
అక్రమ సంబంధాలపై...సినిమా చేస్తా!
వైవాహిక జీవితం అనేది నమ్మకంతో ముడిపడింది. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ఆ బంధం బ్రహ్మాండంగా సాగుతుంది. ఆ సంగతలా ఉంచితే,
‘‘వైవాహిక జీవితం అనేది నమ్మకంతో ముడిపడింది. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ఆ బంధం బ్రహ్మాండంగా సాగుతుంది. ఆ సంగతలా ఉంచితే, జీవిత భాగస్వామిని మోసం చేస్తూ, కొంతమంది బతుకుతారు. అది తప్పు. భార్యను ఇంటికి పరిమితం చేసి, బయట ఇంకో అమ్మాయితో తిరుగుతారు. అలా బతకడం ఎందుకు? భార్యకు విడాకులిచ్చి, నిక్షేపంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా? అలాగే, భర్తను మోసం చేసే భార్యలూ లేకపోలేదు. కానీ, సమాజానికి భయపడి దొంగచాటు వ్యవహారాలు సాగించేస్తారు. నాకెప్పటికైనా అక్రమ సంబంధాల మీద సినిమా తీయాలని ఉంది. ప్రేమించడం తప్పు కాదు. కానీ, పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించాలి. ఒకవేళ పెళ్లి కాకపోతే, వేరేవాళ్ల భర్తతో మాత్రం ప్రేమలో పడకూడదు. వేరేవాళ్ల భర్తలు, భార్యలు మనకెందుకు? అది తప్పు కదా!’’
- విద్యాబాలన్