ప్రతీకాత్మక చిత్రం
ప్రకాశం (దర్శి టౌన్) : భార్యతో చనువుగా ఉంటున్న పక్కింటి యువకుడిని భర్త పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణంగా హత్య చేశారని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. దర్శి మండలం వెంకటాచలంపల్లి పంచాయితీ పరధిలోని నడిమిపల్లెలో ఈనెల 7న జరిగిన యువకుని హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం దర్శి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వెల్లడించారు. వివరాలు.. నడిమిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన బోనం బాలచెన్నయ్య భార్య శివకుమారితో చనువుగా ఉంటున్నాడు.
ఈ విషయం బాలచెన్నయ్యకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలంటూ సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు. ఈ నెల 6వ తేదీ రాత్రి శివకుమారి, సత్యనారాయణ చనువుగా ఉండటాన్ని గమనించిన బాలచెన్నయ్య కోపోద్రిక్తుడయ్యాడు. సత్యనారాయణకు అడ్డుతొలగిస్తే తప్ప తన సంసారం బాగుపడదని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని తన బంధువుల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన చెందాడు. ఈనెల 7వ తేదీన సత్యనారాయణ తన కనకాంబరాల తోటకు వెళ్లి వస్తుండగా బాల చెన్నయ్య, అతని బంధువులు కలిసి కత్తి, గడ్డపార, బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణను బంధువులు గమనించి వైద్యశాలకు తీసుకెళ్లేలోగా మృతి చెందాడు.
హతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రÔóఖర్ కేసు నమోదు చేసి సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు బోనం బాలచెన్నయ్యతోపాటు అతనికి సహకరించిన బోనం చిన వీరయ్య, బోనం శివకుమారి, బోనం వెంకట లక్ష్మి, బోనం అంకమ్మ, పుప్పాల అంకమ్మ, పుప్పాల వెంకటేశ్వర్లు, పార్శపు హనుమంతును బుధవారం దర్శి సీఐ అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment