అబ్దుల్లాపూర్‌మెట్‌ జంట హత్యల కేసు: భర్త శ్రీనివాసే సూత్రధారి | Abdullapurmet Couple Case: Victim Husband Main Culprit | Sakshi
Sakshi News home page

యశ్వంత్‌-జ్యోతి.. వివాహేతర సంబంధమే వీళ్ల ప్రాణం తీసింది

Published Wed, May 4 2022 12:29 PM | Last Updated on Wed, May 4 2022 4:34 PM

Abdullapurmet Couple Case: Victim Husband Main Culprit - Sakshi

మృతులు యశ్వంత్‌, జ్యోతి (ఫైల్‌ ఫోటో )

నిర్మానుష్య ప్రాంతంలో నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహం కలకలం సృష్టించింది. అయితే ఈ కేసులో అనుమానాలు నిజం అయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించగా.. ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఊహించినట్లుగానే వివాహేతర సంబంధం ఈ హత్యకు ప్రధాన కారణంగా తేలింది. జ్యోతి భర్త శ్రీనివాసరావే నిందితుడిగా గుర్తించారు.

జ్యోతితో యశ్వంత్‌కు గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉండడంతో.. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు శ్రీనివాస్‌  పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌తో పాటు ఈ హత్యలో అతనికి నలుగురు సహకరించినట్లు సమాచారం. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్‌(22) క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు.  అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వీళ్ల మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. యశ్వంత్‌ తలపై బలమైన గాయం కాగా, జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తులు ఉన్నాయి.

వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఆ దిశగానే క్లూస్‌ లభించడం విశేషం. ఇదిలా ఉంటే.. హత్యకు గురైన మహిళతో యశ్వంత్‌కు పరిచయం ఉన్న విషయం తెలియదని యశ్వంత్‌ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్త: హైదరాబాద్‌ శివారులో నగ్నంగా మృతదేహాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement