స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే | Prime minister Narendra Modi, America, New York City, Madison Square Garden, Welcoming ceremony, Washington | Sakshi
Sakshi News home page

స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే

Published Thu, Sep 4 2014 2:23 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే - Sakshi

స్వాగతం చెప్పాలంటే.. లాటరీ గెలవాల్సిందే

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్రమోడీకి అమెరికాలో స్వాగతం చెప్పాలంటే లక్ ఉండాలి మరి! ఈ నెల 28న అమెరికాలోని  న్యూయార్క్ నగరం, మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో మోడీ కోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమానికి స్పందన అధికంగా వస్తోంది. గత సోమవారం రాత్రికి వివిధ వర్గాల నుంచి 20 వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. మంగళవారం నుంచి ఈ నెల 7 వరకు సాధారణ ప్రజానీకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement