Illegal relationship
-
ఫోన్ చేస్తే బిజీ వస్తోంది.. నీకు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం వుంది..
యశవంతపుర: వివాహిత అనుమానాస్పద మృతికేసు మిస్టరీ వీడింది. ఆమెను తానే హత్య చేసినట్లు ప్రియుడు మద్యం మత్తులో నిజాన్ని కక్కేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హరపనహళ్లి తాలూకా నిట్టూరుకు చెందిన వ్యక్తితో దావణగెరె తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన కవితకు వివాహమైంది. హరహరకు వెళ్లివస్తానంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఇంటినుంచి వెళ్లిన కవిత తిరిగి రాలేదు.పుట్టింటివారిని విచారించగా రాలేదని చెప్పారు. దీంతో హలవాగలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఒక పొలంలో మృతదేహం కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ప్రియుని సొంతూరుకు వెళ్లి.. ఇంటినుంచి వెళ్లిన కవిత తన ప్రియుడు సలీం మున్నాఖాన్తో కలిసి అతని సొంతూరు తెలగికి వెళ్లింది. అక్కడ నుంచి ఇద్దరూ కలిసి బైకులో కుంచూరి చెరువు వద్దకు వెళ్లారు. ఫోన్ చేస్తే బిజీ వస్తోంది.. నీవు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం పెట్టుకున్నవంటూ సలీం కవితను నిందించాడు. ఓ దశలో గొంతు పిసికి ఆమెను హత్య చేశాడు. అనంతరం పొలంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఇటీవల తాగిన మత్తులో ఉన్న సలీం.. కవితను తానే చంపానని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడున్నవారు కవిత కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సలీంను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని..
కౌడిపల్లి(నర్సాపూర్): మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యక్తి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. పోలీసులు మూడురోజులలోనే మిస్టరీని ఛేదించారు. కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి మంగళవారం నర్సాపూర్ సీఐ షేక్ లాల్మదార్, ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కౌడిపల్లి మండలం పీర్లతండా పంచాయతీ కొయ్యగుండ తండాకు చెందిన కాట్రోత్ శ్రీను (28) భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను ఈనెల 18న రాత్రి పొలానికి వెళ్తున్నాని భార్యకు చెప్పి వెళ్లి ఉదయం శవమై కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. స్నేహితురాలు, మరో వ్యక్తి సాయం.. మృతుడి భార్య దేవికి తండాలో పలువురితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో పలుమార్లు భార్యాభర్తలకు గొడవలు జరిగాయి. దీంతో దేవి తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. తండాకు చెందిన ఆమె స్నేహితురాలు రాణి (ఆలియాస్ నవీన)తో కలిసి పథకం వేసింది. దీని కోసం కొడుకు వరుసయ్యే పవన్‌కుమార్‌ను సాయం తీసుకుంది. సహకరిస్తే రైతుబీమా డబ్బులు రాగానే రూ.50 వేలు ఇస్తానని ఆశపెట్టింది. చెట్టుకు ఉరేసి... ఈనెల 18వ తేదీ ఉదయం దేవి, శ్రీను తమ ఇంటి వద్ద జామ చెట్టు విషయంలో పాలివారు కాట్రోత్ ధన్సింగ్, అతడి కుమార్‌లు సంతోష్, తులసీరాం గొడవ పడ్డారు. ఇదే అదునుగా భావించిన దేవి అదే రోజు రాత్రి పవన్‌కుమార్‌కు మద్యం ఇప్పించి శ్రీనుకు తాగించాలని చెప్పింది. ఇద్దరూ కలిసి పొలంలో మద్యం తాగారు. రాత్రి దేవి అక్కడికి చేరుకొని మత్తులో ఉన్న శ్రీనును వేప చెట్టుకు ఉరివేశారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పొలంలో పడేశారు. భర్త చనిపోయాడని పాలివారే చంపేశారని దేవి ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి కాల్‌డేటా చెక్ చేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, చంపేస్తే రైతుబీమా, ఎల్ఐసీ డబ్బులు వస్తాయన్న ఆశతో హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు శాంతి, శోభారాణి, భాగయ్య, శ్రీనివాసులు, పోచయ్యను డీఎస్పీ అభినందించి నగదు రివార్డ్ అందజేశారు. -
బావతో వివాహేతర సంబంధం.. దుబాయ్ నుంచి భర్త రావడంతో..
కరీంనగర్: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్(30)ను అతని భార్యే తన ప్రియుడితో కలిసి చంపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాశ్, మల్యాల సీఐ డి.రమణమూర్తి, ఎస్సై కె.వెంకట్రావ్ వెల్లడించారు. దేశాయిపేటకు చెందిన వేముల ప్రమీలకు కొడిమ్యాలవాసి బత్తుల శ్రీనుతో పదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. ఉపాధి నిమిత్తం శ్రీను కొన్నేళ్లు దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో తనకు బావ వరుస అయిన దేశాయిపేటకు చెందిన సూర రాజేశ్‌తో ప్రమీల అక్రమ సంబంధం పెట్టుకుంది. శ్రీను దుబాయ్ నుంచి వచ్చాక కూడా దీన్ని కొనసాగించింది. ప్రమీల తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయమై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. శ్రీను మద్యానికి బానిసయ్యాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని హత్య చేయాలని ప్రమీల, రాజేశ్‌తోపాటు ప్రమీల తల్లిదండ్రులు రాజవ్వ, రాజనర్సు పథకం వేశారు. దీర్ఘకాలిక వ్యాధికి రాజవ్వ వాడుతున్న ట్యాబ్లెట్లను ప్రమీల పొడిగా చేసింది. ఈ నెల 11న శ్రీను తాగే మద్యంలో కలిపింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతన్ని ప్రమీల, రాజేశ్‌లు టవల్‌తో గొంతు బిగించి, చంపారు. అనంతరం మృతదేహా న్ని చీరతో దూలానికి ఉరివేసి, పారిపోయారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శ్రీనును చంపింది అతని భార్య, ఆమె ప్రియుడు, తల్లిదండ్రులేనని తేల్చారు. ఆదివారం ఆ నలుగురిని అ రెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన టవల్, ట్యాబ్లెట్ షీట్లతోపాటు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.కమలాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆమెకు ఇష్టం లేకపోయినా 2019 మే 15 తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే సూర్యనారాయణను హతమార్చేందుకు భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు రాధాకృష్ణ పథకం వేశారు. ఇందులో భాగంగా 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడి నుంచి పాతర్లగడ్డ మార్గంలోని çపంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ సూర్యనారాయణను కూర్చోబెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి హత్య చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు అప్పటి కరప ఎస్సై జి.అప్పలరాజు ఈ హత్యపై కేసు నమోదు చేశారు. నాటి కాకినాడ రూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఈ కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది. దీంతో హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా, సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్‌రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్‌కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్‌పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్‌తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్‌ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్‌రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడెం పరిధిలో జంట హత్యల కేసులో మరో విషయం వెలుగు చూసింది. జ్యోతి-యశ్వంత్‌ల వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలిసిందే. భార్య ప్రియుడైన యశ్వంత్‌తో పాటు భార్యను కూడా చంపాలనే తీవ్రంగా యత్నించినట్లు జ్యోతి భర్త శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సుపారీ గ్యాంగ్‌ను సంప్రదించి యశ్వంత్ తో పాటు ఆమె ప్రియుడ్ని చంపించాడు భర్త శ్రీనివాస్. భార్య కళ్ల ముందే యశ్వంత్‌ను దారుణంగా హతమార్చిన భర్త.. అక్కడితో ఆగలేదు. తనను చంపొద్దని బతిమాలినా భార్య జ్యోతిని సైతం వదలకుండా హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆపై శవాలను అక్కడే పడేసి సుపారీ గ్యాంగ్‌తో పాటు వెళ్లిపోయాడు. ఈ కేసుకు సంబంధించి.. శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా ఇద్దరినీ హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వార్త: యశ్వంత్-జ్యోతి వివాహేతర సంబంధం భరించలేక.. -
అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు: భర్త శ్రీనివాసే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించగా.. ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఊహించినట్లుగానే వివాహేతర సంబంధం ఈ హత్యకు ప్రధాన కారణంగా తేలింది. జ్యోతి భర్త శ్రీనివాసరావే నిందితుడిగా గుర్తించారు. జ్యోతితో యశ్వంత్‌కు గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉండడంతో.. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌తో పాటు ఈ హత్యలో అతనికి నలుగురు సహకరించినట్లు సమాచారం. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వీళ్ల మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. యశ్వంత్ తలపై బలమైన గాయం కాగా, జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తులు ఉన్నాయి. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఆ దిశగానే క్లూస్ లభించడం విశేషం. ఇదిలా ఉంటే.. హత్యకు గురైన మహిళతో యశ్వంత్‌కు పరిచయం ఉన్న విషయం తెలియదని యశ్వంత్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంబంధిత వార్త: హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు! -
పక్కింటి యువకుడితో భార్య చనువుగా ఉంటుందని..
ప్రకాశం (దర్శి టౌన్) : భార్యతో చనువుగా ఉంటున్న పక్కింటి యువకుడిని భర్త పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణంగా హత్య చేశారని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. దర్శి మండలం వెంకటాచలంపల్లి పంచాయితీ పరధిలోని నడిమిపల్లెలో ఈనెల 7న జరిగిన యువకుని హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం దర్శి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వెల్లడించారు. వివరాలు.. నడిమిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన బోనం బాలచెన్నయ్య భార్య శివకుమారితో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం బాలచెన్నయ్యకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలంటూ సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు. ఈ నెల 6వ తేదీ రాత్రి శివకుమారి, సత్యనారాయణ చనువుగా ఉండటాన్ని గమనించిన బాలచెన్నయ్య కోపోద్రిక్తుడయ్యాడు. సత్యనారాయణకు అడ్డుతొలగిస్తే తప్ప తన సంసారం బాగుపడదని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని తన బంధువుల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన చెందాడు. ఈనెల 7వ తేదీన సత్యనారాయణ తన కనకాంబరాల తోటకు వెళ్లి వస్తుండగా బాల చెన్నయ్య, అతని బంధువులు కలిసి కత్తి, గడ్డపార, బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణను బంధువులు గమనించి వైద్యశాలకు తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. హతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రÔóఖర్ కేసు నమోదు చేసి సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు బోనం బాలచెన్నయ్యతోపాటు అతనికి సహకరించిన బోనం చిన వీరయ్య, బోనం శివకుమారి, బోనం వెంకట లక్ష్మి, బోనం అంకమ్మ, పుప్పాల అంకమ్మ, పుప్పాల వెంకటేశ్వర్లు, పార్శపు హనుమంతును బుధవారం దర్శి సీఐ అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారు.. కారణం అదే!
సత్తెనపల్లి: హత్య కేసును సత్తెనపల్లి పోలీసులు ఛేదించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన యల్లంపల్లి చాంద్‌బాషా ట్రావెల్స్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత ఏడాది భార్య, బిడ్డలను వదిలేసి సత్తెనపల్లిలో ఉంటూ తాపీ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు మేస్త్రీ బజారులో నివసిస్తున్న పైర్థల నాగమల్లేశ్వరితో సహజీవనం చేస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సహజీవనం చేస్తున్న చాంద్‌బాషాను అడ్డు తొలగించుకోవాలని నాగమల్లేశ్వరి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నాగమల్లేశ్వరితో పాటు రెంటచింతల గ్రామం దొమ్మరకాలనీకి చెందిన అన్నపురెడ్డి అమరయ్య అలియాస్ అమర్, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన తన్నీరు సుబ్బారావు ముగ్గురు కలిసి మద్యం సేవిద్దామని చాంద్‌బాషాను నమ్మించి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో స్టేడియంలోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి చాంద్‌బాషాను గొంతునొక్కి, గుండెలపై, వీపుపై గుద్ది హతమార్చారు. ఈ నెల 4న చాంద్‌బాషా మృతదేహాన్ని స్థానికులు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చాంద్‌బాషాను హత్య చేసినట్లు గ్రహించిన పోలీసులు సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి పర్యవేక్షణలో పట్టణ సీఐ యు.శోభన్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. నాగమల్లేశ్వరి పథకం ప్రకారం మరో ఇద్దరితో కలిసి హతమార్చినట్లుగా తేలడంతో ముగ్గురి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోవడం, మిగిలిన ఇద్దరు కూడా కనిపించకపోవడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 7న నాగమల్లేశ్వరి, అమరయ్యను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శోభన్ బాబు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ హత్య కేసు ఛేదించడంలో సహకరించిన ఎస్ఐ రఘుపతిరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.గంగాధరరావు, కె.రామారావు, కానిస్టేబుళ్లను డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, సీఐ శోభన్‌బాబు అభినందించారు. చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి..
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వివాహితతో పాటు యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజుల పాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె మరిది పరారయ్యాడు. కౌలంద పోలీసుల వివరాల మేరకు... నంజనగూడు తాలూకాకు చెందిన వివాహితకు కూలి పనులకు వెళ్తున్న సమయంలో విష్ణు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని.. మూడు రోజుల క్రితం విష్ణు యథావిధిగా వివాహిత ఇంటికి వచ్చాడు. అతను ఇంటిలోకి వెళ్లగానే బయటి నుంచి భర్త తలుపులు బిగించి గ్రామస్తులను పిలిచి వారిని బయటకు తీసుకువచ్చి కరెంట్ స్తంభానికి కట్టేశారు. మూడు రోజుల పాటు ఆహారం, నీరు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశాడు. కొందరు యువకులు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. పోలీసులు వచ్చి స్పృహ తప్పిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. -
రెండు కుటుంబాల్లో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): అక్రమ సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులకు దారి తీసింది. ఇందులో ఓ కుటుంబానికి చెందిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే.. ఆ రెండు కుటుంబాల్లోని భార్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమలాపురం పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన పలచోళ్ల సూర్య కొండలరావు, సంధ్యాకుమారి భార్యభర్తలు. సూర్య కొండలరావు ఎస్.యానంలోని చమురు సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి) వీరి కుటుంబం అమలాపురం రవణం మల్లయ్యవీధిలో కాపురం ఉంటోంది. ఇదే ప్రాంతంలో చెందిన గండు సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. తర్వాత భార్యభర్తలు సూర్యకొండలరావు, సంధ్యా కుమారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అక్రమ సంబంధం తెచ్చిన చిచ్చుతో మనస్తాపం చెందిన సుబ్బారావు భార్య నాగలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తర్వాత సూర్య కొండలరావు, సంధ్యాకుమారి దంపతులు సోమవారం సాయంత్రం అల్లవరం మండలం బోడసకుర్రు వంతెన వద్ద పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తక్షణమే స్థానికులు స్పందించి ఆ భార్యాభర్తలను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ భర్త సూర్య కొండలరావు బుధవారం ఉదయం మృతి చెందినట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. అతడి భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగానే ఉంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగలక్ష్మి కూడా అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సూర్యకొండలరావు ఆత్మహత్యకు, అతడి భార్య ఆత్యహత్యాయత్నానికి కారణమైన సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులతోపాటు రవణం సాయమ్మ అనే మహిళపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
భర్తను చంపడానికి ప్రియునితో కలిసి స్కెచ్
శిడ్లఘట్ట: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అడ్డుగా ఉన్న భర్తను సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన ఘటనలో శిడ్లఘట్ట పట్టణ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పట్టణంలో నివాసం ఉంటున్న మేస్త్రి గోవిందప్ప, ఆయన భార్య సుమిత్ర భార్య భర్తలు. ఇదిలా ఉంటే ఈనెల 18న తెల్లవారుజామున గోవిందప్ప మారుతి నగర్లో ఇంటి ముందు నుంచి వెళ్తున్న సమయంలో అతడిని తుపాకీతో కాల్చారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సుమిత్రకు మునికృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సుమిత్రతో పాటు ఆమె ప్రియుడు మునికృష్ణ, అదే గ్రామానికి చెందిన రామకృష్ణ, ప్రవీణ్, హరీశ్, చిన్నయను అరెస్ట్ చేశారు. -
యువకుడిని కొట్టి చంపిన ఏఆర్ కానిస్టేబుల్
ఆటోనగర్(విజయవాడతూర్పు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ మరో వ్యక్తితో కలిసి.. ఓ యువకుడిని కొట్టి చంపాడు. బుధవారం తెల్లవారుజామున విజయవాడ అయ్యప్పనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ముక్కు వెంకటేష్(23), ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు అయ్యప్పనగర్‌లో ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నారు. వెంకటేష్‌కు వివాహం కాలేదు. డిస్టెన్స్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. తన భార్య, వెంకటేష్ కలివిడిగా ఉండటాన్ని నాగరాజు గమనించి ఇద్దరినీ పలుమార్లు హెచ్చరించాడు. బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఇంటి యజమాని రత్నసాయి చూశాడు. డ్యూటీలో ఉన్న నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన నాగరాజు, రత్నసాయి కలిసి వెంకటేష్‌పై రాడ్లతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న వెంకటేష్‌ను స్థానికులు 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. నాగరాజుతో పాటు, రత్నసాయి, ఆయన భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
పచ్చని కాపురంలో ‘అతడు’ రేపిన చిచ్చు
మామిడికుదురు: ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి నలుగురి ఆత్మహత్యకు కారణమైంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా ఆ దంపతులను సామూహిక ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది. చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో దూకినట్టుగా భావించిన నలుగురిలో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో మొగలికుదురుకు చెందిన కంచి సతీశ్ (32)తో పాటు అతని కుమార్తె ఇందు శ్రీదుర్గ (2) మృతదేహాలను వశిష్ట నదిలో గుర్తించారు. సతీశ్ భార్య సంధ్య (22)తో పాటు వారి కుమారుడు జస్వన్ (4) మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మొగలికుదురులో తాపీ పని చేసుకుంటూ జీవించే సతీష్ మరికాస్త సంపాదించుకొని తమ బతుకురాత మార్చుకోవాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో మెరుగైన ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య సంధ్యకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడటం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ అయ్యింది. కుల పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు పిల్లలు జస్వన్, శ్రీదుర్గలను మొగలికుదురులోనే ఉంచి, సంధ్యను ఆమె పుట్టిల్లయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు పంపించినట్టు చెబుతున్నారు. విషయం తెలిసి మనస్తాపం చెందిన సతీష్ పది రోజుల కిందట సౌదీ నుంచి స్వగ్రామం వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని కుటుంబ పెద్దలు ఓదార్చారు. పిల్లలతో సహా కేశవదాసుపాలెంలోని అక్క ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ విషయంపై తన భార్య సంధ్యను కలిసి మాట్లాడాలని సతీశ్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం వెలివలలోని పినమామ ఇంటి వద్ద ఆమె ఉంటోందని తెలుసుకుని.. కేశవదాసుపాలెం నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైకి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న సూసైడ్ నోట్‌ను, పిల్లల దుస్తులను, బైక్‌ను వంతెనపై వదిలేసి, గోదావరిలో దూకేశారని భావిస్తున్నారు. కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలు అవమానకరంగా ఉండటం, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే సతీశ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అతడి తండ్రి భగవాన్‌దాసు, తల్లి లక్ష్మి, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి ప్లాన్; భర్తకు కాఫీలో విషం
మైసూరు: భర్తను చంపిన కేసులో భార్యను, ఆమె ప్రియున్ని మైసూరులో బన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు హత్యకు గురి కాగా, అతని భార్య ఉమా, ప్రియుడు అవినాశ్ పట్టుబడినవారు. వెంకటరాజు దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమెకు అవినాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అడ్డు తొలగించుకోవాలని ఇటీవల భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చారు, అతడు స్పృహ తప్పిన సమయంలో తలదిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకు భార్యను రాడ్డుతో దారుణంగా..
పాట్నా: బీహార్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్నందుకు భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడో భర్త. బీహార్‌లోని నలంద జిల్లాలో లాహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌చంద్రపురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ ధీరేంద్ర కుమార్‌తో సుమన్‌కు గత ఏడాది వివాహం జరిగింది. అయితే కుమార్ రూ.15 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా భార్య సుమన్‌ను బలవంతం చేశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కుమార్‌పై భార్య వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి క్రమం తప్పకుండా ఆమెను తీసుకురావడంతో భార్య అడ్డుచెప్పింది. అంతే ఇదే అదునుగా భావించిన నిందితుడు భార్యపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సుమన్ అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! ‘ఎక్స్టార్షన్’ గ్యాంగ్.. బ్లాక్మెయిల్ చేసి రూ. 89 లక్షలు -
వివాహేతర సంబంధం: పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం సికింద్రపూర్ గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ముర్ మృతులను ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన చిత్తరి సాయి కుమార్(30), శైలజ(28) లుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు, శైలజ భర్త కొంతకాలం క్రితం మృతి చెందినట్లు సమాచారం. చదవండి: నవ వరుడి విషాదాంతం -
బిడ్డను బావిలో తోసి హత్య.. తల్లికి యావజ్జీవం
తిరువొత్తియూరు: సేలం సమీపంలో వివాహేతర సంబంధం కోసం కుమారుడిని హత్య చేసి అదృశ్యం అయ్యాడని నాటకమాడిన మహిళకు గురువారం సేలం మహిళా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సేలం సమీపంలోని అటయాపట్టి ఎస్.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్ (07), అఖిల్ (03). రెండవ కుమారుడు అఖిల్‌ను మైనావతి తన తల్లి ఇంటిలో విడిచిపెట్టింది. ఈ క్రమంలో గత 2018వ సంవత్సరం మార్చి 5వ తేదీ ఆడుకోవడానికి వెళ్లిన శశికుమార్ కనపడలేదని మైనావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆటయాంపట్టి సమీపంలో వున్న వ్యవసాయ బావిలో శశికుమార్ మృతి చెంది నీటిలో తేలుతూ వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేయగా మైనావతి వివాహేతర సంబంధం కోసం తన తనయుడిని బావిలోకి తోసి హత్య చేసి నాటకమాడినట్లు తెలిసింది. మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేసి అతనితో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి మైనావతిని, దేవరాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించి అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది. చదవండి: వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం -
వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం
టోక్యో: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నందుకు గాను ఆమె భర్తకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఓ మహిళను ఆదేశించింది. ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ వ్యక్తి(39) సదరు మహిల తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నదని.. ఇందుకు గాను ఆమె వద్ద నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా టోక్యో కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు, సదరు మహిళకు ఆన్లైన్ ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరద్దరు ఏకాంతంగా కలుసుకున్నారని.. ఆ సమయంలో శృంగారంలో పాల్గొన్నారని ఆరోపించాడు. అతడి వాదనలు విన్న కోర్టు ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు జరిమానా విధించింది. బాధితుడి భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు గాను అతడికి 1,10,000 యెన్ల(భారత కరెన్సీలో 70 వేల రూపాయలు) నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ.. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘అతడి భార్యకు, నాకు మధ్య జరిగినది చట్టరీత్యా నేరం కాదు. దాని వల్ల వారి వైవాహిక జీవితానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’ అని తెలిపింది. వైవాహిక జీవితంలో శాంతిని దెబ్బతీసే చర్యలను తప్పుగానే భావించాలని, పెళ్లయిన యువతితో లైంగిక సంబంధం పెట్టుకుని అశాంతి కలిగించినందుకు జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, కోర్టు తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. స్వలింగ సంపర్కాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్పు ఉందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. నచ్చిన వ్యక్తులు.. పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిస్తే తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓ కేసు సందర్భంగా కూడా టోక్యో హైకోర్టు ఇలాంటి తీర్పునే వెల్లడించింది. తన మహిళా భాగస్వామని మోసం చేసినందుకు గాను ఆమెకి పరిహారం చెల్లించాల్సిందిగా ఓ మహిళను ఆదేశించింది. ఈ జంట ఏడు సంవత్సరాలు కలిసి జీవించినట్లు సమాచారం. వారు యుఎస్ లో వివాహం చేసుకున్నారు మరియు పిల్లల్ని కనడం గురించి కూడా చర్చించారు. ఈ క్రమంలో భాగస్వామి తనను మోసిం చేసిందని మరొక యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు మహిళా భాగస్వామికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సదరు మహిళను ఆదేశించింది. చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్ -
కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో...
కరీంనగర్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. 20 రోజుల కిందట ఇది జరగగా పోలీసు విచారణతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్ర కారం.. మానుపాటి రాజయ్య(35) కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ రేకుర్తిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజయ్య ఈ నెల 5న పని ముగించుకొని తిరిగి ఇంటికి రాలేదని అతని భార్య లత ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు 7న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ 16న మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. దీంతో ఇక్కడి పోలీసులు రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా మృతదేహం అతనిదేనని గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు ఆటోడ్రైవర్ ఎనగండుల బాబుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్య లతతో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. అతన్ని అడ్డు తొలగించాలని లత కోరడంతో బాబు ఈ నెల 5న రాజయ్యను కల్లు తాగుదామని తన స్వగ్రామం హుస్నాబాద్ మండలం మడదకు ఆటోలో తీసుకెళ్లాడు. కల్లు తాగాక చంపడం వీలుకాకపోవడంతో తిరిగి తీసుకువస్తున్నాడు. లత ఫోన్ చేసి, చంపేయాలని పట్టుబట్టింది. దీంతో బాబు ముంజంపల్లి కెనాల్ వద్దకు తీసుకువెళ్లి, రాజయ్యకు మళ్లీ కల్లు తాగించాడు. అతని మెడపై బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. తర్వాత కెనాల్లోకి నెట్టేసి, బాబు ఇంటికి వెళ్లాడు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు లత, బాబు ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. చదవండి: ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది... 'మీ నాన్నలాగే నిన్ను కూడా చంపేస్తా' -
తల్లితో వివాహేతర సంబంధం.. బుద్ధి చెప్పేందుకు
ముంబై: తల్లితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కిడ్నాప్‌నకు యత్నించి పోలీసులకు చిక్కాడు మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల బాలుడు. నాగ్‌పూర్‌కి చెందిన బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్‌పై తీసుకెళ్లే క్రమంలో, బాధితుడు తప్పించుకోవడంతో విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్జీ హౌస్ చౌక్ ప్రాంతంలో నివాసముంటున్న బాలుడి తల్లి, ప్రదీప్ నందన్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై ఆమె, ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలత చెందిన బాలుడు తన తల్లి ప్రియుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నందన్వర్ కిడ్నాప్‌నకు కుట్ర పన్నాడు. (చదవండి: సవతి తల్లిపై నటుడి అత్యాచారం! ) ఈ క్రమంలో ముగ్గురు యువకులు కలిసి నందన్వర్ పని చేసే కార్యాలయం నుంచి అతన్ని అపహరించి బైక్‌పై తీసుకెళ్తుండగా, ఓ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనపడటంతో నందన్వర్ రన్నింగ్ బైక్ నుంచి దూకేశాడు. పోలీసులను గమనించిన యువకులు నందన్వర్‌ను వదిలేసి పరారయ్యారు. నిందితుల నుంచి తప్పించుకున్న నందన్వర్ బాలుడి తల్లికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం అంగీకరించారు. ఆ ముగ్గురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు -
‘నీ మరదల్ని చంపేశా.. వెళ్లి చూసుకోండి’
సాక్షి, అనంతపురం : నగరంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. అనుమానంతో ప్రియుడే ఆమెను కడతేర్చాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. నగరానికి చెందిన యశోద (32)కు రాణినగర్‌కు చెందిన శంకర్ అనే రాడ్‌బెండర్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్‌తేజ్, యశ్వంత్ అనే కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జునతో యశోదకు పరిచయం ఏర్పడి సహజీవనం చేశారు. రెండేళ్లుగా నగరంలోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్లో చేర్పించింది. చదవండి: ఏ తల్లిని కదలించినా కన్నీటీ ధారలే.. అనుమానంతోనే కడతేర్చాడు.. యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం వచ్చింది. ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్‌తో తలపై బలంగా మోదడంతో తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. అనంతరం మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. చదవండి: స్నేహితుడిని చంపి సూట్‌కేస్‌లో కుక్కి.. ‘చంపేశా..వెళ్లి చూసుకోండి’ ‘నీ మరదల్ని చంపేశా. వెళ్లి దాన్ని చూసుకోండి’ అంటూ యశోద బావ (అక్క విజయలక్ష్మి భర్త) సంజీవ్‌కుమార్‌కు ఆదివారం ఉదయం మల్లికార్జున ఫోన్ చేసి చెప్పాడు. దీంతో సంజీవ్‌కుమార్ దంపతులు హుటాహుటిన అశోక్‌నగర్‌కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెందింది. దీంతో అక్క విజయలక్ష్మి బోరున విలపించింది. తన చెల్లిని చంపి పిల్లలిద్దరినీ అనాథల్ని చేశాడంటూ మల్లికార్జునకు శాపనార్థాలు పెట్టింది. వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
బాగా చదువుకో.. వెళ్తున్నా !
సాక్షి, మహానంది (కర్నూలు): ‘బాగా చదువుకో.. ఆరోగ్యం జాగ్రత్త.. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి’ అంటూ బిడ్డకు మంచి మాటలు చెప్పి వెనుదిరిగిన ఆ తల్లి కాసేపటికే అనంతలోకాలకు చేరుకుంది. టైర్ పంక్చర్ కావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిన ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన మహానంది మండలం నందిపల్లె వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన నారాయణమ్మ, శ్రీను కుమార్తె లావణ్య పాణ్యం మండలం నెరవాడలోని గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కూతురిని చూసేందుకని ఉదయం బైక్‌పై వచ్చారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెనుదిరిగారు. మార్గంమధ్యలో నందిపల్లె సమీపంలోకి చేరుకోగానే బైకు టైరుకు మేకు గుచ్చుకుని పంక్చర్ అయింది. వెనుక కూర్చున్న నారాయణమ్మ ఒక్కసారిగా జారి కిందపడటంతో చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్, రోడ్ సేఫ్టీ సిబ్బంది రసూలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! అడ్డుగా ఉన్నాడనే కడతేర్చింది పట్నంబజారు(గుంటూరు): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలసి భర్తను కడతేర్చిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్ వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె. సుప్రజ, స్టేషన్ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉండే పి.కె.మరియదాసు (40) మార్చుల్ పని చేస్తాడు. అతడికి 22 ఏళ్ల కిందట మరియమ్మతో వివాహం జరగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కొడుకు సుధాకర్ మిర్చి యార్డులో పని చేస్తున్నాడు. కుమార్తె వేమూరులో ఉంటుండగా మరియమ్మ అక్కడకు వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో పెరవలి గ్రామానికి చెందిన గుంటూరు అనిల్‌బాబు అనే ఆటోడ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దికాలానికి విషయం తెలుసుకున్న భర్త మరియదాసు భార్య మరియమ్మను హెచ్చరించడం ప్రారంభించారు. నిత్యం మద్యం తాగి వేధిస్తుండటంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలసి పథకం వేసింది. (చదవండి: డబ్బుల కోసం వేధించి.. గొంతు నులిమి చంపేశాడు) వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుప్రజ, ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు ఈనెల 7వ తేదీ రాత్రి 1గంట సమయంలో కుమారుడు మిర్చి యార్డుకు పనికి వెళ్లిన తరువాత, అనిల్‌బాబు, మరియమ్మలు కలసి మరియదాసు గొంతుకు తాడును బలంగా బిగించి, రోకలి బండతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తర్వాత కుమారుడు సుధాకర్‌కు ఫోన్ చేసి తండ్రి మరియదాసు ఫూటుగా మద్యం తాగి ఎక్కడో పడి గాయపడ్డాడని చెప్పి అక్కడ నుంచి పరారయ్యారు. సుధాకర్ బంధువులకు సమాచారాన్ని అందించాడు. అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు కాంతారావు విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కాగా హత్య జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం రాజీవ్‌గాం«దీనగర్‌కు చెందిన వలంటీర్ ద్వారా ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు, రోకలిబండ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్
దుబాయ్: దుబాయ్ పాలకుడి భార్య ఆమె బాడీగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీని గురించి బయటకు వెళ్లడించకుండా ఉండటానికి అతడికి భారీ ఎత్తున నగదు.. ఖరీదైన బహుమతులు ఇచ్చిందనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మెయిల్ ఆన్లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బ్రిటీష్ బాడీగార్డు రస్సెల్ ఫ్లవర్స్‌తో అక్రమ సంబంధం నెరపుతుంది. దీని గురించి రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2మిలియన్ డాలర్ల నగదు(రూ. 8,88,59,400)తోపాటు 12 వేల డాలర్ల విలువైన వాచ్, అరుదైన షాట్‌గాన్ ఇచ్చినట్లు మెయిల్ ఆన్లైన్ వెల్లడించింది. రస్సెల్ భార్య మాట్లాడుతూ.. ‘హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతలు ఇచ్చి లొంగదీసుకుంది.. తనని ఆమె దగ్గరే ఉంచుకుంది’ అని తెలిపింది. వీరిద్దరి బంధం గురించి తెలియడంతో రస్సెల్ భార్య ఎంతో బాధపడిందని.. వారి నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికేందుకు సిద్దమయ్యిందని మెయిల్ ఆన్లైన్ తెలిపింది. (ఫేస్‌మాస్క్‌లు చోరీ : సంచలన తీర్పు) ప్రిన్సెస్ హయా, ఆమె 70 ఏళ్ల మాజీ భర్త మధ్య హైకోర్టు విచారణ సందర్భంగా బాడీగార్డుతో ఆమెకున్న రహస్య సంబంధం వెలుగులోకి వచ్చింది. లండన్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్‌లో భాగంగా ఈ వివరాలు వెలువడ్డాయి. ప్రిన్సెస్ హయా తన మగ అంగరక్షకులలో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని దీనిలో పేర్కొన్నారు. ప్రస్తుతం హయా తన ఇద్దరు పిల్లలతో వెస్ట్ లండన్‌లోని కెన్సింగ్టన్లో నివాసం ఉంటున్నారు. -
పట్టించిన టైలర్ లేబుల్.. రెండో ప్రియుడితో కలిసి..
యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను హతుడు ధరించి ఉన్న చొక్కా టైలర్ లేబుల్ పట్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులను కేవలం 12 రోజుల్లో అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గత నెల 26వ తేదీన పుల్లలచెరువు నుంచి గంగవరం వెళ్లే దారిలో 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుర్తుతెలియన వ్యక్తి హత్యకు గురైనట్లు సీఐ దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో అతడి చొక్కాపై ఉన్న టైలర్ లేబుల్ ఆధారంగా మృతుడిది గుంటూరు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన వాడుగా గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతుడు వినుకొండ మండలం ఉప్పరపాలేనికి చెందిన తిరుమల శ్రీనుగా గుర్తించారు. శ్రీను గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, పుల్లలచెరువు ప్రాంతాల్లో తిరుగుతూ నైటీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అతడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. తన స్వగ్రామం ఉప్పరపాలెంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అదే గ్రామానికి చెందిన గోళ్ల నాగార్జునతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని గ్రహించిన శ్రీను ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. శ్రీనును అడ్డు తొలగించుకోవాలని ఆమె మరో ప్రియుడు నాగార్జునతో కలిసి పథకం వేసింది. పథకంలో భాగంగా పుల్లలచెరువులో నైటీలు అమ్ముదామని ఆమె శ్రీనుతో చెప్పింది. గంజాయి తాగే అలవాటు ఉన్న శ్రీను.. ఆమెతో కలిసి గంగవరం రోడ్డులోని నిర్మానుష్య స్థలంలోకి వచ్చాడు. అక్కడ వేచి ఉన్న ఆమె రెండో ప్రియుడు నాగార్జున కర్రతో దాడి చేసి శ్రీనును తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెతో కలిసి టవల్‌తో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. గతంలో నిందితుడు నాగార్జున ఒక యువతిని మోసం చేశాడు. హతుడు అప్పట్లో బాధితురాలికి అండగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉండటంతో శ్రీనును నాగార్జున హత్య చేశాడు. హత్యానంతరం నిందితుడు హతుడి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లాడు. తన తండ్రి అంజయ్యకు విషయం చెప్పి అది ఇచ్చాడు. ఆ గొలుసును అమ్మి పెట్టాలని ఆయన తమ సమీప బంధువు రావులపల్లి హనుమంతయ్యకు ఇచ్చాడు. మృతుడి బంగారు గొలుసు, హత్యకు ఉపయోగించిన కర్ర, నిందితుల సెల్ఫోన్లు, నాగార్జునకు చెందిన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగార్జున, హతుడి ప్రియురాలు, అంజయ్య, హనుమంతయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే హత్య కేసును ఛేదించిన సీఐ దేవప్రభాకర్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పి.ముక్కంటి, వి.హరిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు అంజి, హుస్సేన్, రమేష్‌లను డీఎస్పీ అభినందించారు.