
సాక్షి : పెళ్లి కూతురిపై అనుమానంతో ఓ పెళ్లి కొడుకు చేసిన పని.. దానిని నిజమని నిరూపించింది. పెళ్లి వేదికలోనే ‘హాట్’ టాపిక్‌గా మారేలా ఓ వీడియో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అతగాడు. అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మొత్తం మారిపోయి.. రచ్చ మొదలైంది. సింగపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్లితే...
తొలుత వధూవరులు గతంలో కలిసి తిరిగిన దృశ్యాలతో ప్రారంభమైన వీడియో, ఒక్కసారిగా, ఆమె వేరేకరితో చనువుగా ఉన్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. ఆ వ్యక్తితో కలసి హోటల్ రూమ్ లోకి వెళ్లడం, ఆపై అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం అందులో స్పష్టంగా కనిపించింది. ఇంకేం పెళ్లి కూతురు అసలు స్వరూపం బయటపడటంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో అవమానభారంతో పెళ్లి కూతురు వేదికను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది.
నిశ్చితార్థం అయ్యాక పెళ్లి కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతను అజాక్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించాడు. జుహో అనే 42 ఏళ్ల మహిళా డిటెక్టివ్ ఈ కేసును టేకప్ చేసింది. ఆరు వారాలుగా పెళ్లి కూతురిని వెంబడిస్తూ ఆమె ప్రతీ కదలికలను పరిశీలిస్తూ.. వాటిని వీడియో రూపంలో భద్రపరచసాగింది. చివరకు ఆమె ఓ వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందన్నది ధృవీకరణ కావటంతో పెళ్లి కొడుకుకి తెలియజేసింది.
అలా ఈ వ్యవహారం అంతా పబ్లిక్ అయిపోయిందన్న మాట. ఇంతకీ వారి వివరాలేంటీ? ఆ ఈ వివాహాన్ని వారు రద్దు చేసుకున్నారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరావటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment