ఖతర్నాక్..హిజ్రా | Eunuch try to cheats software engineer in banjarahills | Sakshi
Sakshi News home page

ఖతర్నాక్..హిజ్రా

Published Wed, Jun 18 2014 9:55 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

ఖతర్నాక్..హిజ్రా

ఖతర్నాక్..హిజ్రా

    *యువతిలా లిప్ట్ అడిగి..
     *సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై అభాండాలు
     *స్థానికులు అప్రమత్తమయ్యేలోపు పరుగులు
     *బంజారాహిల్స్‌లో ఓ హిజ్రా వెరైటీ తెగింపు
 
 బంజారాహిల్స్ : సాధారణంగా హిజ్రాలు.. సార్/ మేడం టెన్ రూపీస్ ఉంటే ఇవ్వండి..అమ్మా దానం చేయండని అడుక్కుంటుంటారు. దుకాణాల వద్ద, కాలేజీల వద్ద, రైళ్లు, బస్టాండ్లలో జబర్దస్తీ చేసి వసూలు చేస్తారు. ఈసమయంలో పలుమార్లు ఘర్షణలు కూడా జరుగుతుంటాయి.  అయితే బంజారాహిల్స్‌లో ఓ హిజ్రా ఖతర్నాక్ ప్లాన్ వేసింది. లిప్ట్ అడిగి బండెక్కి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ముప్పుతిప్పలు పెట్టాలనుకొని చివరకు అడ్డంగా దొరికిపోయింది.

ఈ వెరైటీ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..సాప్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ మంగళవారం ఉదయం బైక్‌పై హైటెక్‌సిటీకి వెళ్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్‌నెం.12 కమాన్ వద్దకు రాగానే స్కార్ఫ్ ధరించిన ఓ యువతి లిప్ట్ అడగ్గా..ఆపడంతో వెనుక కూర్చుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వద్దకు రాగానే ఆమె బైక్‌ను ఆపమనడంతో శ్రీనివాస్ వెంటనే బైక్ నిలిపేశాడు. అంతే క్షణాల్లో బైక్ తాళం చెవులు తీసుకొని ‘తనను ఈ యువకుడు మోసం చేశాడు. లైంగిక వాంఛ తీర్చుకొని డబ్బులివ్వకుండా వెళ్తున్నాడని’ అరుపులు పెట్టింది.

షాక్ తిన్న శ్రీనివాస్..‘ఇదంతా అబద్దం. బైక్‌కు అడ్డొచ్చి లిప్ట్ అడగడంతో ఎక్కించుకున్నా. ఈమెకు నాకు ఎలాంటి సంబంధం లేదని’ చెప్పాడు. శ్రీనివాస్ అమాయకత్వాన్ని గమనించిన స్థానికులు సదరు యువతి మోసానికి పాల్పడి అందినకాడికి లాక్కునేందుకు యత్నిస్తుందని గుర్తించారు. పోలీసులకు సమాచారమిస్తే తన గుట్టురట్టవుతుందని భావించిన సదరు యువతి తప్పించుకునే యత్నం చేయగా స్థానికులు పట్టుకొని ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ తొలగించారు. తీరా చూస్తే ఆమె యువతి కాదు..హిజ్రా అని తెలుసుకొని నోళ్లెళ్లబెట్టారు. పోలీసులు వచ్చేలోపే సదరు హిజ్రా తప్పించుకొని అక్కడ్నుంచి ఉడాయించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement