డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్‌లో జరిగింది. ఈ వేడుకలో ప్రపంచ కుభేరులు, అతిపెద్ద పారిశ్రామిక వేత్తలు, ట్రంప్ మంత్రి వర్గంలోని నామినేటెడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఉపాధ్యాక్షుడు ఉషా చిలుకూరి, జేడీ వాన్స్ దంపతులు తమదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్(Melania Trump) డ్రెస్సింగ్ స్టైల్ కూడా హైలెట్‌గా నిలిచింది. మరీ ఆ డ్రెస్ విశేషాలేంటో చూద్దామా..!.
ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఫ్యాషన్ డిజైనర్ ఆడమ్ లిప్పెస్ రూపొందించిన ఆల్-అమెరికన్ ఎంసెంబుల్‌ను ధరించారు. ఇది అమెరికాలో తయారైన క్లాత్‌తో రూపొందించిన డ్రెస్. నేవీ సిల్క్ ఉన్ని కోటు, నేవీ సిల్క్ ఉన్ని పెన్సిల్ స్కర్ట్, ఐవరీ సిల్క్ క్రేప్ బ్లౌజ్‌లతో హుందాగా కనిపించారు. ఆ డ్రెస్‌కి తగిన విధంగా ఎరిక్ జావిట్స్ రూపొందించిన బోటర్-స్టైల్ టోపీలో మెరిశారు.
నిజానికి అమె ఎక్కువగా యూరోపియన్ లగ్జరీ డిజైనర్ వేర్‌లను ధరిస్తారు. అలాంటి ఆమె తొలిసారి అమెరికన్ డిజైనర్లు(American Designer) రూపొందించిన డ్రెస్‌లతో తళుక్కుమన్నారు. ఆమె ఎక్కువగా రిటైల్ షాపింగ్ చేయడానికే ఇష్టపడతారు. ఆమె సింపుల్‌గా సాదాసీదాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది.
ట్రంప్ మొదటిసారి అధ్యుక్షుడు అయినప్పడు ఆమె ఫ్యాషన్ డిజైర్లకు దూరంగా ఉండేవారు. తనకునచ్చిన స్టైలిష్ వేర్‌లోనే కనిపించేవారు. అలాంటిది తొలిసారిగా తన భర్త విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఈ వేడుకలో డ్రెస్సింగ్ స్టైల్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యేకంగా అమెరికన్ డిజైనర్ల బృందం ఫ్యాషన్‌ని అనుసరించారు. ఈ ఫ్యాషన్ శైలి అనేది వ్యక్తి ఆనందాన్ని, నమ్మకాన్ని ప్రస్ఫుటుంగా ప్రతిబింబిస్తాయి కదూ..!.
గతంలో ఇలానే మరికొంతమంది ..
గతంలో ఇలానే 2021లో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(Jill Biden) ఐక్యతను సూచించేలా ఐవరీ కష్మెరె కోటుని ధరించారు. ఆ డిజైనర్ వేర్‌పై సమాఖ్య చిహ్నమైన పూల ఎంబ్రాయిడీ ఉంటుంది. ఇలానే 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ భార్య రోసాలిన్ కార్టర్ తన భర్త ప్రమాణ స్వీకారోత్వ వేడుకల్లో ఫ్యాషన్‌గా ఉండాలనుకంది. ఆమె బంగారు ఎంబ్రాయిడరీ తోకూడిని హై నెక్ బ్లూ షిఫాన్ గౌనుని ధరించింది.
అయితే ఆ సమయంలో ఆ డిజైనర్‌వేర్ పాతది అని విమర్శల వెల్లువ వచ్చింది. అయితే ప్రథమ మహిళలు ఎలాంటి డ్రెస్‌లు అయినా ధరిస్తారు. ఫ్యాషన్‌ని మనమే సెట్ చేయాలి గానీ అది మనల్ని మార్చకూడదనేది వారి ఆంతర్యం. ప్రభావవంతమైన వ్యక్తులే రీ సైకిల్ చేసిన దుస్తులకు ప్రాధాన్యత ఇస్తేనే కదా సామాన్య ప్రజలు ఇలాంటి ఫ్యాషన్‌ని అనుకరించగలరనేది వారి భావన కాబోలు.
అంతేగాదు 2009లో మిచెల్ ఒబెమా డిజైనర్ జాసన్ వు డిజైన్ చేసిన షిఫాన్ వన్-షోల్డర్ గౌనులో మెరిసిది. ఆమె యువ డిజైనర్లకు ప్రోత్సహించేందుకేనని చెప్పి అందరిని ఆలోచింప చేశారామె. ఆ డ్రెస్‌ని కుట్టడానికి ఎన్ని రాత్రుళ్లు నిద్రలేకుండా కష్టపడ్డాడనేది ఈడ్రైస్‌ని మరింత అందంగా ప్రత్యేకంగా చేసిందని సదరు డిజైనర్‌ని ప్రశంసించారు మిచెల్ ఒబామా.
(చదవండి: ట్రంప్ విందుకి కాంచీపురం చీరకట్టులో నీతా అంబానీ..! ఏకంగా 22 ఏళ్ల నాటి..)
Comments
Please login to add a commentAdd a comment