రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన హిజ్రాలు | man thrown out of running train by hijras in Andhra pradesh | Sakshi
Sakshi News home page

రైలు నుంచి ప్రయాణికుడిని తోసేసిన హిజ్రాలు

Published Tue, Sep 22 2015 1:37 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

man thrown out of running train by hijras in Andhra pradesh

మృతి చెందిన ఒడిశా వాసి
టెక్కలిరూరల్: డబ్బులివ్వలేదనే కారణంతో కదులుతున్న రైలు నుంచి హిజ్రాలు తోసేయడంతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ సమీపంలో సోమవారం జరిగింది. తోటి ప్రయాణికుల కథనం ప్రకారం.. కేరళ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న వివేకానంద ఎక్స్‌ప్రెస్ రైలులో ఒడిశాలోని నయాగఢ్ జిల్లా చడమోల్ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర సాహు, మరికొందరు వలస కార్మికులు భువనేశ్వర్‌కు వెళ్తున్నారు.

ఇదే రైలులో ప్రయాణిస్తున్న నలుగురు హిజ్రాలు డబ్బులు అడగ్గా.. వారు నిరాకరించడంతో గొడవ మొదలైంది.ఈ క్రమంలో పూర్ణచంద్ర సాహు(45)ను నౌపడ రైల్వేస్టేషన్ సమీపంలో హిజ్రాలు రైలు నుంచి తోసేశారు.  ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపి, వారు సాహు వద్దకు వెళ్లేసరికి.. అప్పటికే మృతి చెందాడు. హిజ్రాలు తప్పించుకుని పారిపోయారు. అయితే సాహు రైలులో తలుపు వద్ద కూర్చొని కిందకు పడిపోవడం వల్లే మృతి చెందాడని జీఆర్‌పీ సీఐ మురళీ వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement