సాక్షి, నిజామాబాద్: జక్రాన్‌పల్లి మండలం సికింద్రపూర్ గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ముర్ మృతులను ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన చిత్తరి సాయి కుమార్(30), శైలజ(28) లుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు, శైలజ భర్త కొంతకాలం క్రితం మృతి చెందినట్లు సమాచారం.
చదవండి: నవ వరుడి విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment