Melania
-
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం: స్టైలిష్ లుక్‌లో మెలానియా ట్రంప్
డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్‌లో జరిగింది. ఈ వేడుకలో ప్రపంచ కుభేరులు, అతిపెద్ద పారిశ్రామిక వేత్తలు, ట్రంప్ మంత్రి వర్గంలోని నామినేటెడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఉపాధ్యాక్షుడు ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ దంపతులు తమదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్(Melania Trump) డ్రెస్సింగ్ స్టైల్ కూడా హైలెట్‌గా నిలిచింది. మరీ ఆ డ్రెస్ విశేషాలేంటో చూద్దామా..!.ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఫ్యాషన్ డిజైనర్ ఆడమ్ లిప్పెస్ రూపొందించిన ఆల్-అమెరికన్ ఎంసెంబుల్ను ధరించారు. ఇది అమెరికాలో తయారైన క్లాత్‌తో రూపొందించిన డ్రెస్. నేవీ సిల్క్ ఉన్ని కోటు, నేవీ సిల్క్ ఉన్ని పెన్సిల్ స్కర్ట్, ఐవరీ సిల్క్ క్రేప్ బ్లౌజ్‌లతో హుందాగా కనిపించారు. ఆ డ్రెస్‌కి తగిన విధంగా ఎరిక్ జావిట్స్ రూపొందించిన బోటర్-స్టైల్ టోపీలో మెరిశారు. నిజానికి అమె ఎక్కువగా యూరోపియన్ లగ్జరీ డిజైనర్ వేర్లను ధరిస్తారు. అలాంటి ఆమె తొలిసారి అమెరికన్ డిజైనర్లు(American Designer) రూపొందించిన డ్రెస్‌లతో తళుక్కుమన్నారు. ఆమె ఎక్కువగా రిటైల్ షాపింగ్ చేయడానికే ఇష్టపడతారు. ఆమె సింపుల్‌గా సాదాసీదాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ట్రంప్ మొదటిసారి అధ్యుక్షుడు అయినప్పడు ఆమె ఫ్యాషన్ డిజైర్‌లకు దూరంగా ఉండేవారు. తనకునచ్చిన స్టైలిష్ వేర్‌లోనే కనిపించేవారు. అలాంటిది తొలిసారిగా తన భర్త విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఈ వేడుకలో డ్రెస్సింగ్ స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా అమెరికన్ డిజైనర్ల బృందం ఫ్యాషన్‌ని అనుసరించారు. ఈ ఫ్యాషన్ శైలి అనేది వ్యక్తి ఆనందాన్ని, నమ్మకాన్ని ప్రస్ఫుటుంగా ప్రతిబింబిస్తాయి కదూ..!. గతంలో ఇలానే మరికొంతమంది .. గతంలో ఇలానే 2021లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(Jill Biden) ఐక్యతను సూచించేలా ఐవరీ కష్మెరె కోటుని ధరించారు. ఆ డిజైనర్ వేర్‌పై సమాఖ్య చిహ్నమైన పూల ఎంబ్రాయిడీ ఉంటుంది. ఇలానే 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భార్య రోసాలిన్ కార్టర్ తన భర్త ప్రమాణ స్వీకారోత్వ వేడుకల్లో ఫ్యాషన్‌గా ఉండాలనుకంది. ఆమె బంగారు ఎంబ్రాయిడరీ తోకూడిని హై నెక్ బ్లూ షిఫాన్ గౌనుని ధరించింది. అయితే ఆ సమయంలో ఆ డిజైనర్‌వేర్ పాతది అని విమర్శల వెల్లువ వచ్చింది. అయితే ప్రథమ మహిళలు ఎలాంటి డ్రెస్‌లు అయినా ధరిస్తారు. ఫ్యాషన్‌ని మనమే సెట్ చేయాలి గానీ అది మనల్ని మార్చకూడదనేది వారి ఆంతర్యం. ప్రభావవంతమైన వ్యక్తులే రీ సైకిల్ చేసిన దుస్తులకు ప్రాధాన్యత ఇస్తేనే కదా సామాన్య ప్రజలు ఇలాంటి ఫ్యాషన్‌ని అనుకరించగలరనేది వారి భావన కాబోలు. అంతేగాదు 2009లో మిచెల్ ఒబెమా డిజైనర్ జాసన్ వు డిజైన్ చేసిన షిఫాన్ వన్-షోల్డర్ గౌనులో మెరిసిది. ఆమె యువ డిజైనర్లకు ప్రోత్సహించేందుకేనని చెప్పి అందరిని ఆలోచింప చేశారామె. ఆ డ్రెస్‌ని కుట్టడానికి ఎన్ని రాత్రుళ్లు నిద్రలేకుండా కష్టపడ్డాడనేది ఈడ్రైస్ని మరింత అందంగా ప్రత్యేకంగా చేసిందని సదరు డిజైనర్‌ని ప్రశంసించారు మిచెల్ ఒబామా. (చదవండి: ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ..! ఏకంగా 22 ఏళ్ల నాటి..) -
ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.తాజాగా ఆదివారం(అక్టోబర్28) రాత్రి న్యూయార్క్‌లో జరిగిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీ వేదికపై భార్య మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్సులు వేశారు. ర్యాలీలో అనూహ్యంగా ప్రత్యక్షమైన మెలానియా వేదికపైకి ట్రంప్ రాక ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ వేదికపైకి రాగానే ఆయనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని సందడి చేశారు. సభలో డ్యాన్సులేయడంతో పాటు ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ అని ట్రంప్ నినాదాలు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ క్రేజ్ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నెల రోజుల కిందట డెమొక్రాట్ అభ్యర్థి కమల హారిస్ కంటే వెనుకబడిన ట్రంప్ ఎన్నికల లేదీ దగ్గరవుతున్న కీలక సమయంలో పుంజుకోవడం రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. Okay just finished MSG Rally. Absolutely adored Melanias smile when she saw her husband doing the YMCA dance--it was awesome!! pic.twitter.com/QdoJvt5wki— Oblivion (@RedKryptonited) October 28, 2024ఇదీ చదవండి: ట్రంప్ గెలుపు మహిళలకు ముప్పు -
US ELECTIONS : ట్రంప్ ప్రచారంలో ఆమె కీ రోల్ !
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫోకస్ చేశారు. త్వరలో ప్రారంభమవనున్న ప్రైమరీ ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి జులై వరకు మొత్తం 50 రాష్ట్రాల్లో ప్రైమరీ బ్యాలెట్ జరగనుంది. దీని కోసం ట్రంప్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ సారి అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్లో ట్రంప్‌కు ఆయన కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని డిసైడయ్యారు. ఎక్కువగా తెర వెనుకే ఉంటూ పబ్లిసిటీ అంటే పెద్దగా ఇష్టపడని ట్రంప్ భార్య మెలానియా ఈసారి అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్కువగా పబ్లిక్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటున్నారని చెబుతున్నారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడవడం ఖాయమని ఆయన కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నట్లు ఈ విషయంలో వారంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఆయన భార్య మెలానియా కీలక పాత్ర పోషించినప్పటికీ తెరవెనుకే ఉండిపోయారు. ఈసారి మాత్రం ఆమె తెర వెలుపల కీ రోల్ పోషించనున్నారని టాక్. ఇదీచదవండి..ముంబై చేరిన ఆ విమానం.. 25 మంది ఇంకా ఫ్రాన్స్‌లోనే?! -
ఆస్పత్రి నుంచి డైరెక్ట్‌గా డిస్కోకు ట్రంప్, భార్య
వాషింగ్టన్ : గత కొద్ది కాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ దూరం పాటిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలను వారు పటాపంచలు చేశారు. ఏకంగా డిస్కో పార్టీలో సన్నిహితంగా మెలుగుతూ అందరూ నోళ్లు వెళ్లబెట్టుకునేలా చేశారు. ఓ పోర్న్‌స్టార్, ప్లేబోయ్ మోడల్ ఇలా తదితర మహిళలతో ట్రంప్‌కు శారీరక సంబంధాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మెలానియా దూరం జరిగిందని ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇటీవల ఫ్లోరిడాలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బ్రోవార్డ్ హెల్త్ నార్త్ ఆస్పత్రికి వెళ్లిన ట్రంప్ దంపతులు అన్యోన్యంగా కనిపించారు. వారు అక్కడి నుంచి నేరుగా మారా లాగో రిసార్ట్‌లోని స్టూడియో 54లో జరిగిన డిస్కో పార్టీకి వెళ్లారు. అక్కడ కాసేపు సేద తీరారు. ఆ సమయంలో మెలానియా తన భర్త ట్రంప్ చేతిని ప్రేమగా తీసుకొని చేతులో వేసుకొని కూర్చుంది. అది కూడా జాలీగా కబుర్లు చెబుతూ.. ఆ సమయంలో ట్రంప్ కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఆమె చెప్పే మాటలు వింటున్నారు. ఈ దృశ్యాన్ని తన మొబైల్లో క్లిక్ మనిపించిన ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో ప్రతి అధికారిక సమావేశాల సమయంలో ట్రంప్ చేతిని విసిరి కొట్టిన మెలానియా ఇలా డిస్కోలో మాత్రం ఎంత ప్రేమగా ఉన్నారో కదా అంటూ పెద్ద స్థాయిలో చర్చించుకుంటున్నారు. Last night Trump & Melania visited Broward Health North Hospital. The Trumps went straight from the Parkland victim visit to a Studio 54- themed disco party at Mar-a-Lago. A photo: pic.twitter.com/pbWLkfX27C — ☇RiotWomenn☇ (@riotwomennn) February 18, 2018 -
రెస్పెక్టెడ్ ట్రంప్ ట్రయోగ్రఫీ
ట్రంప్ జీవితంలో కోటి వివాదాలు. ముక్కోటి ఆరోపణలు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ... అతడిపై వాదనలు, విమర్శలు పదునెక్కుతున్నాయి. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్ జీవితంలో మూడు పూలు, అరకొర ముళ్లు కూడా ఉన్నాయి. ఒక మనిషి జీవితానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. అందుకే దాన్ని ‘బయోగ్రఫీ’ అంటారు. మరి... మూడు పార్శ్వాలు ఉంటే.. దాన్ని ట్రయోగ్రఫీ అనాలి. - మాధవ్ శింగరాజు అమెరికా 45వ సారథిగా ప్రపంచం ఎవరిని చూడబోతున్నదనేది నవంబర్ 8వ తేదీ రాత్రికి తేలిపోతుంది. ఎవరిని చూడకూడదని ప్రపంచం అనుకుంటోందన్నది మాత్రం ఇప్పటికే తేలిపోయింది! అయితే ప్రపంచం, అమెరికా ఎప్పుడూ ఒకటి కాదు కాబట్టి; ప్రపంచంలోని ఒక దేశంగా అమెరికా తనను తను అనుకోదు కాబట్టి.. ప్రపంచ అభీష్టానికి వ్యతిరేకంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినా ఆశ్చర్యం లేదు. • నిజానికి ఈ అంచనా కొద్ది రోజుల క్రితం నాటిది. గెలుపు అవకాశాలు హిల్లరీకి, ట్రంప్‌కీ సరి సమానంగా ఉన్నప్పటిది. ఇప్పుడు అలా లేదు. ట్రంప్‌కు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అని గట్టిగా చెప్పడానికి లేదు. డెమోక్రాట్లు ట్రంప్‌పై ఊహించని అస్త్రం ప్రయోగించారు. స్త్రీల గురించి ట్రంప్ ఎంత అమర్యాదగా మాట్లాడాడో చూడండని అతడి పాత ఇంటర్వ్యూల టేపులను అమెరికన్లకు వినిపించారు. అంతే! ఒక్కసారిగా ట్రంప్ ఇమేజ్ గ్రాఫ్ పడిపోయింది. ట్రంప్ నేను అలాంటి వాడిని కాదు అన్నారు. ‘కావాలంటే నా భార్యను అడగండి, క్లింటన్ తన భార్యకు క్షమాపణ చెప్పినట్టు, నేను నా భార్యకు క్షమాపణ కూడా చెప్పలేదు’ అన్నారు. ఇదంతా డెమోక్రాట్ల కుట్ర అన్నారు. గత మంగళవారం మూడో డిబేట్లో మాట్లాడుతూ...Nobody has more respect for women that I do. Nobody...అన్నారు. ఆడియెన్స్ గొల్లుమన్నారు. ట్రంప్ నొచ్చుకోలేదు. Nobody has more respect అని... అదే మాటను బలంగా, స్థిరంగా రిపీట్ చేశారు. స్త్రీల గురించి తనేం మాట్లాడినా, స్త్రీలతో తను ఎలా ఉన్నా, అది స్త్రీల మీద ఉన్న గౌరవంతోనే అన్న భావన కలిగించేలా ఉంది ట్రంప్ టోన్. బహుశా ఆ టోన్‌లోని నిజాయితీని అమెరికన్ మగాళ్లు పట్టేసే ఉంటారు. మగాళ్లు కాబట్టి! బహుశా ఆ టోన్‌లోని నిజాయితీకి అమెరికన్ ఆడవాళ్లు కన్విన్స్ అయ్యే ఉంటారు. ఆడవాళ్లు కాబట్టి! ఈ వారం రోజుల్లో మళ్లీ ట్రంప్ గ్రాఫ్ పెరిగింది! ఇంట్లో మొండి పిల్లవాడి మీద ఉండే ప్రత్యేకమైన ప్రేమ వంటిదేదో ట్రంప్‌పై అమెరికన్ పౌరులకు కలిగినట్లుగా అనిపిస్తోంది. వైట్ వర్కింగ్ క్లాస్‌లో 37 శాతం మంది ట్రంప్ వైపు వచ్చేశారట! హిల్లరీకి మద్దతు ఇస్తున్న 25 శాతం అవివాహిత యువతుల్లో, 10 శాతం మంది చదువుకున్న మహిళల్లో ట్రంప్ వైపు చూస్తున్నారట! వచ్చే పదిహేను రోజుల్లో ట్రంప్‌పై ఉన్న ‘మిసాజినిస్ట్’ (స్త్రీ ద్వేషి) ముద్ర మాయం కావచ్చు. హిల్లరీని ద్వేషించినంత మాత్రాన స్త్రీద్వేషి అయిపోతారా అనే ప్రశ్న ట్రంప్ తరఫున వినిపించడం అమెరికాలో ఆల్రెడీ మొదలైంది. • ఈ క్రెడిట్‌ను ట్రంప్ ముఖ్యంగా ముగ్గురు ఆడవాళ్లకు ఇవ్వాలి. ఇవానా మ్యారీ, మార్లా మేపుల్స్, మెలానియా ట్రంప్. ఇవానా, మార్లా ఒకప్పుడు ట్రంప్ భార్యలు. మెలానియా ప్రస్తుత జీవితభాగస్వామి. ‘‘ట్రంప్ మౌనంగా ఉండలేరు. అవుట్ స్పోకెన్. ఒబామా తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వయంగా తీసుకోలేరు. కానీ ట్రంప్ తీసుకోగలరు’’ అని ట్రంప్ మొదటి భార్య ఇవానా అనడం ట్రంప్‌కు ఏనుగంత బలాన్ని ఇచ్చింది. రెండో భార్య మార్లా కూడా ట్రంప్ కోసం బరిలోకి దిగారు. ‘‘అభిప్రాయభేదాలు తప్ప మా మధ్య అహంకార యుద్ధాలు లేవు’’ అని లోకానికి వెల్లడించారు. ఇక ఇప్పటి భార్య మెలానియా ఇచ్చిన సర్టిఫికెట్ అల్టిమేట్. ‘‘ట్రంప్‌ది వట్టి బాయ్ టాక్. మనసులో ఏమీ ఉండదు. నా కొడుకు ఎంతో, నా భర్త అంత’’ అన్నారు. • ట్రంప్ ఎన్నికల అజెండాలోని అంశాలన్నిటినీ పక్కకు తోసి, స్త్రీల వివాదం ఏదైతే అకస్మాత్తుగా భూతంలా పైకి లేచి ఆయన ప్రతిష్టను దెబ్బతీసిందో... అదే వివాదాన్ని పక్కకు తోసి ఆయన ప్రతిష్టని తిరిగి ప్రతిష్ఠించింది మళ్లీ ఆ స్త్రీలే కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడిగా గెలిచినా, గెలవకున్నా ట్రంప్ అమెరికన్ స్త్రీలందరి ప్రతినిధులుగా ఈ స్త్రీమూర్తులు ముగ్గురికీ రుణపడి ఉండాలి. 1 ,ఇవానా మ్యారీ (67) ట్రంప్ మొదటి భార్య • ట్రంప్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయారు. కూతురు, ఇద్దరు కొడుకులు. పెళ్లయిన కొత్తల్లో ట్రంప్‌కు నెత్తిపై బట్ట తలలా చిన్న ప్యాచ్ మొదలైంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొమ్మని ఇవానా సలహా ఇచ్చారు. అయితే ట్రీట్మెంట్ వికటించి ప్యాచ్ మరింత పెద్దదైంది! ఆ కోపాన్ని భార్య మీద చూపించాడు ట్రంప్. ఇవానా జుట్టు పట్టి లాగి, ఆమె మాడు పగిలేలా కొట్టాడు. ఇలాంటి చేష్టలతో విసుగెత్తి పోయిన ఇవానా ఇక అతడితో కలిసి ఉండలేనని తీర్మానించుకున్నారు. • ట్రంప్‌కంటే ముందు ఇవానాకు 1971లో ఆల్ఫ్రెడ్ అనే రియల్ ఎస్టేస్ ఏజెంటుతో పెళ్లయింది. రెండేళ్ల కన్న ఎక్కువ కాలం ఆ దాంపత్యం నిలవలేదు. ట్రంప్‌తో విడిపోయాక ఇవానా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆ పెళ్లిళ్లూ ఒకటి రెండేళ్లకే విడాకులయ్యాయి. హాలీవుడ్ మూవీ ‘ది ఫస్ట్ వైఫ్స్ క్లబ్’ లో ఇవానా చిన్న పాత్ర వేశారు. అందులో ఆమె ఒక డైలాగ్ చెబుతారు. ‘లేడీస్ యు హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. అండ్ రిమెంబర్: డోంట్ గెట్ మ్యాడ్, గెట్ ఎవ్రీథింగ్’. • ప్రస్తుతం ఇవానే ఒక్కరే ఉంటున్నారు. పిల్లలు మాత్రం తల్లింటికీ, తండ్రి ట్రంప్ ఇంటికీ తిరుగుతుంటారు. • మొదటి భర్తతో విడాకులు (1973) తీసుకున్నాక చెక్ నుంచి కెనడా వచ్చేశారు. మెక్ గిల్ యూనివర్సిటీలో స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకున్నారు. కెనడాలో ఫర్ ఫ్యాషన్ వస్త్రాలను ఉత్పత్తి చేసే ప్రసిద్ధ కంపెనీలకు మోడల్‌గా పని చేశారు. • న్యూయార్క్‌లో ఇవానాకు ఫ్రెడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ పుత్రరత్నంతో పరిచయం అయింది. ఆ రత్నమే... డొనాల్డ్ ట్రంప్. పరిచయం పెళ్లి (1977) వరకు వెళ్లింది. భార్యగా ట్రంప్ ఆమెను నెత్తి మీద పెట్టుకున్నాడు. యు.ఎస్. పౌరసత్వాన్నీ తెచ్చి ఆమె తలపై కిరీటంలా అలంకరించాడు. అయితే సడెన్‌గా ‘భర్త ప్రేమ’ అనే కిరీటం ఇంట్లో మిస్ అయింది! ఆ కిరీటం... జార్జియా మాజీ బ్యూటీ క్వీన్ మార్లా మేపుల్స్ ఇంట్లో ఉందని ఇవానాకు తెలిసింది. భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఇవానా వివాహ బంధం నుంచి బైటపడ్డారు. • ఇవానా.. ట్రంప్ నుంచి విడిపోయాక నవలు రాశారు. ‘ఫర్ లవ్ ఎలోన్’, ‘ఫ్రీ టు లవ్’ అనే నవలలకు, ‘ది బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్: కోపింగ్ విత్ డైవోర్స్ అండ్ ఎంజాయింగ్ లైఫ్ అగైన్’ అనే సెల్ఫ్‌హెల్ప్ పుస్తకానికి మంచి పేరొచ్చింది. ‘డైవోర్స్ మ్యాగజీన్’లో కొన్నాళ్ల పాటు సలహాల శీర్షికను కూడా ఇవానా నిర్వహించారు. హాలీవుడ్ మూవీ ‘ది ఫస్ట్ వైఫ్స్ క్లబ్’ లో చిన్న పాత్ర వేశారు. అందులో ఆమె ఒక డైలాగ్ చెబుతారు. ‘లేడీస్ యు హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. అండ్ రిమెంబర్: డోంట్ గెట్ మ్యాడ్, గెట్ ఎవ్రీథింగ్’. 2. మార్లా మేపుల్స్ (52) ట్రంప్ రెండో భార్య • ట్రంప్‌తో మార్లా ఎనిమిదేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. ట్రంప్ తర్వాత ఇంకెవరితోనూ కలిసి లేరు. ఇంటర్నెట్ సెలబ్రిటీ టిఫానా ఏరియానా (23) వీళ్ల అమ్మాయే. ట్రంప్‌తో ప్రేమలో పడేనాటికే మార్లా పేరున్న హాలీవుడ్ నటి, టెలివిజన్ పర్సనాలిటీ. • పెళ్లికి ముందు నాలుగేళ్ల పాటు సౌథాంప్టన్ బీచ్ హౌస్ ‘ట్రంప్ ప్రిన్సెస్ యాట్’లో ట్రంప్, మార్లా రహస్య దాంపత్య జీవితం గడిపారు. పెళ్లయ్యాక మాత్రం అంత దీర్ఘవ్యవధిలో ప్రేమ జీవితాన్ని గడపలేక పోయారు. ‘‘ఆయన కోరుకున్నంతగా నేను, నేను కోరుకున్నంతగా అయన ఒకరికొకరం ఇచ్చుకోలేకపోయాం’’ అని ఈ మధ్యే ‘యాక్సెస్ హాలివుడ్’ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్లా చెప్పారు. • బాల్యంలో మార్లాపై తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంది. ఆమె గృహిణి, మోడల్ కూడా. తండ్రి ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఆయన రియల్ ఎస్టేట్ డెవలపర్. ఉండటం జార్జియాలో. టీనేజ్‌కి వచ్చేసరికి.. మార్లా ‘జార్జియా’ అందాల రాణి అయిపోయింది. తర్వాత కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె నటించారు. టెలివిజన్‌లో, సోషల్ వర్క్‌లో, స్టేజ్ నాటకాలలో, ఆరోగ్య కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ‘నాకు టైమ్ ఇవ్వవేంటీ’ అని ట్రంప్. ‘ఇద్దరం వేర్వేరు కానప్పుడు ఒకరి కోసం ఒకరం వేచి ఉండడం ఏమిటి?’ అని మార్లా. ట్రంప్‌కు ఒక విషయం అర్థమైంది. మార్లా ‘ఇండిపెండెంట్ ఉమన్’ అని! • విడాకులు తీసుకున్న మరుసటి ఏడాదే మార్లా తన ఆత్మకథను రాసుకున్నారు. ‘ఆల్ దట్ గ్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్’ ఆ పుస్తకం పేరు. మెరిసేదంతా బంగారం కాదని. ట్రంప్ గురించే ఆవిడ రాసి ఉంటారని అంతా అనుకున్నారు. ఏం రాసి ఉంటారా అని ఎదురు చూశారు. హార్పర్స్ కాలిన్స్ పబ్లిషర్స్ పుస్తకాన్ని వెయ్యడానికి ముందుకు వచ్చారు. వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో! రెండేళ్ల తర్వాత పబ్లిషర్స్ నుంచి మరో ప్రకటన వెలువడింది. ‘రచయిత్రి, మేము కలిసి పరస్పర ఒప్పందంతో ఈ పుస్తకాన్ని ప్రచురించకూడదు అని నిర్ణయించుకున్నాం’ అని!! దీని వెనుక ట్రంప్ ఒత్తిడి ఉండివుంటుందని అప్పట్లో అంతా అనుకున్నారు. • మార్లా దగ్గర దాపరికాలు ఉండవు. 1990 క్రిస్మస్ సీజన్లో తొలిసారిగా ఇవానా, మార్లా ఒకరినొకరు చూసుకున్నారు. ముందుగా మార్లానే ఇవానా దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు.. ‘‘నేను మీ భర్తను ప్రేమిస్తున్నాను’’ అని. ఇవానా అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఒక టీవీ షోలో.. భార్య వదిలేసిన భర్తను ప్రేమించవచ్చు కానీ, భార్య ఉన్న భర్తను ప్రేమించే తప్పును అమ్మాయిలు ఏ పరిస్థితుల్లోనూ చెయ్యకూడదు అని ఇవానా అన్నారు. మార్లా ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 3. మెలానియ (46) ట్రంప్ మూడో భార్య • మెలానియ గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో ఈ అమ్మాయిని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చూశాడు. అప్పటికి అతడు రెండో భార్యతోనూ విడిపోయాడు కానీ, విడాకులు తీసుకోలేదు. ఎవరీ అమ్మాయి అని ఆరా తీశాడు. మనమ్మాయి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలానియ ఇవ్వలేదు! • మెలానియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు ట్రంప్. అలా కొంతకాలం అన్లు, ఆఫ్‌లుగా వాళ్ల రిలేషన్ నడిచింది. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తమ అనుబంధం గురించి ట్రంప్ తొలిసారి ఓ టీవీ చానెల్లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. 2004లో వీళ్ల ఎంగేజ్మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలానియ తల్లి అయింది. కొడుకు పుట్టాడు. ‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు. ఇంట్లో నాకు ఇద్దరు కొడుకులు. నా కొడుకు, నా భర్త’’ - మెలానియా • మెలానియకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. ఆమె తండ్రి స్లొవేనియా ప్రభుత్వ మోటార్ వెహికల్స్ డీలర్. స్లొవేనియా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. తల్లికి బట్టల కంపెనీ ఉంది. మెలానియాకు ఒక చెల్లి ఉంది. మెలానియ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్‌లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలానియ. • ఇన్ని భాషలు వ చ్చినా... ప్రస్తుతం ట్రంప్‌పై వస్తున్న ఆరోపణల్ని తిప్పి కొట్టడానికి ఏ భాషకూ బలం సరిపోవడం లేదు. అంతగా ట్రంప్‌పై దాడి మొదలైంది. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని మెలానియా అంటున్నారు. ‘‘నా భర్త గురించి నాకు తెలుసు. ఆడవాళ్ల విషయంలో అబ్బాయిలు చెప్పుకునే గొప్పల్లాంటివే ఆయన మాటలు’’ అని మెలానియా వెనకేసుకొస్తున్నారు. ఎంత వెనకేసుకొచ్చినా.. మొదటి భార్య కూతురు ఇవాంక విషయంలో తన భర్త చేసిన కామెంట్లను మాత్రం ఆమె నిజాయితీగా ఖండించారు. • ఏమైనా మెలానియ తన భర్తపై విమర్శల్ని పట్టించుకునే వ్యక్తి కాదు. ట్రంప్ ధోరణి గురించి అడిగితే ఆమె ఎప్పుడూ ఒకే మాట చెబుతారు : ‘సెన్సేషన్ కోసం ఆయన్ని మాట్లాడిస్తారు తప్ప, సెన్సేషన్ కోసం ఆయనకై ఆయన మాట్లాడరు’ అని. ఇటీవలే ఇంకో ఒక అందమైన మాట కూడా అన్నారు మెలానియ. ఇంట్లో తనకు ఇద్దరు కొడుకులట. తన కొడుకు. తన భర్త. -
మరో వివాదంలో ట్రంప్ భార్య
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్‌కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ టాబ్లాయిడ్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధలను ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. కాగా ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. 1995లో ఆమె న్యూయార్క్‌లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో ఓ ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఆ సమయంలో మెలానియా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మెలానియా, ఏ టైప్ వీసా ఉపయోగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని, వీసా నిబంధనలను మార్చాలని ప్రధానంగా ప్రచారం చేస్తున్న ట్రంప్ శిబిరానికిది ఇబ్బందికరంగా మారింది. మెలానియాపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ మేనేజర్ ఖండించినా, స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. మెలానియా స్వదేశం స్లొవేనియా. ట్రంప్‌కు ఆమె మూడో భార్య. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. -
ఆమె వెబ్సైట్ మూసివేత వెనుక.. ?
వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచమంతటా దుమారం రేపుతున్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఇంటర్నెట్లోనూ ఆయన హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భార్య మెలీనియా ట్రంప్ వెబ్సైట్ అకస్మాత్తుగా ఇంటర్నెట్లో నుంచి మాయమైపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 22 నుంచి మెలీనియా వ్యక్తిగత, వృత్తిపరమైన వెబ్సైట్ అయిన ‘మెలీనియా ట్రంప్.కామ్’ కనిపించడం లేదు. ఈ సైట్ గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే.. ట్రంప్.కామ్‌కు రీడైరెక్ట్ అవుతోంది. ఒకప్పుడు సూపర్ మోడల్ అయిన మెలీనియా వ్యక్తిగత వెబ్సైట్ మూసివేయడం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత వెబ్సైట్లో మెలీనియా తాను స్లోవెనియా యూనివర్సిటీ నుంచి డిజైనింగ్, అర్కిటెక్చర్‌లో డిగ్రీ పొందినట్టు తెలిపింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టినట్టు పేర్కొంది. అయితే, ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రథమ పౌరురాలి హోదా పొందనున్న మెలీనియా జీవితకథను గత ఫిబ్రవరిలో ఓ పత్రిక ప్రచురించింది. మెలీనియా చదువు మధ్యలోనే మానేసిందని, యూనివర్సిటీ డిగ్రీ ఆమెను పొందలేదని ఆ పత్రిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మెలీనియా ఇంతకూ డిగ్రీ చదివిందా? లేక తనకు డిగ్రీ లేకున్నా ఉన్నట్టు ఇన్నాళ్లు వెబ్సైట్లో గొప్పలు చెప్పుకుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం వివాదాస్పదమవుతుండటంతో మెలీనియా డిగ్రీ రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఈ వెబ్‌సైట్‌ను మూసివేసినట్టు విమర్శకులు అంటున్నారు. మరోవైపు తన ప్రస్తుత వృత్తి, వ్యాపారాలకు అనుగుణంగా లేకపోవడంతోనే ఈ వెబ్‌సైట్‌ను మూసివేసినట్టు మెలీనియా ఓ ట్వీట్లో తెలిపింది. -
మా ఆయనకు అమెరికా ఏలే సత్తా ఉంది
* ట్రంప్ భార్య పొగడ్తలు * అమెరికాను ఏలే సత్తా ఉంది క్లీవ్‌లాండ్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన భార్య మెలానియా ప్రశంసలు కురిపించారు. ఆయన దయాళువు అని, అమెరికాను పాలించే సత్తా ఉందని కొనియాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్‌ను మంచిగా చూపే యత్నం చేశారు. ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసేందుకు రిపబ్లికన్ పార్టీ క్లీవ్‌లాండ్‌లో జాతీయ సదస్సును సోమవారం ప్రారంభించింది. మెలానియా మాట్లాడుతూ.. ‘మన దేశమంటే ట్రంప్‌కు ఎనలేని గౌరవముంది. అమెరికాలో గొప్ప మార్పు తీసుకురాగల సత్తా ట్రంప్‌కు ఉంది’ అని అన్నారు. ఆయన క్రైస్తవులు, ముస్లింలు, అమెరికన్లు, ఆసియన్లు ఇలా అన్ని వర్గాల వారికీ ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. మాజీ ఫ్యాషన్ మోడల్ అయిన 46 ఏళ్ల మెలినియా.. ట్రంప్‌కు మూడో భార్య. ట్రంప్ తన భార్యను పరిచయం చేస్తూ..‘ఆమె అమెరికాకు గొప్ప మొదటి మహిళ కాబోతున్నార’న్నారు. కాగా 2008లో ఒబామా భార్య మిషెల్ చేసిన ప్రసంగం నుంచి మెలానియా కాపీ కొట్టారనే విమర్శలొచ్చాయి. సదస్సులో రిపబ్లికన్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. భారత్ తమకు రాజకీయాలతోపాటు పలు అంశాల్లో భాగస్వామి అని పేర్కొంది.