వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఫోకస్ చేశారు. త్వరలో ప్రారంభమవనున్న ప్రైమరీ ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి జులై వరకు మొత్తం 50 రాష్ట్రాల్లో ప్రైమరీ బ్యాలెట్ జరగనుంది. దీని కోసం ట్రంప్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.
అయితే ఈ సారి అధ్యక్ష ఎన్నికల క్యాంపెయినింగ్‌లో ట్రంప్‌కు ఆయన కుటుంబ సభ్యులు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని డిసైడయ్యారు. ఎక్కువగా తెర వెనుకే ఉంటూ పబ్లిసిటీ అంటే పెద్దగా ఇష్టపడని ట్రంప్ భార్య మెలానియా ఈసారి అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్కువగా పబ్లిక్ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటున్నారని చెబుతున్నారు.
ట్రంప్ మళ్లీ అధ్యక్షుడవడం ఖాయమని ఆయన కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నట్లు ఈ విషయంలో వారంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారని ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ ఆయన భార్య మెలానియా కీలక పాత్ర పోషించినప్పటికీ తెరవెనుకే ఉండిపోయారు. ఈసారి మాత్రం ఆమె తెర వెలుపల కీ రోల్ పోషించనున్నారని టాక్.
ఇదీచదవండి..ముంబై చేరిన ఆ విమానం.. 25 మంది ఇంకా ఫ్రాన్స్‌లోనే?!
Comments
Please login to add a commentAdd a comment