బైక్ ఢీకొని వీఆర్‌ఏ దుర్మరణం
Published Sun, Sep 29 2013 3:34 AM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM
మంగపేట, న్యూస్‌లైన్ : ద్విచక్రవాహనం ఢీకొని ఓ వీఆర్‌ఏ మృతి చెందిన సంఘటన మండలంలోని రాజుపేటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కర్రి చిన్ని(42) గ్రామంలో కబ్జాకు గురైన చింతకుంట చెరువు శిఖం భూమిని సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు రావడంతో వారికి సహకరించేందు కు వెళ్లాడు. భోజనం చేసేందుకు ముగ్గురు అధికారులు రాజుపేటలోని ఓ హోటల్‌కు వెళ్లారు. తాను ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తానని అధికారులతో చెప్పిన చిన్ని సైకిల్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలో చుంచుపల్లి నుంచి ఎదురుగా ఓ వ్యక్తి బైక్‌పై వస్తూ అదుపుతప్పి చిన్ని సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడు కింద పడిపోవడంతో తలకు బలమైన దెబ్బతగిలి ముక్కు, చెవి నుంచి రక్తంకారి స్పృహ తప్పాడు. అక్కడే ఉన్న స్థానికులు 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు. చిన్ని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తాడ్వాయి సమీపంలో మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఐదుగురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మృతుడి కుటుంబానికి రెవెన్యూ
అధికారుల పరామర్శ
కర్రి చిన్ని కుటుంబాన్ని తహసీల్దార్ మాదాసి కనకరాజు, డిప్యూటి తహసీల్దార్ పుల్యాల రాజయ్య, ఎమ్మారై చందా నరేష్, ఏఆర్‌ఐ వెంకటేశ్వర్లు, వీఆర్వోలు బోడ జనార్దన్, జంగం శేఖర్, మురుకుంట్ల నర్సింహారావు తదితరులు పరామర్శించారు. దహన సం స్కారాల నిమిత్తం రూ.10 వేల నగదును భార్య ముత్తమ్మకు అందచేశారు.
Advertisement