ప్రాణం తీసిన వివాహేతర సంబంధం | Husband kills wife's paramour in West Godavari district | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Published Mon, Oct 21 2013 10:17 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - Sakshi

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

చిట్యాల (గోపాలపురం), : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన భర్త అనంతరం పోలీసులకు లొంగిపోయూడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన కలిదిండి పాటియ్యతో  13 ఏళ్ల క్రితం వివాహమైంది. పాటియ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

అదే గ్రామానికి చెందిన పాటియ్య స్నేహితుడు, ఆటో డ్రై వర్ ఈడుగుబంటి శ్రీను(31) మూ డేళ్లుగా జ్యోతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అనుమానం వచ్చిన పాటియ్య భార్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. అయితే 20 రోజుల క్రితం చిట్యాలలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన పాటియ్య అక్కడే ఉంటున్నాడు.

శనివారం రాత్రి 11 గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా బయటకు వచ్చిన జ్యోతి ప్రియుడు శ్రీనుతో కలిసి ఆటోలో ఊరి బయటకు వెళ్లడాన్ని పాటియ్య గమనించాడు. ఊరి బయట భార్య, శ్రీను కలిసి ఉండటాన్ని చూసిన అతను తనతో తీసుకువచ్చిన ఇనుప రాడ్‌తో శ్రీను తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. జ్యోతి పారిపోవడంతో కొనఊపిరితో ఉన్న శ్రీనును ఆటోలో వేసుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చాడు.

డాక్టర్లు పరీక్షించి అప్పటికే శ్రీను మతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పాటియ్య పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు పాటియ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా పథకం ప్రకారం తన భర్తను హత్యచేసినట్లు మృతుని భార్య ఆరోపిస్తోంది. జ్యోతి, ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చే స్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రాఘవ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement