ఆస్పత్రి నుంచి డైరెక్ట్‌గా డిస్కోకు ట్రంప్‌, భార్య | Melania touched Trump with love! | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి డైరెక్ట్‌గా డిస్కోకు ట్రంప్‌, భార్య

Published Tue, Feb 20 2018 7:44 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Melania touched Trump with love! - Sakshi

డిస్కోలో డోనాల్డ్‌ ట్రంప్‌, మెలానియా ట్రంప్‌

వాషింగ్టన్‌ : గత కొద్ది కాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ట్రంప్‌ దూరం పాటిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలను వారు పటాపంచలు చేశారు. ఏకంగా డిస్కో పార్టీలో సన్నిహితంగా మెలుగుతూ అందరూ నోళ్లు వెళ్లబెట్టుకునేలా చేశారు. ఓ పోర్న్‌స్టార్‌, ప్లేబోయ్‌ మోడల్‌ ఇలా తదితర మహిళలతో ట్రంప్‌కు శారీరక సంబంధాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మెలానియా దూరం జరిగిందని ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇటీవల ఫ్లోరిడాలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బ్రోవార్డ్‌ హెల్త్‌ నార్త్‌ ఆస్పత్రికి వెళ్లిన ట్రంప్ దంపతులు అన్యోన్యంగా కనిపించారు. వారు అక్కడి నుంచి నేరుగా మారా లాగో రిసార్ట్‌లోని స్టూడియో 54లో జరిగిన డిస్కో పార్టీకి వెళ్లారు. అక్కడ కాసేపు సేద తీరారు. ఆ సమయంలో మెలానియా తన భర్త ట్రంప్‌ చేతిని ప్రేమగా తీసుకొని చేతులో వేసుకొని కూర్చుంది. అది కూడా జాలీగా కబుర్లు చెబుతూ.. ఆ సమయంలో ట్రంప్‌ కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుంటూ ఆమె చెప్పే మాటలు వింటున్నారు. ఈ దృశ్యాన్ని తన మొబైల్‌లో క్లిక్‌ మనిపించిన ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో ప్రతి అధికారిక సమావేశాల సమయంలో ట్రంప్‌ చేతిని విసిరి కొట్టిన మెలానియా ఇలా డిస్కోలో మాత్రం ఎంత ప్రేమగా ఉన్నారో కదా అంటూ పెద్ద స్థాయిలో చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement