హారిస్‌కు మద్దతుగా ప్రచారం
కలమజూ (మిషిగన్): అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అమెరికా మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా హెచ్చరించారు. దాన్ని నివారించాలంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మిషిగన్‌లో డెమొక్రాట్ల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు.
‘‘ఈ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోతే మీ భార్య, మీ కూతురు, మీ తల్లి... ఇలా మహిళలుగా మేమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ తర్వాత పార్టీ ప్రచారంలో మిషెల్ పాల్గొనడం ఇదే తొలిసారి. హారిస్‌కు మద్దతుగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆమె ప్రజల ప్రయోజనాలకోసమే పని చేస్తారన్నారు.
ర్యాలీ అనంతరం మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌తో కలిసి హారిస్ ట్రాక్ హౌజ్ బార్ అండ్ గ్రిల్‌కు వెళ్లారు. స్థానికంగా తయారుచేసిన బీర్ తాగారు. స్థానికులతో పిచ్చాపాటీ మాట్లాడారు. యువతుల టేబుల్ వద్దకు రాగానే వారిలో ఒకరు హారిస్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మిషిగన్‌లో ఇప్పటికే 20 శాతం మంది ముందస్తుగా ఓటేశారు.
మహిళలకు అవకాశాలు: బైడెన్
హారిస్ గెలిస్తే అన్ని రంగాల్లోనూ మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పిట్స్‌బర్గ్‌లోని లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికాలో ఆయన మాట్లాడారు. కారి్మకులను ట్రంప బలహీనపరిచారని మండిపడ్డారు. కారి్మక ప్రయోజనాల కోసం ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: కమలాహారిస్‌కు గాయని బియాన్స్ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment