లండన్: బ్రిటన్‌లో రోలర్ స్కేటింగ్ చేస్తున్న వ్యక్తి కింగ్ చార్లెస్ కారుని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్ర భయాందోళలనకు గురయ్యాడు. వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ సమీపంలో రాయల్ అశ్వికదళం వైపు రోలర్ స్కేట్‌లపై వేగంగా వెళ్తున్న వ్యక్తిని సుమారు ఎనిమిది మంది పోలీసులు అడ్డుకున్నారు.
వాస్తవానికి అతనికి ఎలాంటి దుర్దేశాలు లేవని అధికారుల నిర్థారించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ పోలీసులు మాట్లాడుతూ...రాత్రి 7 గంటల సమయంలో పోలీసు వాహనాలు పార్లమెంట్ స్క్వేర్‌లోకి ప్రవేశిస్తుండగా ఒక పాదచారి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు చార్లెస్ కార్‌ని దాదాపు ఢీ కొట్టాడని తెలిపారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని తప్పించుకోనివ్వకుండా...నేలపై పడుకోబెట్టి సంకెళ్లు వేశారు. ఆ తర్వాత విచారణలో పోలీసులు ఆ వ్యక్తి ఎలాంటి దురుద్దేశంతో ఈ ఘటనకు పాల్పడలేదని, అనుకోకుండా జరిగిందేనని ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Rollerblader evaded security and seemingly tried to collide into #KingCharles motorcade travelling to the vigil, shortly after 1930 on parliament square. Police intervened just in time. #QueenElizabeth #queueforthequeue @BBCNews @itvnews @SkyNews @Channel4News pic.twitter.com/P0rw2qqlRz
— Tom (@pt1408) September 16, 2022
(చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)
Comments
Please login to add a commentAdd a comment