roller skating
-
ఈ రోలర్‌తో నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతం!
ఈ ఫేస్ లిఫ్టింగ్ రోలర్. కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మం, మృదువైన పెదవులతో పాటు బుగ్గలు, మెడ చుట్టూ.. నుదుటి పైన.. చేతులు, కాళ్లు, తొడలు, నడుము ఇలా ప్రతి పార్ట్‌లోనూ ఈ రోలర్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కిన్ టోన్ – లిఫ్ట్ జెర్మేనియం కాంటౌరింగ్ మసాజ్ రోలర్‌కి కిందవైపు జెర్మేనియం మసాజ్ హెడ్ అటాచ్ అయ్యి ఉంటుంది. పైభాగంలో అమర్చుకోవడానికి.. 2 చిన్నచిన్న స్టోన్ మసాజర్లు, ఒక చిన్న జెర్మేనియం మసాజ్ హెడ్ అదనంగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి ఆ మూడింటిలో ఒకదాన్ని మార్చుకుంటూ, మసాజ్ చేసుకోవచ్చు. ఇది ముఖవర్చస్సును పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే వయసుతో వచ్చే వృద్ధాప్య ఛాయలను మాయం చేస్తుంది. ముడతలను ఇట్టే పోగొడుతుంది. ఇందులోని రెండు జెర్మేనియం మసాజ్ రోలర్స్ మీదున్న ఆక్యుప్రెషర్ ప్యాడ్స్.. శరీరకణజాలలను ఉత్తేజపరచేందుకు తేలికపాటి ఒత్తిడిని కలిగిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారుతుంది. ఆరోగ్యంగా నిగనిగలాడే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. దీనితో ఒక్కో భాగం వద్ద సుమారు 30 నుంచి 60 సెకన్స్ పాటు.. క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవచ్చు. సాధారణ మసాజ్ ప్రోసెస్‌ని ఫాలో అవుతూ.. కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వినియోగించిన అనంతరం నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే సరిపోతుంది. ఈ టూల్ చాలా కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర 21 డాలర్లు (1,742 రూపాయలు) ఉంటుంది. (చదవండి: నటి మల్లికా అరోరా ఇష్టపడే బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే..!) -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
చైనాలో కొనసాగుతున్న భారత్ పతకాల వేట.. చరిత్ర సృష్టించిన ముఖర్జీ సిస్టర్స్
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటి వరకు 13 స్వర్ణాలు, 21 వెండి, 21 కాంస్యాలు కైవసం చేసుకుంది. కాగా అత్యధికంగా ఆదివారం ఒక్కరోజే భారత క్రీడాకారులు 15 మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో 9, షూటింగ్లో 3, బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం సాధించారు. ఇక సోమవారం(అక్టోబరు 2) నాటి విశేషాలు తెలుసుకుందాం! ముఖర్జీ సిస్టర్స్‌కు కాంస్యం టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు బ్రాంజ్ మెడల్ లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సోమవారం నాటి మ్యాచ్‌లో గెలుపొంది ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు తొట్టతొలి పతకం అందించారు. తద్వారా ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓 🇮🇳's Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women's doubles event! 🙌💫 They've broken the barrier in style, getting India's… pic.twitter.com/FDVUgnD06p — SAI Media (@Media_SAI) October 2, 2023 రోలర్ స్కేటింగ్‌లో.. భారత స్కేటింగ్ రిలే టీమ్ కాంస్య పతకం సాధించింది. వుమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ.లో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. సమన్వయలోపానికి తావులేకుండా సమష్టిగా రాణించి 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. అబ్బాయిలు సైతం.. రోలర్ స్కేటింగ్‌లో అబ్బాయిలు కూడా అదరగొట్టారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000మీ. రిలే టీమ్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు. ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్ధాంత్, విక్రమ్ కలిసి భారత్‌కు మరో పతకం అందించారు. 🥉 BACK TO BACK BRONZE GLORY 🇮🇳 What a start to the day! ☀️ 🇮🇳's Aryan Pal, Anand Kumar, Siddhant, and Vikram have rolled their way to BRONZE in the Men's Speed Skating 3000m Relay, clocking an incredible time of 4:10.128! 🤩 🛼 Let's give them a roaring applause for their… pic.twitter.com/WkLDxvKvTS — SAI Media (@Media_SAI) October 2, 2023 -
తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా..
Special Olympics 2023: ‘‘కష్టాలురానీ కన్నీళ్లురానీ.. ఏమైనాగానీ ఎదురేదీరానీ.. ఓడీపోవద్దు రాజీపడొద్దు.. నిద్రే నీకొద్దు నింగే నీ హద్దు.. గెలుపు పొందె వరకు.. అలుపు లేదు మనకు’’.. కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నా సానుకూల దృక్పథం వీడొద్దని, సంకల్ప బలం ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదంటూ స్ఫూర్తిని రగిల్చాడో సినీకవి. నిరాశలో కూరుకుపోయిన వారిని తట్టిలేపి గమ్యం వైపు పరుగులు తీయమని చాటిచెప్పే ఈ పాటలోని ప్రతీ వాక్యం రిషితకు సరిగ్గా సరిపోతుంది. వైకల్యం కేవలం శరీరానికి మాత్రమే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపించిన ఈ బంగారు తల్లిది సంగారెడ్డి. అమ్మ కడుపులో ఉండగానే అమ్మ కడుపులో ఉండగానే కవల సోదరుడిని పోగొట్టుకుని.. డౌన్ సిండ్రోమ్ బారిన పడ్డ రిషితను కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లిదండ్రులు. గుండెకు రంధ్రంతో పాటు వైకల్యంతో జన్మించిన తమ చిన్నారిని చూసి జాలి పడ్డవారే.. శెభాష్ బిడ్డా అని అభినందించే స్థాయికి తీసుకువచ్చారు. అమ్మానాన్నలు తనకోసం పడుతున్న కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ వారితో పాటు దేశం మొత్తం గర్వపడేలా చేసింది రిషిత. బెర్లిన్‌లో జరిగిన స్పెషల్ ఒలంపిక్స్‌లో రజత పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అసాధారణ ప్రతిభతో రోలర్ స్కేటింగ్‌లో సత్తా చాటి మెడల్స్‌తో తిరిగి వచ్చింది. ఇబ్బందులు ఉన్నా బీహెచ్ఈఎల్కు చెందిన ప్రశాంత్‌రెడ్డి- మాధవి దంపతులు తమకు కవలలు పుట్టబోతున్నారన్న వైద్యుల మాట విని ఎంతగానో మురిసిపోయారు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా, బంగారు భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ విధిరాత మరోలా ఉంది. గర్భంలో ఉండగానే పిల్లాడు చనిపోయాడు.. ఆ ప్రభావం అతడి కవల సోదరి రిషితపై కూడా పడింది. డౌన్‌సిండ్రోమ్ బారిన పడిందామె. పైగా పుట్టిన తొమ్మిది నెలల తర్వాత రిషిత గుండెలో రంధ్రం ఉందన్న భయంకర నిజం తల్లిదండ్రులకు తెలిసింది. గుండె నిబ్బరంతో కడుపులో ఉండగానే ఓ బిడ్డను పోగొట్టుకుని.. భూమ్మీదకు వచ్చిన పాపాయి కూడా ఎంతకాలం బతుకుందో తెలియని పరిస్థితిలోనూ ప్రశాంత్‌రెడ్డి- మాధవి గుండె నిబ్బరం కోల్పోలేదు. తాము ఊపిరి పోసిన ప్రాణాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వెనుకడుగు వేయలేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి.. వారి సాయంతో పాపకు చికిత్స చేయించారు. అందరిలా కాకుండా మరింత ప్రత్యేకంగా ఉన్న తమ బుజ్జాయిని స్పెషల్ కేర్ స్కూళ్లో చేర్పించారు. ఆత్మవిశ్వాసం సడలనివ్వకుండా అక్కడే రిషిత జీవితం మలుపు తిరిగింది. ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను ట్రైనర్ గుర్తించాడు. దీంతో రోలర్ స్కేటింగ్‌లో ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. అంతేకాదు రిషితలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా వివిధ నగరాల్లో జరిగిన పోటీలకు సైతం తీసుకువెళ్లేవారు. అలా ఒక్కో అడుగు వేస్తూ రిషిత స్పెషల్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె టాలెంట్‌ను గుర్తించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మద్దతుగా నిలిచింది. తల్లిదండ్రులు, కోచ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిషిత అంచెలంచెలుగా ఎదిగింది. తప్పకుండా ఒలంపిక్స్‌లో మెడల్ సాధిస్తుందన్న వారి నమ్మకాన్ని నిలబెడుతూ స్పెషల్ ఒలంపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించింది. నిజంగా స్ఫూర్తిదాయకం చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలకే విడిపోయే దంపతులు ఉన్న ఈ సమాజంలో సంతానం విషయంలో ఎంతటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడ్డ ప్రశాంత్‌రెడ్డి- మాధవి నిజంగా ఈతరం జంటలకు ఆదర్శనీయం. పదహారేళ్లుగా బిడ్డను పసిపాపలా సాకుతూ ఆమెను ఈ స్థాయికి చేర్చిన వారిద్దరికీ హ్యాట్సాఫ్! అదే విధంగా.. వైకల్యాన్ని జయించి తల్లిదండ్రులను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రిషితకు అభినందనలు!! 190 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల నుంచి పోటీని తట్టుకుని గెలుపొందిన ఆమెకు జేజేలు!! ప్రభుత్వం రిషిత లాంటి స్పెషల్ కిడ్స్‌కు చిన్నప్పటి నుంచే అండగా నిలిస్తే అమ్మానాన్నలతో పాటు ఆ పిల్లలకు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని రిషిత తల్లిదండ్రులు అంటున్నారు. నిజమే కదా!! ఏమిటీ స్పెషల్ ఒలంపిక్స్? శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా 1968లో స్పెషల్ ఒలంపిక్స్ ఆరంభించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు 32 క్రీడా విభాగాల్లో పోటీపడతారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, పవర్‌లిఫ్టింగ్, రోలర్‌స్కేటింగ్, స్విమ్మింగ్ ఇలా వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు. -సుష్మారెడ్డి యాళ్ల చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
పెళ్లికూతురు గారి రోలర్ స్కేట్స్ డ్యాన్స్
‘పెళ్లి కూతురు డ్యాన్స్’ అనేది మనకు కొత్తేమీ కాదు. అయితే అస్సాంకు చెందిన అమ్రిన్ ఖురానా ఒక అడుగు ముందుకు వేసి రోలర్ స్కేట్స్ ధరించి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘బార్ బార్ దేఖో’ సినిమా లోని ‘ఆస్మాన్’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజనులు ఫిదా అయ్యారు. ‘ఆల్ ఎబౌట్ డ్యాన్స్’ అనే డ్యాన్స్ స్కూల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్‌లోనే 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మైండ్ బ్లోయింగ్’ ‘ఎనర్జీ ప్యాక్డ్ డ్యాన్స్’ ‘బ్రైడ్ ఆన్ వీల్స్’... ఇలాంటి కామెంట్స్ మాట ఎలా ఉన్నా ‘పెళ్లి సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు!’ అని మందలించిన వారు కూడా ఉన్నారు. -
కింగ్ చార్లెస్ కారుని ఢీ కొట్టబోయాడు..! వీడియో వైరల్
లండన్: బ్రిటన్‌లో రోలర్ స్కేటింగ్ చేస్తున్న వ్యక్తి కింగ్ చార్లెస్ కారుని ప్రమాదవశాత్తు ఢీ కొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్ర భయాందోళలనకు గురయ్యాడు. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న రాణి శవపేటిక వద్దకు చార్లెస్ వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్ సమీపంలో రాయల్ అశ్వికదళం వైపు రోలర్ స్కేట్లపై వేగంగా వెళ్తున్న వ్యక్తిని సుమారు ఎనిమిది మంది పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి అతనికి ఎలాంటి దుర్దేశాలు లేవని అధికారుల నిర్థారించారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ పోలీసులు మాట్లాడుతూ...రాత్రి 7 గంటల సమయంలో పోలీసు వాహనాలు పార్లమెంట్ స్క్వేర్లోకి ప్రవేశిస్తుండగా ఒక పాదచారి రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలోనే సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు చార్లెస్ కార్ని దాదాపు ఢీ కొట్టాడని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని తప్పించుకోనివ్వకుండా...నేలపై పడుకోబెట్టి సంకెళ్లు వేశారు. ఆ తర్వాత విచారణలో పోలీసులు ఆ వ్యక్తి ఎలాంటి దురుద్దేశంతో ఈ ఘటనకు పాల్పడలేదని, అనుకోకుండా జరిగిందేనని ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Rollerblader evaded security and seemingly tried to collide into #KingCharles motorcade travelling to the vigil, shortly after 1930 on parliament square. Police intervened just in time. #QueenElizabeth #queueforthequeue @BBCNews @itvnews @SkyNews @Channel4News pic.twitter.com/P0rw2qqlRz — Tom (@pt1408) September 16, 2022 (చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
సబ్ జూనియర్ రోలర్ హాకీ టోర్నీలో రన్నరప్‌గా తెలంగాణ
మొహాలి: జాతీయ సబ్ జూనియర్ రోలర్ హాకీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచింది. పంజాబ్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో తెలంగాణ బాలికల జట్టు 1–2 గోల్స్ తేడాతో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. మనాల్ సుల్తానా, నిదా ఖాన్, తనుశ్రీ, అక్షిత, హజ్రా, తర్పణ, హరిణి, మెహక్, అఫీరా, శరణ్య, రిషిక తెలంగాణ జట్టులో సభ్యులుగా ఉన్నారు. -
వీడు ‘గోల్డ్’ ఎహే...
సాక్షి, అమలాపురం టౌన్: రోలర్ స్కేటింగ్‌లో ఆ చిన్నారి చిచ్చర పిడుగే.. కాళ్లకు స్కేటింగ్ షూ కట్టుకుని బరిలోకి దిగాడంటే పతకాలూ పరుగులు పెట్టాల్సిందే. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఏడు స్వర్ణ పతకాలు సాధించి అందరితో ఔరా! అనిపించుకున్నాడు. అమలాపురం పట్టణం సూర్యనారాయణపేటకు చెందిన కోటుం కుమార్చందుశ్రీధర్ రోలర్ స్పీడ్ స్కేటింగ్‌లో చిరు ప్రాయం నుంచి రాణిస్తున్నాడు. ఇప్పటికే జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఏడు స్వర్ణ పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలను సాధించాడు. అమలాపురం ఆర్అండ్బీ డివిజన్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న కోటుం నరసింహమూర్తి కుమారుడు శ్రీధర్. తండ్రితో పాటు తల్లి మీనాకుమారి, చెల్లి జాస్మిన్ల ప్రోత్సాహంతో శ్రీధర్ స్కేటింగ్‌లో చెలరేగిపోతున్నాడు. తండ్రి నరసింహమూర్తి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తన కుమారుడి అభిరుచికి అనుగుణంగా స్పీడ్ స్కేటింగ్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో ఉన్న స్కేటింగ్ రింగ్‌లోనే తన ప్రతిభకు పదును పెట్టాడు. ఆ స్టేడియం సీనియర్ కోచ్, నేషనల్ ప్లేయర్ కెల్లా రాము తర్ఫీదులో మూడేళ్లుగా రోలింగ్ స్కేటింగ్‌లో పూర్తి మెళకువలు నేర్చుకున్నాడు. పలు పతకాలు కైవసం ఐదో ఏట నుంచే కాళ్లకు రోలర్ స్కేట్స్ కట్టుకుని రింగ్‌లోకి అడుగుపెట్టాడు. మూడేళ్లలో వైజాగ్, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలలో జరిగిన రాష్ట్ర, జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఈనెల 4వ తేదీ నుంచి ఏడో తేదీ వరకూ కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ 2కే19 పోటీల్లో అండర్ 7–9 కేటగిరీలో పాల్గొని రోడ్ స్కేటింగ్ షో, రింగ్‌లో షార్ట్ రేసు, లాంగ్ రేస్ ఈ మూడు కేటగిరీల్లో మొదటి స్థానాల్లో నిలిచి మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు. గతంలో భీమవరం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, వైజాగ్ల్లో జరిగిన పోటీల్లో శ్రీధర్ నాలుగు స్వర్ణ పతకాలు సాధించాడు. శ్రీధర్ అండర్–5 కేటగిరీ నుంచి మొదలు పెట్టిన తన పతకాల ప్రస్థానం అండర్–9 వరకు వరుస విజయాలతో సాగుతోంది. డిసెంబర్లో వైజాగ్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలకు తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీధర్ స్పష్టం చేస్తున్నాడు. ఒకే పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీధర్‌ను మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురంలో ఇటీవల ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. జాతీయ విజేతను చేయడమే నా లక్ష్యం శ్రీధర్ రోలింగ్ స్కేటింగ్‌కు సంబంధించి క్వార్డ్ స్కేటింగ్‌లో స్పీడ్ స్కేటింగ్ చేయడంలో దిట్ట. ఇప్పటికే పలు స్వర్ణ పతకాలు సాధించిన శ్రీధర్‌ను జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో విజేతను చేసి స్వర్ణ పతాకం సాధించేలా చేయడమే నా లక్ష్యం. – కెల్లా రాము, స్కేటింగ్ సీనియర్ కోచ్, బాలయోగి స్టేడియం, అమలాపురం -
ఫల్గుణికి రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కైరవి ఫల్గుణి ఠక్కర్ ఆకట్టుకుంది. చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో ఆమె రజత పతకాన్ని సాధించింది. 16 ఏళ్ల పైబడిన బాలికల ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ ఈవెంట్లో ఫల్గుణి రన్నరప్‌గా నిలిచింది. ఈ విభాగంలో తమిళనాడుకు చెందిన ప్రణమ్య రావు, వసస్య వరుసగా పసిడి, కాంస్యాలు సాధించింది. -
యశ్వంత్, కీర్తనలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో యశ్వంత్, కీర్తన పసిడి పతకాలతో మెరిశారు.రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఆర్ఆర్ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ రోలర్ స్కేటింగ్ ట్రాక్‌పై శనివారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో కె. యశ్వంత్ పసిడి పతకాన్ని దక్కించుకోగా... బి. రోహిత్, జాన్ సత్య వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలికల విభాగంలో బి. కీర్తన, కోమిలక తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్-14 బాలుర విభాగంలో పి. శివరామ్ అగ్రస్థానంలో నిలవగా... కె. జతిన్, అనిరుధ్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల విభాగంలో చరితాదేవి, సుశ్రుత, విధి వరుసగా తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు.