
‘పెళ్లి కూతురు డ్యాన్స్’ అనేది మనకు కొత్తేమీ కాదు. అయితే అస్సాంకు చెందిన అమ్రిన్ ఖురానా ఒక అడుగు ముందుకు వేసి రోలర్ స్కేట్స్ ధరించి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘బార్ బార్ దేఖో’ సినిమా లోని ‘ఆస్మాన్’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజనులు ఫిదా అయ్యారు.
‘ఆల్ ఎబౌట్ డ్యాన్స్’ అనే డ్యాన్స్ స్కూల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్‌లోనే 1.7 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘మైండ్ బ్లోయింగ్’ ‘ఎనర్జీ ప్యాక్‌డ్ డ్యాన్స్’ ‘బ్రైడ్ ఆన్ వీల్స్’... ఇలాంటి కామెంట్స్ మాట ఎలా ఉన్నా ‘పెళ్లి సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు!’ అని మందలించిన వారు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment