదాబాద్‌లో కిలోమీటర్ దూరం ఆటోలో వెళ్లడానికి రూ. 10 ఖర్చవుతుంది. అంగారకుడిని చేరడానికి 65 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాం. ఇందుకు కిలోమీటర్‌కు 7 రూపాయలే ఖర్చు చేశాం. హాలీవుడ్ సినిమాకయ్యే వ్యయం కన్నా తక్కువలోనే తొలి ప్రయత్నంలోనే అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని పంపించాం. మన నైపుణ్యానికి ఇదే నిదర్శనం. అపార నైపుణ్యాలు, సామర్థ్యం మనకుంది. వాటితోనే ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. అందుకే నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని ఎన్ఆర్ఐలకూ పిలుపునిచ్చారు. ఇవే నా లక్ష్యాలు.. మోదీ ఈ సందర్భంగా తన లక్ష్యాలను వివరించారు. జన్‌ధన్ యోజన, స్వచ్ఛభారత్, అందరికీ ఇళ్లు, మేకిన్ ఇండియా వంటి పథకాల ఆవశ్యకతను వెల్లడించారు. ‘దేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో విస్తరించినప్పటికీ ఇంకా 50 శాతం మంది కుటుంబాలకు ఖాతాలు లేవు. ప్రైవేటుగా రుణాలు తీసుకునే పేదలను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నారు. అందుకే జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటికే 4 కోట్ల మందికి ఖాతాలు తెరిచాం. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరుస్తామని చెప్పాం. కానీ జనం ఆ ఖాతాల్లో రూ. 1,500 కోట్లు జమ చేశారు. ఇక తగినన్ని మానవ వనరులు, తక్కువ రేట్లకే ఉత్పత్తి కావాలంటే మీ గమ్యం భారతే. ఇందుకు పాలనా వ్యవస్థను సులభతరం చేస్తున్నాం. భారత భవిష్యత్తు మార్చడానికి మాతో కలిసిరండి’ అని మోదీ పిలుపునిచ్చారు. పనికిరాని చట్టాలను తొలగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రవాసులకు నజరానా.. ప్రవాస భారతీయులకు మోదీ వరాలు ప్రకటించారు. పీఐవో కార్డులు ఉన్నవారికి వీసాల సమస్యలను తొలగించనున్నట్లు తెలిపారు. వారికి జీవితకాల వీసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పీఐవో, ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) స్కీములను కలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే భారత పర్యటనకు వచ్చే అమెరికన్లకు వీసా ఆన్ అరైవల్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ‘గాంధీ’ కూడా ఒకప్పుడు ప్రవాస భారతీయుడే. ఆయన దక్షిణాఫ్రికాలో బారిస్టర్ చదివి దేశానికి సేవ చేయడానికి భారత్‌కు తిరిగొచ్చి వచ్చే ఏడాదికి వందేళ్లు పూర్తవుతుంది. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న ప్రవాసీ భారతీయ దివస్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహిస్తాం. మనం కూడా మన మాతృదేశానికి సేవ చేసేందుకు చేతులు కలుపుదాం’ అని ఆయన పిలుపునిచ్చారు. చివరగా.. తనకు అమిత గౌరవాన్ని అందించిన భారతీయ అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులు కోరుకుంటున్న నవభారత్ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. దేశం కోసం.,. దేశ ప్రజల కోసం.. తన వల్ల సాధ్యమైనదంతా ఎలాంటి ఆపేక్ష లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. భారత్ మాతాకీ జై.. అంటూ ప్రసంగాన్ని ముగించారు. అభివృద్ధి ఉద్యమం రావాలి స్వాతంత్య్రం కోసం ప్రజా ఉద్యమం వచ్చినట్టే ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం రావాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకు అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ‘ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులే ఉంటారు. మహాత్ముడు స్వాతంత్య్రోద్యమాన్ని ఎలా ప్రజా ఉద్యమంగా మార్చారో ఇప్పుడు అభివృద్ధి కూడా అలాగే మన ఉద్యమం కావాలి. సుపరిపాలన దిశగా ముందడుగు పడాలి. 125కోట్ల భారతీయులే నా బలం. 2020కల్లా ప్రపంచమంతా ముసలివాళ్లతో నిండుతుంది. అప్పుడు మనమే వారికి మానవ వనరులను అందిస్తాం. యువశక్తిని ఉపయోగించుకుని ప్రపంచాన్నే జయిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. చిన్నవాణ్ని.. చిన్న వారి గురించే ఆలోచిస్తా.. ‘నేను పేదవాణ్ని.. చిన్న వాణ్ని. అందుకే చిన్న ఆలోచనలే చేస్తాను. చిన్న చిన్న వారి కోసం పెద్దపెద్ద పనులు చేస్తాను’ అని మోదీ అన్నారు. దేశంలోని 40 శాతం మంది ప్రజల ఆర్థిక ప్రతినిధి గంగానదేనన్నారు. గంగ ప్రక్షాళన ద్వారా వారందరి జీవితాల్లోనూ మార్పు వస్తుందన్నారు. ‘2019లో గాంధీ 125వ జయంతి జరగనుంది. ఆయనకు ఇష్టమైన పనులు చేద్దాం. 2022కి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. దాన్ని ఎలా నిర్వహించాలి. అప్పటి వరకు దేశంలో ఇల్లులేని కుటుంబం ఉండకూడదన్నది నా కల. ఇలాంటి చిన్న చిన్న వాటితోనే దేశం మారుతుంది’ అని పేర్కొన్నారు. -
స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికాలో స్వాగతం చెప్పాలంటే లక్ ఉండాలి మరి! ఈ నెల 28న అమెరికాలోని న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి స్పందన అధికంగా వస్తోంది. గత సోమవారం రాత్రికి వివిధ వర్గాల నుంచి 20 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. మంగళవారం నుంచి ఈ నెల 7 వరకు సాధారణ ప్రజానీకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు.