బంజారాహిల్స్ : లిఫ్ట్ ఇచ్చిన వాహనదారుడిని ఓ యువకుడు కొట్టి బైక్‌తో ఉడాయించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దర్గాలో నివసించే సబ్బా శేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి 2.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12 నుంచి 13 వైపు మినిష్టర్ క్వార్టర్స్ రోడ్డులో తన బైక్ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఓ యువకుడు లిఫ్ట్ కావాలని అడిగాడు.
దీంతో శేఖర్‌రెడ్డి ఆ యువకుడికి లిఫ్ట్ ఇవ్వగా కొద్ది దూరం వెళ్లిన తర్వాత బైక్ ఆపించి శేఖర్ రెడ్డిపై దాడికి దిగాడు. తీవ్రంగా కొట్టాడు. అతన్ని కిందపడేసి బైక్‌తో ఉడాయించాడు. అదే రాత్రి తీవ్ర గాయాలతో శేఖర్ ఆస్పత్రిలో చేరాడు. గురువారం జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లిఫ్ట్ ఇచ్చిన పాపానికి..
Published Thu, Jun 9 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement
Advertisement